Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • బిగ్ బాస్ తెలుగు 6
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Singer Vani Jayaram Passes Away
  • Union Budget 2023
  • IT Layoffs
  • Pathaan
  • IPL 2023
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Off The Record Special Focus On Visaka Politics

ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు !

Published Date :July 28, 2021 , 5:13 pm
By Lakshmi Narayana
ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్న ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు !

ఆ ముగ్గురు ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడ్డారా? షెడ్యూల్, నాన్ షెడ్యూల్ వివాదంలో ఎటూ తేల్చుకోలేక నలిగిపోతున్నారా? మనసులో ఒకటి పెట్టుకుని.. బయటకు మరోమాట మాట్లాడుతున్నారా? ఇంతకూ ఎవరా ఎమ్మెల్యేలు? ఆ తగువు వెనక అసలు కథేంటి?

విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్‌, నాన్‌ షెడ్యూల్‌పై చర్చ

విశాఖ ఏజెన్సీలో షెడ్యూల్‌, నాన్‌ షెడ్యూల్‌ అంశం మళ్లీ వేడెక్కడంతో మాడుగుల, చోడవరం, నర్సీపట్నం ఎమ్మెల్యేలు అడకత్తెరలో పడుతున్నారని టాక్‌. 9 మండలాల పరిధిలో ఉన్న 163 రెవెన్యూ గ్రామాల్లో 80 వేల మంది నివసిస్తున్నారు. వీరిలో గిరిజనేతలరుకంటే గిరిజనుల జనాభానే ఎక్కువ. రాజకీయ చైతన్యం కలిగిన గ్రామాలు కావడంతో ప్రధాన పార్టీల పోకస్‌ కూడా బాగానే ఉంది. ఎన్నికల సమయంలో ఇక్కడి జనం నాడిని పట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంటారు నాయకులు. 2004లో తొలిసారిగా సబ్‌ప్లాన్ ఏరియాలోని ఆదివాసీ గ్రామాలను షెడ్యూల్ ప్రాంతంగా మారుస్తామనే రాజకీయ హామీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఆ తర్వాత కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినప్పటికీ ఆ హామీ ప్రకటగానే మిగిలిపోయింది. ఆ అంశమే ఇప్పుడు చర్చకు రావడం కలకలం రేపుతోంది.

వీఎంఆర్డీయే పరిధిలోకి తేవడంతో భూముల ధరలకు రెక్కలు

చోడవరం, మాడుగుల, నర్సీపట్నం నియోజకవర్గాలకు వైసీపీ ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, ముత్యాలనాయుడు, ఉమాశంకర్ గణేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సబ్ ప్లాన్ ఏరియాలోని గ్రామాల అభివృద్ధిపై ఇన్నాళ్లూ పెద్దగా చర్చ జరగలేదు. చట్టబద్ధంగా దఖలు పడాల్సిన హక్కుల కోసం గిరిజనులు పెద్దగా ఆరాటపడిందీ లేదు. ఇటీవల జరిగిన పరిణామాలు స్ధానికులకు.. సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఇబ్బందిగా మారాయి. అదే జీవో నెంబర్ 22. విశాఖపట్నం మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీని ప్రభుత్వం భారీగా విస్తరించింది. జిల్లాలోని ఏజెన్సీ మండలాలు మినహాయిస్తే దాదాపుగా మిగిలిన ప్రాంతమంతా VMRDA పరిధిలోకి వచ్చి చేరింది. గ్రామీణ ప్రాంతంలో భూముల ధరలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది.

షెడ్యూల్‌, నాన్‌ షెడ్యూల్‌ సమస్యతో గుబులు!

