భద్రాద్రి జిల్లాకు హెడ్ క్వార్టర్ కొత్తగూడెం. ఈ జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకుగాను... ఒక్క కొత్తగూడెం మాత్రమే జనరల్ సీటు. మిగతా నాలుగు ఎస్టీ రిజర్వ్డ్. ఇక నియోజకవర్గంలో మొన్నటి వరకు రెండు మున్సిపాలిటీలు ఉండగా... అందులో పాల్వంచకు రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. దీంతో పట్టుబట్టి రెండు మున్సిపాలిటీలకు మరి కొన్ని గ్రామాలను కలిపి కార్పొరేషన్‌గా చేయించారు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు.
హ్యాట్రిక్ విజయాలు..., చిన్న వయసులోనే కేంద్ర మంత్రి పదవి...., మంచి వాగ్ధాటి, రాజకీయ వారసత్వం కలిసొచ్చి డైనమిక్ లీడర్‌గా గుర్తింపు. శ్రీకాకుళం ఎంపీ, సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడి గురించి చెప్పుకునే పాజిటివ్ మాటలివి. అన్నట్టుగానే... ఇందులో ఏదీ అసత్యం లేదు, కాదనేవాళ్ళు ఎవరూ లేరు.
యాపారం.. ఇది అలాంటిలాంటి యాపారం కాదు. అయోధ్య రామయ్యనే అంగడి సరకు చేసేసిన ఫక్తు బిజినెస్. విశాఖ బీచ్ రోడ్లో సముద్రుడి సాక్షిగా... భక్తుల మనోభావాలతో ఆడుకున్న పరమ వికృత వ్యాపారం. ఇక్కడ పైకి చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంది. అబ్బో... వీళ్ళెవరో మహానుభావులు..... అయోధ్య దాకా వెళ్ళలేని వాళ్ళ కోసం ఆ బాల రాముడినే మన ముందుకు తీసుకువచ్చారని అనిపిస్తుంది.
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల కోసం బీజేపీ కొత్త స్కెచ్ సిద్ధం చేస్తోందా? ఆ దిశగా ఇప్పటికే పార్టీ వర్గాలకు సమాచారం అందుతోందా? ఏదో… నామ్‌కే వాస్తే… పోటీలో ఉన్నామంటే ఉన్నామన్నట్టు కాకుండా… ఈసారి బుల్లెట్ గట్టిగా దించాలని కాషాయ పార్టీ పెద్దలు ఫిక్స్ అయ్యారా? ఏ స్థాయి అభ్యర్థుల్ని బరిలో దించబోతోంది? ఎవరెవర్ని సిద్ధంగా ఉండమని సంకేతాలు పంపుతోంది? స్థానిక సంస్థల ఎన్నికల కోసం తెలంగాణ బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. అది కూడా అలా…
ఆ సీనియర్ ఎమ్మెల్యే మిత్రపక్షాలను గట్టిగా టార్గెట్ చేయడం వెనక ఆంతర్యం ఏంటి? చేతకాకుంటే సన్యాసం తీసుకోవాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వచ్చాయి? ఆ కాషాయ నేత కొత్త అగ్గి రాజేస్తున్నారా? అసలు ఆయన కోపానికి కారణం ఏంటి? ఎవరి భుజం మీద తుపాకీ పెట్టి ఎవర్ని కాల్చాలనుకుంటున్నారు? పెన్మత్స విష్ణుకుమార్ రాజు. విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అండ్ బీజేఎల్పీనేత. వైసీపీ అంటే అస్సలు గిట్టదని చెప్పుకుంటారు. అంతర్గతంగా పరిచయాలు ఎలా వున్నా……
