Off The Record: రౌడీ షీటర్ శ్రీకాంత్‌కు పెరోల్ వ్యవహారం సింహపురి పాలిటిక్స్‌లో ప్రకంపనలు రేపుతోంది. ఇద్దరు ప్రజా ప్రతినిధుల్ని చుట్టుముండుతోంది. గూడూరుకు చెందిన శ్రీకాంత్ ఓ హత్య కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్నాడు. నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీ… పెరోల్‌కి దరఖాస్తు చేసుకోగా.. హోం శాఖ అనుమతి ఇచ్చింది. ఈ వ్యవహారంలో శ్రీకాంత్ ప్రియురాలు అరుణ చక్రం తిప్పిందన్న వార్తలు గుప్పుమంటున్నాయి. తిరుపతి ఎస్పీ వద్దన్నా.. జైల్ సూపరింటెండెంట్ కాదన్నా.. వాళ్ళు ఎవరూ ఈ రౌడీషీటర్ బయటికి రాకుండా ఆపలేకపోయారు. చివరికి పెరోల్ మీద విడుదలయ్యాక రచ్చ జరగడంతో… గతుక్కుమన్న హోం శాఖ దాన్ని రద్దు చేసి తిరిగి జైలుకు పంపింది. ఆ విషయంలో స్వయంగా హోం మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి రావడం కలకలం రేపుతోంది. శ్రీకాంత్ బయటికి రావడానికి, చిరిగి లోపలికి వెళ్ళడానికి మధ్య జరిగిన డ్రామా… నెల్లూరు రాజకీయాల్ని ఓ కుదుపు కుదుపుతోంది. అంతకు మించి ఏపీ హోం శాఖ వైపు అనుమానపు చూపులు చూసేలా చేసిందన్న చర్చ జరుగుతోంది.
Read Also: Pilli Sattibabu Resigns: చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన పిల్లి సత్తిబాబు
ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలతోనే రౌడీషీటర్‌కు పెరోల్ వచ్చిందన్న ప్రచారం విస్తృతంగా జరుగుతోంది నెల్లూరులో. వాళ్ళతో పాటు ఓ మంత్రి హస్తం కూడా ఉందన్న వార్తలు ఇంకా సంచలనం అవుతున్నాయి. అసలు వీళ్ళంతా కలిసి ఓ రౌడీషీటర్‌ని పెరోల్ మీద బయటికి తీసుకువచ్చి ఏం చేయించాలనుకున్నారన్నది ఇప్పుడు పొలిటికల్ హాట్ అయింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, గూడూరు ఎమ్మెల్యే సునీల్ సిఫారసు లేఖలు ఇచ్చారని, దాన్ని మంత్రి ఎండార్స్ చేస్తూ ఎగ్జామ్ ఇన్ సర్క్యులేట్ అంటూ ముఖ్య కార్యదర్శిని ఆదేశించారని చెప్పుకుంటున్నారు. అక్కడితో మంత్రి పాత్ర అయిపోగా… శ్రీకాంత్ ప్రియురాలు అరుణ తనకున్న పరిచయాలతో సచివాలయంలో చక్రం తిప్పి త్వరగా ఫైల్ మూవ్ చేయించుకున్నారన్న చర్చ జరుగుతోంది. అక్కడ అఖిల భారత సర్వీసు అధికారులు ఇద్దరు సహకరించారట. అసలు ఇంత మంది కలిసి ఓ రౌడీ షీటర్‌కు పెరోల్ ఇప్పించాల్సిన అవసరం ఏం వచ్చిందన్న చర్చ మొదలై రచ్చగా మారడంతో అలర్ట్ అయిన ముఖ్యమంత్రి కార్యాలయం పూర్తి నివేదిక కోసం హోం శాఖను ఆదేశించింది. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి శ్రీకాంత్ అనుకూలంగా పనిచేస్తారని, నేతలకు అనుకూలంగా బెదిరింపులకు పాల్పడతారన్న ప్రచారం ఉంది. ఇతనికి గతంలో వైసీపీ హయాంలో ఓసారి పెరోల్‌గా… కూటమి అధికారంలోకి వచ్చాక రెండోసారి వ్యవహారం రచ్చ అయింది.
Read Also: Nagarjuna : నాగార్జునకు ఫిదా అయిన తమిళ తంబీలు.. ఎందుకంటే..?