రియల్ ఎస్టేట్ కంపెనీలన్నీ మండల కేంద్రాలపై దృష్టి పెట్టాయి. మాడుగుల నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో మినహాయిస్తే చోడవరం, నర్సీపట్నంలో భూముల ధరలు గణనీయంగా పెరిగాయి. డిమాండ్ ఆధారంగా ఇక్కడ ఎకరం 25 నుంచి 50లక్షల మధ్య రేటు ఉంది. పైగా షెడ్యూల్ ప్రాంతాలను ఆనుకుని ఉన్న చాలా గ్రామాల్లో దశాబ్దాల క్రితమే భూములు చేతులు మారాయి. ఇక్కడ కొండల్లో మేలు రకం గ్రానైట్‌తోపాటు ఇతర ఖనిజాల తవ్వకాలు జరుగుతున్నాయి. వీటి అనుమతులు పొందేందుకు కాంట్రాక్టర్లు ఇంతకాలం పెద్దగా ఇబ్బందులు ఎదుర్కోలేదు. అలాంటి చోట షెడ్యూల్, నాన్ షెడ్యూల్ సమస్య మొదలైంది.

వన్‌ ఆఫ్‌ సెవెంటీ యాక్ట్‌ అమలు కోసం పట్టు!

సబ్ ప్లాన్ ఏరియాలో గిరిజన జనాభా ఉన్న పల్లెలు.. తమను షెడ్యూల్ గ్రామాలుగా గుర్తించాలని డిమాండ్ చేస్తున్నాయి. వన్‌ ఆఫ్‌ సెవెంటీ యాక్ట్‌, పీసీ సహా తమ హక్కులను పరిరక్షించే అన్ని చట్టాలను అమలు చేయాలని పట్టుబడుతున్నాయి. ఆ క్రమంలోనే ఎమ్మెల్యేలకు కొత్త చిక్కులు వచ్చిపడ్డాయి. భూములు కొనుగోలు చేసిన వారిలో ఎక్కువ మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు. స్తిరాస్థులు ఏర్పాటు చేసుకుని చాలా సంవత్సరాలైంది. అలాంటి గ్రామాలు ఇప్పుడు VMRDA పరిధికి వచ్చేశాయి. అయితే సబ్‌ప్లాన్‌లోని గిరిజన ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాలోకి తేవాలన్న డిమాండ్ ఎటు నుంచి ఎటువైపు తిరుగుతుందోననే ఒత్తిడిలో ఎమ్మెల్యేలు ఉన్నట్టు సమాచారం.

వన్‌ ఆఫ్ సెవెంటీ తప్ప అనే కండీషన్‌ పెట్టారా?
సబ్‌ప్లాన్‌ గ్రామాల మద్దతు కావాలి..! గిరిజనేతరులను కాదన లేరు..!!

మనసులోని మాటను బయట పెట్టలేక ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారట. ఇటీవల ట్రైబల్‌ అడ్వైజరీ కమిటీ సమావేశంలోనూ ఈ అంశంపైనే ఆసక్తికరమైన చర్చ జరిగింది. సబ్‌ప్లాన్‌లో ఉన్న గిరిజన గ్రామాలకు షెడ్యూల్ ఏరియాలో ఉండే అన్ని హక్కులు కల్పించాలని కోరుతూనే ఆ ఒక్కటీ తప్ప అనే కండిషన్ పెట్టారట ఎమ్మెల్యేలు. అదే వన్ ఆఫ్ సెవెంటీ. ఈ చట్టం పరిధిలోకి గ్రామాలు వచ్చేస్తే గిరిజనేతరులు కొనుగోలు చేసిన భూములపై ఆంక్షలు తప్పవు. లావాదేవీలకు ఆస్కారం లేక.. స్తిరాస్థుల విలువ గణనీయంగా పడిపోతుంది. భూముల ధరలు పెరిగినప్పుడు జరిగే అభివృద్ధి ఆంక్షలతో సాధ్యం కాదనే అభిప్రాయం కనిపిస్తోంది. అయితే ఈ మాటలను ఎమ్మెల్యేలు బహిరంగంగా చెప్పలేరు. ఎందుకంటే వారందరికీ సబ్‌ప్లాన్ గ్రామాల మద్దతు కావాలి. అలాగని బయట నుంచి వచ్చి స్థిరపడ్డ గిరిజనేతరులను కాదన లేరు. దీంతో ఈ సమస్యకు మధ్యే మార్గం ప్రభుత్వమే చెప్పాలని పెద్దలను కోరుతున్నారట ఎమ్మెల్యేలు. మరి.. హామీ ఇచ్చి బుక్కైన శాసన సభ్యులు ఈ సమస్యను ఎలా అధిగమిస్తారో చూడాలి.

