తిరుపతిలో హోరాహోరీగా ప్రచారం చేసిన ప్రధాన పార్టీల నాయకులు సొంత ప్రాంతాలకు తిరిగి వెళ్లిపోయారు. కరోనా వైరస్‌కు హాట్‌స్పాట్‌గా ఉన్న ప్రదేశాల నుంచి వారంతా రిటర్న్ కావడంతో కొత్త టెన్షన్ నెలకొంది. వైద్యశాఖ వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. ఇళ్లకు చేరుకున్నవారు జనాల్లోకి వెళ్లకుండా క్వారంటైన్లో ఉంటే బెటర్ అనే చెబుతున్నారు. అది సాధ్యమయ్యే పనేనా? తిరుపతి నుంచి సొంతూళ్లకు నేతలు, కార్యకర్తలు రిటర్న్! ఏపీలో పెద్దఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. వందల నుంచి వేల సంఖ్యకు కరోనా…
గ్రామాల విలీనం పూర్తయింది. డివిజన్ల ముసాయిదా విడుదలైంది. అధికార, విపక్ష పార్టీలలో ఆధిపత్యపోరుకు మాత్రం చెక్ పడలేదు. వరసగా నాలుగోసారి పాగా వేయాలని ఒక పార్టీ.. తొలిసారి జెండాను రెపరెపలాడించాలని మరొకపార్టీ కలలు కంటున్నా క్షేత్రస్థాయిలోని పరిస్థితులు భిన్నంగా ఉన్నాయట. రాజమండ్రి వైసీపీ, టీడీపీ నేతల్లో ఐక్యత లేదా? గోదావరి తీరంలోని రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ రాజకీయం వేడెక్కుతోంది. విలీన గ్రామాల సమస్య కోర్టులో ఉండటంతో మొన్న ఎన్నికలు జరగలేదు. ఇప్పుడు ముసాయిదా విడుదల కావడంతో స్పీడ్…
ఒకప్పుడు ఆ జిల్లాలో బలంగా ఉన్న పార్టీకి.. ఇప్పుడు ఇద్దరే ఎమ్మెల్యేలు. ఆ ఇద్దరిలో ఒకరే యాక్టివ్. మంత్రిగా చేసిన వారు సైతం సైలెంట్. ఎంపీలు, ఎమ్మెల్యేలుగా పనిచేసిన వారు కూడా అంతే. దీంతో పార్టీ ఖాళీ అయిందా అన్న అనుమానాలు కలుగుతున్నాయట. హేమాహేమీల్లాంటి టీడీపీ నేతలు ఏమైయ్యారు? పశ్చిమగోదావరి జిల్లా. ఒకప్పుడు టీడీపీకి బలమైన జిల్లా. 2014 ఎన్నికల్లో బీజేపీతో కలిసి క్లీన్ స్వీప్ చేసింది. 2019 నాటికి పరిస్థితులు తారుమారు అయ్యాయి. జిల్లాలోని 15…
పంచాయతీ ఎన్నికలు జరిగే వరకు స్పెషల్ ఆఫీసర్ పాలనలో ఉన్నాయి గ్రామీణ ప్రాంతాలు. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని చోట్ల అధికారులు ఆడింది ఆట.. పాడింది పాటగా సాగింది. ఈ క్రమంలో కొందరు భారీగా అక్రమాలకు పాల్పడినట్లు చెబుతున్నారు. ఇప్పుడా భాగోతాలు వెలుగులోకి రావడంతో ఓ కీలక అధికారి చక్రం తిప్పుతున్నారు. గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్ల మేత! కృష్ణాజిల్లాలోని నాలుగు డివిజన్ల పరిధిలో మొత్తం వెయ్యికిపైగా పంచాయతీలు ఉన్నాయి. విజయవాడ రూరల్ డివిజన్లోని మేజర్ పంచాయతీల ఆదాయం…
వకీల్‌సాబ్‌కు గట్టిగానే వకాలత్ పుచ్చుకున్నారు టీడీపీ అధినేత. రాజకీయంగా వేర్వేరు మార్గాల్లో ప్రయణిస్తున్న తర్వాత చంద్రబాబు ఎంచుకున్న ఈ లైన్ రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరుస్తోంది. ఈ ఎపిసోడ్‌ను రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరని భావించాలా? తిరుపతి ఉపఎన్నిక బ్యాక్‌డ్రాప్‌లో వినిపిస్తున్న కొత్త నేపథ్య సంగీతాన్ని ఎలా చూడాలి? భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని పవన్‌పై కర్చీఫ్ వేశారా? వకీల్‌సాబ్ సినిమా టికెట్ల రేట్ల పెంపు విషయంలో చంద్రబాబు స్పందన ఇది. వాస్తవానికి తీవ్ర దుమారం రేపిన ఈ…