గత ప్రభుత్వంలో సత్ప్రవర్తన కలిగిన ఖైదీ ముసుగులో శ్రీకాంత్‌ను క్షమాభిక్షపై విడుదల చేయించేందుకు అప్పటి ఎమ్మెల్యే ఒకరు విశ్వప్రయత్నం చేశారట. అప్పట్లో కుదరలేదు. ఇప్పుడు అధికార పార్టీలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు పెరోల్ సిఫారసు లేఖలు ఇవ్వడం చూస్తుంటే… శ్రీకాంత్ కోసం నేతలు ఎంత పరితపిస్తున్నారో అర్ధమవుతోందన్న చర్చ జరుగుతోంది రాజకీయవర్గాల్లో. క్షమాభిక్ష అర్హతలేని వ్యక్తికి పెరోల్ సిఫారసు లేఖ ఇవ్వడమా అంటూ ముక్కున వేలేసుకుంటున్నాయట నెల్లూరు రాజకీయవర్గాలు. అదే సమయంలో… రౌడీ షీటర్‌తో ఎమ్మెల్యేలకు ఉన్న ఆటాచ్‌మెంట్ కారణంగానే సిఫారసు లేఖలు ఇచ్చారన్న గుసగుసలు సైతం వినిపిస్తున్నాయట జిల్లాలో. అదే సమయంలో మరో వాదనా వినిపిస్తోంది. ఏదో లెటర్ ఇచ్చాంగానీ… ఇంత రచ్చ అవుతుందని అనుకోలేదు…. అసలెందుకు ఆ పని చేశామా అని శాసనసభ్యులు ఫీలవుతున్నారన్న ప్రచారం సైతం జరుగుతోంది సింహపురి పొలిటికల్ సర్కిల్స్‌లో. ఇప్పుడీ వ్యవహారంలో డైరెక్ట్‌గా సీఎంవో జోక్యం చేసుకుని నివేదికలు అడుగుతుండటంతో… ఇటు రాజకీయ నాయకులకు, అటు సచివాలయంలోని అధికారులకు షేకవుతోందట. రౌడీ షీటర్‌కి, ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులకు మధ్య ఉన్న సంబంధాలేమిటి..? రొటీన్‌లో భాగంగా మానవత్వంతో సిఫారసు లేఖ ఇచ్చారా లేక వ్యక్తిగత స్వార్థాలు ఉన్నాయా అన్న విషయంలో క్లియర్‌కట్ నివేదిక కావాలని కోరిందట సీఎంవో.
Read Also: Nagarjuna : నాగార్జునకు ఫిదా అయిన తమిళ తంబీలు.. ఎందుకంటే..?
ఇక్కడే ఇంకో ఇంట్రస్టింగ్ పాయింట్ తెర మీదికి వస్తోంది. అసలా ఇద్దరు ఎమ్మెల్యేలు ఇచ్చిన సిఫారసు లేఖలు రిజెక్ట్ అయ్యాయన్నది ఆ వెర్షన్. అదే సమయంలో నియోజకవర్గాలకు చెందిన ప్రజాప్రతినిధులుగా సిఫారసు లేఖలు ఇచ్చినంత మాత్రాన వాళ్ళకు రౌడీ షీటర్‌తో వారికి సంబంధాలు ఉన్నట్టేనా అని కూడా మాట్లాడుకుంటున్నారట కొందరు. శ్రీకాంత్ పెరోల్ మొదట రిజెక్ట్ అయ్యాక ఆయన ప్రియురాలు అరుణ హోంశాఖలో చక్రం తిప్పిందన్న ప్రచారం నడుస్తోంది. తనకున్న పాత పరిచయాలకి మెరుగు పెట్టి పెరోల్ విషయంలో ఆమె చక్రం తిప్పినట్టు చెప్పుకుంటున్నారు. అటు ఇద్దరు ఎమ్మెల్యేలు పెరోల్ ఇచ్చారన్న వ్యవహారంపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి సైతం తనదైన శైలిలో సెటైర్లు వేశారు. తన కార్యాలయానికి ఓ మహిళ వచ్చి సిఫారసు లేఖ అడిగిందని, అందుకు తాను ఒప్పుకోలేదన్నారు. మిగిలిన ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఇంతవరకు స్పందించకపోవడంతో అందరి కళ్ళు అటువైపే తిరుగుతున్నాయి.