ntv google news
  • Tags
  • off the record
  • tdp
  • Vizag
  • ycp

WEB STORIES

Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు

"Cactus Fruit: బ్రహ్మజెముడు పండు తింటే ఆసక్తి పెంచడమేకాదు ఆగలేరు"

India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు

"India: భారతదేశంలోని టాప్-10 రిచెస్ట్ నగరాలు"

Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే

"Date Milk: ఖర్జూరం పాలు తీసుకుంటే.. పడక గదిలో దబిడిదిబిడే"

కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!

"కిడ్నీల్లో సమస్యా..? గుర్తించండి ఇలా..!"

Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?

"Tangedu Tree: తంగేడు చెట్టు.. ఔషధ గుణాల నిధి.. ఎన్ని లాభాలో తెలుసా?"

ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!

"ఈ పండు రోజుకొకటి తింటే.. హైబీపీ కంట్రోల్‌‌ అవుతుంది..!"

Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!

"Miscarriage: అబార్షన్ కావడానికి కారణాలు..!"

Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది

"Barley Water: బార్లీ నీరు.. నడవలేని వారిని సైతం పరిగెత్తిస్తుంది"

ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?

"ఫిబ్రవరిలో ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో తెలుసా..?"

అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం..

"అలర్ట్‌.. గూగుల్‌ క్రోమ్‌ అప్డేట్‌ చేసుకోండి.. లేకుంటే మీకే నష్టం.."

RELATED ARTICLES

Cyclothan: క్యాన్సర్ వ్యాధిపై అవగాహనకు సైక్లోథాన్ అభినందనీయం

Off The Record: తెలంగాణలోని మున్సిపాలిటీల్లో ముసలం..! అవిశ్వాసాలతో బీఆర్‌ఎస్‌లో హీట్..

Off The Record: పవన్‌ను బీజేపీ నమ్మడం లేదా? అనుమానం వచ్చిందా?

Political Heat in Nellore: చలికాలంలో హీట్‌ పెంచుతున్న పొలిటికల్‌ సెగలు..

Off The Record: మంత్రి అప్పలరాజుకు రివర్స్‌ గేర్‌..! శత్రువులుగా మారిన అనుచరులు..!

తాజావార్తలు

  • Madhya Pradesh: లవ్ ఫెయిల్యూర్.. మత్తుమందు ఇంజెక్షన్ తీసుకుని నర్స్ ఆత్మహత్య..

  • Pervez Musharraf: కార్గిల్ యుద్ధ కారకుడు.. కరడుగట్టిన భారత వ్యతిరేకి.. పాక్ నియంత ముషారఫ్

  • Omega Hospital: నగర ప్రజలకు గుడ్ న్యూస్.. తక్కువ ఖర్చుతో ప్రపంచ స్థాయి చికిత్సలు

  • Keesara ORR Road Accident: రక్తసిక్తమైన కీసర ఓఆర్‌ఆర్‌ రోడ్డు.. ఇద్దరు స్పాట్‌ డెడ్‌

  • Bomb Blast: బెంగాల్‌లో బాంబు పేలుడు.. తృణమూల్ కార్యకర్త మృతి

ట్రెండింగ్‌

  • Swiggy : 380 మంది ఉద్యోగులకు ఉద్వాసన.. మాంసం మార్కెట్‌ బంద్‌..

  • Instagram : ఇన్‌స్టాలో మరో కొత్త ఫీచర్‌.. “క్వైట్ మోడ్”

  • Bedwetting : ఇవి తినిపిస్తే పిల్లలు నిద్రలో పక్క తడిపే అలవాటు మానేస్తారు

  • LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. సబ్సిడీ మరో ఏడాది పొడగింపు?

  • Bhogi Festival: భోగి నాడు పిల్లలపై రేగిపళ్లను మాత్రమే ఎందుకు పోస్తారు?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions