హుజురాబాద్‌లో టీఆర్ఎస్ వ్యూహం ఏంటి? ముల్లును ముల్లుతోనే తీయాలనే సూత్రాన్ని ఎంచుకుందా? గత ఉపఎన్నికలకు భిన్నంగా పార్టీలో సీనియర్లను రంగంలోకి దించుతున్నారా? ఆసక్తి రేకిత్తిస్తోన్న గులాబీ శిబిరం ఎత్తుగడలను ఈ స్టోరీలో చూద్దాం. హుజురాబాద్‌పై పూర్తిస్థాయి పట్టుకోసం దృష్టి ఎన్నికల్లో టీఆర్ఎస్ స్ట్రాటజీ పక్కాగా ఉంటుంది. ఉపఎన్నికల్లో అంతకు మించిన వ్యూహాలు అధికార పార్టీ సొంతం. ఇప్పుడు మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో ఖాళీ అయిన హుజురాబాద్‌లోనూ అలాంటి వ్యూహాలకే పదునుపెడుతోంది గులాబీ పార్టీ. ఉపఎన్నిక…
ఆ జిల్లాలో నేతల మధ్య మెడికల్ కాలేజీ అంశం ప్రకంపనలు సృష్టిస్తోందా? ఎవరికి వారు తమ ప్రాంతాల్లోనే ఏర్పాటు చేయాలని ఉద్యమాలు చేస్తున్నారా? అందుకు తగ్గట్టుగానే అధికార పార్టీ నేతలు పావులు కదుపుతుండటంతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది? ఇంతకీ ఏంటా జిల్లా? ఎవరా నాయకులు? మెడికల్ కాలేజీ కోసం అధికార, విపక్షాలు ఉద్యమం మంచిర్యాల జిల్లాలో వైద్య కళాశాల ఏర్పాటుకు ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటన చేశారు. ముఖ్యమంత్రి అలా చెప్పారో లేదో ఇటు జిల్లాలో అధికార…
పలాసలో రాజకీయం సలసలా కాగుతోంది. మంత్రి.. విపక్షపార్టీ ఎంపీ ఇద్దరూ ఒక్కచోటే ఫోకస్ పెట్టడంతో హీట్ పెరిగింది. దూకుడుగా వెళ్తున్నారు. అక్కడేం జరుగుతుందా అని జిల్లా అంతా చూస్తున్న పరిస్థితి. ఇంతకీ ఎవరా నాయకులు? పలాస పొలిటికల్ స్క్రిన్‌పై మారుతున్న రంగులేంటి? పలాసలో మంత్రి వర్సెస్ టీడీపీ ఎంపీ! పేరుకి వెనకబడిన ప్రాంతమే అయినప్పటికీ శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హీటు పుట్టిస్తూనే ఉంటాయి. నాయకుల మధ్య సాగే మాటలయుద్ధం రాష్ట్రస్థాయిలో చర్చ జరుగుతుంది. ప్రస్తుతం జిల్లాలో…
దేశంలో కొత్త ఫ్రంట్ పై చర్చలు మొదలయ్యాయి. ప్రాంతీయ పార్టీల అగ్రనేతలు ఫ్రంట్ పై అడుగులు వేస్తున్నారు. మరి దక్షిణాదిలోని ప్రాంతీయ పార్టీలు ఎటువైపు? 2019 ఎన్నికల ముందు యాంటీ మోడీ ఉద్యమం చేసిన టీడీపీ చీఫ్ ఇప్పుడు ఏం చేస్తారు? మోడీ వ్యతిరేక జట్టుతో కలిసే ధైర్యం చేస్తారా? లేక మా రాష్ట్రం మా రాజకీయం అని ఏపీకే పరిమితం అవుతారా? 2019 ఎన్నికల టైమ్‌లో మోడీకి వ్యతిరేకంగా ఉద్యమంటీడీపీ జాతీయ రాజకీయాలపై మౌనం దేశంలో…
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక సందర్భంగా నేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయా? ఆయన చేరికను తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు ప్రయత్నించారా? ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా.. హుజురాబాద్‌లో ఇంఛార్జ్‌ల నియామకం జరిగిందా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎవరు ఎవరికి చెక్ పెట్టారు? ఈటల చేరిక సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చ! తెలంగాణ బీజేపీలో బయటకు అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోందట. సీనియర్ల మధ్య పడటం…
ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఇప్పుడు పార్టీలను పట్టుకొని తిరుగుతున్నారు. పొలిటికల్ ఫ్లాట్‌ఫాం కోసం కండువాలు మార్చేస్తున్నారు. అయినప్పటికీ అదృష్టం కలిసి రావడం లేదు. పైగా ఏ పార్టీలో చేరినా గ్రూప్‌వార్ ఆయన్ని వెంటాడుతోంది. ఇంతకీ ఎవరా జంప్ జిలానీ? గ్రూప్‌వార్ కారణంగా టీఆర్ఎస్లో టికెట్ రాలేదా? రమేష్ రాథోడ్. మాజీ ఎంపీ. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రాజకీయాల్లో ఒకప్పుడు తిరుగులేని నాయకుడు. ఉమ్మడి ఏపీకి చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో పార్టీ ముఖ్య నేతల్లో ఒకరు. 2014లో…
పీసీసీ చీఫ్ పేరు ప్రకటిస్తే.. కాంగ్రెస్‌లో ప్రకంపనలేనా? ఆయనకు పదవి ఇస్తే పార్టీలో ఉండలేమన్న బెదిరింపులు దేనికి సంకేతం? ఇంతకీ అవి బెదిరింపులా.. నిజంగా డిసైడ్ అయ్యారా? పీసీసీ పంచాయితీ కంటే.. ప్రకటన తర్వాత జరిగే లొల్లే ఎక్కువగా ఉంటుందా? తెలంగాణ కాంగ్రెస్‌లో అసలేం జరుగుతోంది? లెట్స్ కాంగ్రెస్‌కు గుడ్‌బై చెబుతామని కొందరు హెచ్చరిక? తెలంగాణ పీసీసీని కొలిక్కి తెచ్చే పనిలో ఉంది కాంగ్రెస్ అధిష్ఠానం. కొత్త పీసీసీ చీఫ్ ఎవరనేది ఇప్పటికే ఖారారైనట్లు చెబుతున్నారు. ఎంపీ…
సీఎం కేసీఆర్ వరంగల్ పర్యటనలో లంచ్ వేదిక మార్పు వెనక కథేంటి? సీఎం ఇచ్చిన సంకేతాలు వెళ్లాల్సిన వారి చెంతకు వెళ్లాయా? ఓరుగల్లు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారిన అంశాలేంటి? కడియం శ్రీహరి ఇంట్లో సీఎం కేసీఆర్ విందు! సీఎం కేసీఆర్ వరంగల్ టూర్ అనగానే గుర్తొచ్చేది రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావు నివాసం. 20 ఏళ్ల క్రితం ఉద్యమ సమయంలోను.. ఇప్పుడు సీఎం హోదాలో వరంగల్ వస్తే హంటర్ రోడ్డులోని కెప్టెన్ ఇంట్లో కేసీఆర్ దిగాల్సిందే.…
ఆమె ఓ ప్రజాప్రతినిధి. నగర ప్రథమ మహిళ. నగరంలో తొలి గౌరవం ఆమెకే దక్కాలి. కానీ.. అక్కడ ఆ సీన్ లేదట. కార్యాలయ సిబ్బంది సైతం ఆమెను పట్టించుకోవడం లేదని టాక్. దీంతో పెద్ద పదవిలో ఉన్నా.. తగినంత గౌరవం దక్కడం లేదని లోలోన ఆవేదన చెందుతున్నారట ఆ మహిళా ప్రజాప్రతినిధి. ఇంతకీ ఎవరామె? చిత్తూరులో మేయర్‌ను పట్టించుకోని పార్టీ నేతలు ఎస్. అముద. చిత్తూరు మేయర్. రాజకీయాలకు కొత్త. పొలిటికల్ ఎంట్రీలోనే కార్పొరేటర్ అయ్యారు. రిజర్వేషన్…
లోకల్ ఫైట్ సమయంలో హీటెక్కిన అక్కడి రాజకీయం చల్లారలేదు. ఇంతలో తండ్రికి తనయుడు కూడా తోడయ్యారు. ఇద్దరూ కలిసి ప్రత్యర్థిని కార్నర్ చేస్తున్నారు. ప్రత్యర్థి కూడా తక్కువేమీ కాదు. ఒకే బ్లడ్. ఒకే కుటుంబం. ఏదైనా అంటే సర్రున లేస్తున్నారు. ఇంతకీ ఎవరా నాయకులు? ఏమా కథ? మొన్నటి వరకు తమ్మినేని వర్సెస్ కూన శ్రీకాకుళం జిల్లాలో ఫ్యామిలీ పాలిట్రిక్స్‌కు కేరాఫ్ అడ్రస్ అయిన ఆమదాలవలసలో ఇప్పుడు సరికొత్త రాజకీయం రాజుకుంటోంది. ఏడాది క్రితం వరకూ మేనల్లుడు…