తెలంగాణ కాంగ్రెస్ మారిపోయిందా? నాయకుల్లో పరిణితి పెరిగిపోయిందా? చిన్న ఛాన్స్ దొరికితే చాలు చెలరేగిపోయి అవతలోళ్ళని ఆడేసుకుందామని ఆరాటపడే నాయకుల్లో కూడా మార్పు వచ్చిందా? ఇంతకీ ఈ పరిణితి చర్చలు ఇప్పుడెందుకు కొత్తగా జరుగుతున్నాయి? ఏ విషయంలో మార్పు కనిపిస్తోంది? తెలంగాణ కాంగ్రెస్‌లో మార్పు మొదలైనట్టు కనిపిస్తోంది. సందర్భం దొరికితే చాలు…. తమకు అనుకూలంగా వాడేయడం కాంగ్రెస్ పార్టీలో కామన్. కానీ… ఇప్పుడు మాత్రం వాతావరణం దానికి భిన్నంగా నడుస్తోందట. నాయకులంతా మారిపోయారా లేదంటే పార్టీ డీఎన్ఏలోనే…
తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ తీరుతో అధికార పార్టీ నేతలు కూడా తలలు పట్టుకుంటున్నారా? ఎంతటి అధికారి అయినాసరే… అదేదో తమ ఇంట్లో పాలేరన్నట్టుగా ఛైర్మన్ ఫీలైపోతున్నారా? జిల్లా స్థాయి అధికారుల మీదికి సైతం ఒంటికాలి మీద లేస్తూ… బూతు పురాణం అందుకోవడాన్ని ఎలా చూడాలి? ఓవైపు రచ్చ అవుతున్నా… అంతా జనం కోసమేనని ప్రభాకర్‌రెడ్డి చెప్పడం దేనికి సంకేతం? ఓపెన్ విత్ స్పాట్ జేసీ అధికారుల మీద ఫైర్ అవుతున్నది ఇదే… ఈ వైఖరే… ఇప్పుడు కేవలం…
ఆ రెండు పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే శత్రుత్వం ఉందనుకుంటారు. ఆ ఇంటి మీద కాకి ఈ ఇంటిమీద వాలడానికి వీల్లేదన్నట్టుగా ఉంటాయి రెండు పార్టీల నాయకుల స్టేట్మెంట్స్. అలాంటి రెండు పార్టీలకు సంబంధించిన వ్యక్తులు ఇద్దరి ఫోటోలు ఒకే ఫ్లెక్సీలో ఎందుకు కనిపించాయి? ఇద్దరూ కలిసి లంచ్ మీటింగ్‌కు ఎందుకు అటెండ్ అయ్యారు? బ్యాక్‌గ్రౌండ్ స్టోరీ ఏంటి? ఎవరు వాళ్ళు ఇద్దరూ? ప్రీతి రెడ్డి…. అలా చెబితే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు గానీ… మాజీ…
రస్తుం మైన్స్ పార్ట్ టూ స్టార్ట్ అయిందా? క్లైమాక్స్ దిశగా పోలీసుల అడుగులు పడుతున్నాయా? మరో మాజీ మంత్రి కోసం పోలీస్ స్కెచ్ రెడీ అయిందా? ఇక ఏ క్షణాన్నయినా అరెస్ట్ వార్త వినే అవకాశం ఉందా? ఏంటా పార్ట్ టూ? ఎవరా మాజీ మంత్రి? నెల్లూరు జిల్లాలో అక్రమ మైనింగ్ కేసు ఆసక్తికరమైన మలుపులు తిరుగుతోంది. తెల్లరాళ్ళు ఎగిరి ఎటెటో తిరిగి… ఇప్పుడు అంతా ఊహిస్తున్న వైపే పడుతున్నాయట. మైనింగ్ బ్లాస్ట్‌కు ఎగిరొచ్చి పడుతున్న క్వార్ట్జ్…
ఆ జిల్లాలో కాషాయ పార్టీ మొత్తం ఉరుకులు పెడుతుంటే… ఆ ఒక్క నియోజకవర్గంలో ఎందుకు ఉసూరుమంటోంది? అక్కడ కూడా యుద్ధానికి సిద్ధమని సైనికులు అంటుంటే… దళపతి మాత్రం ఎందుకు ముందూ వెనకాడుతున్నాడు? బావ కళ్ళలో ఆనందం కోసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ పార్టీని పణంగా పెడుతున్నారా? అవి కేవలం ఆరోపణలేనా? అందులో నిజం ఉందా? ఎవరా ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న బావా బావమరిది? ఏంటా స్పెషల్ లవ్ స్టోరీ? తెలంగాణలో కాషాయ పార్టీ బలంగా ఉన్న జిల్లాల్లో నిజామాబాద్…