ఓపెన్ విత్ కేటీఆర్ బైట్ చారి గురించి చెప్పింది చిన్నగా ఈ మాటలే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్న ఈ మాటలే ఇప్పుడు భూపాలపల్లి కారులో తీవ్ర దుమారం రేపుతున్నాయట.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు.... కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే...త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాగా... అధికార పార్టీగా... ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ చేయి దాటి పోనివ్వకూడదన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో... ఈ ఎన్నికల యుద్ధంపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక పరిస్థితులు మెల్లిగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆయన అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న వెంటనే... రకరకాల విశ్లేషణలు జరిగాయి. అయితే... ఓవరాల్‌గా ఆయన టీడీపీని వ్యతిరేకించే వ్యక్తి కాదని, కూటమి ప్రయాణం కూడా సాఫీగానే సాగుతుందని లెక్కలేశారు. అయితే... టైం గడిచేకొద్దీ.... ఆయన స్వరం సవరించుకుంటున్న సంకేతాలు కనిపిస్తున్నాయంటున్నారు రాజకీయ పరిశీలకులు.
2024 ఎన్నికల్లో జనసేనను బలంగా నిలబెట్టిన జిల్లాల్లో ఒకటి ఉమ్మడి పశ్చిమగోదావరి. ఇక్కడ మొత్తం 15 అసెంబ్లీ సీట్లు ఉంటే... ఆరు చోట్ల పోటీ చేసి గెలిచింది గ్లాస్ పార్టీ. అయినా సరే.... తమకు సరైన గుర్తింపు దక్కడం లేదని తెగ ఫీలైపోతున్నారట లోకల్ లీడర్స్. నిడదవోలు నుంచి గెలిచిన కందుల దుర్గేష్‌కు మంత్రి పదవి దక్కింది. ఆయనతో సహా... మిగతా నియోజకవర్గాల నేతలంతా... స్థానిక తెలుగుదేశం నాయకులు తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని లోలోపల రగిలిపోతున్నట్టు…
పులి మీదొట్టు… పచ్చి రాజకీయం చేసేస్తాం. రాజీనామా డ్రామాలాడేస్తామని అక్కడి రాజకీయ నేతలంతా అంటున్నారా? తిలా పాపం తలా పిడికెడు అన్నట్టు ఆ ఎపిసోడ్లో అందరి ప్రమేయం ఉన్నా… ఎవరికి వారు తూచ్… మాకు సంబంధం లేదంటూ పక్క పార్టీ మీదికి నెట్టేస్తున్నారా? ఏంటా ఎపిసోడ్? ఎందుకు ఆ స్థాయి రాజకీయ డ్రామాలు నడుస్తున్నాయి? కొమురం భీం కన్జర్వేషన్ రిజర్వ్….. పులుల సంరక్షణ కోసం ఈ పేరిట మొన్న మే 30న తెలంగాణ అటవీ శాఖ జీవో…
Off The Record : ఏం…. నాకేం తక్కువ? నాకు ఎందుకు ఇవ్వరు గవర్నర్ పదవి? గౌరవంగా రిటైర్ అవుదామని నాకు మాత్రం ఉండదా? నాకు మాత్రం మనసు లేదా? దానికి మనోభావాలు ఉండవా? అవి హర్ట్ అవవా అని అంటున్న ఆ టీడీపీ సీనియర్ ఎవరు? పార్టీ అధిష్టానం ఆయన్ని ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదు? అశోక్‌గజపతికి పదవి వచ్చాక ఆయనలో అసహనం కట్టలు తెంచుకుంటోందన్నది నిజమేనా? ఎవరా టీడీపీ సీనియర్? ఎంటా వ్యథ? యనమల రామకృష్ణుడు..…
ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల్లో అలజడి రేగుతోందా? ఇదెక్కడి గొడవరా… బాబూ… అంటూ తలలు బాదుకుంటున్నారా? ప్రభుత్వ ఆశయం మంచిదైనా… అమలు తీరు సరిగా లేక మమ్మల్ని బలి పుశువుల్ని చేస్తోందని ఫీలవుతున్నారా? ఏం… మాకేమన్నా లక్షలకు లక్షల జీతాలు వస్తున్నాయా? మేమేమన్నా కోట్లకు తీరిపోయామా అన్న మాటలు ఉద్యోగుల నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? ఏ విషయంలో ఆందోళ మొదలైంది? పీ..ఫోర్ కార్యక్రమాన్ని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సమాజంలో ఉన్న ధనికులు పేదల్ని…
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో బీజేపీ వ్యూహం ఎలా ఉంది? ఏపీలో పొత్తులున్నా… తెలంగాణలో మాత్రం మేం సింగిల్ అంటున్న కమల నేతలు… జూబ్లీహిల్స్‌లో కూడా అదే స్టాండ్ తీసుకుంటారా? అక్కడ బలంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఓట్ బ్యాంక్ పరిస్థితి ఏంటి? అసలు తెలంగాణలో టీడీపీని ఎందుకు వద్దనుకుంటోంది కాషాయ పార్టీ? లెక్కల్లో ఎక్కడ తేడా కొడుతోంది? బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలుగా ఉన్నాయి టీడీపీ, జనసేన. ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీలు కలిసి అధికారాన్ని…