తెలంగాణాలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. లాక్డౌన్ ఎత్తేశారు. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యక్రమాలు ఎప్పటిలా కొనసాగుతున్నాయి. GHMC కౌన్సిల్ సమావేశం మాత్రం ఆన్లైన్లో నిర్వహించారు. అన్‌లాక్‌లో ఎందుకు వర్చువల్ మీటింగ్ పెట్టారు? విపక్షాల విమర్శలేంటి? ఆన్లైన్ కౌన్సిల్ మీటింగ్ లోగుట్టు ఏంటి? వర్చువల్‌గా ముగిసిన జీహెచ్ఎంసీ తొలి కౌన్సిల్ భేటీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏ కార్యక్రమం చేపట్టాలన్నా GHMC కౌన్సిల్ ఆమోదం తప్పనిసరి. కౌన్సిల్లో విస్తృతంగా చర్చించి ఆయా అంశాలపై నిర్ణయం తీసుకుంటారు.…
పార్టీ అధికారంలో లేకపోయినా.. ఆ నియోజకవర్గంలోని పార్టీ నేతల మధ్య వర్గపోరు మాత్రం ఓ రేంజ్లో ఉంది. కేడర్‌కు సర్దిచెప్పలేక సతమతం అవుతున్నారట అక్కడ ఎమ్మెల్యే. ఊరిలో పల్లకీ మోత.. ఇంట్లో ఈగల మోతగా మారి ఇబ్బంది పడుతున్నారట. చివరకు ఇంటిపోరు భరించలేక నియోజకవర్గానికి దూరంగా ఉంటున్నారట. ఇంతకీ ఎవరా నాయకుడు? ఎమ్మెల్యే వీరయ్య చెప్పినా వినని పార్టీ కేడర్ పొదెం వీరయ్య. భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు. ఇప్పుడు కొత్తగా…
అన్నవరం ఆలయంలో రెండు దశాబ్దాలుగా ఆయన చెప్పిందే వేదమట. ఎన్ని ఆరోపణలు వచ్చినా.. కోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్నా.. ఆయన మాటకు తిరుగే లేదట. రిటైరైన మరుసటిరోజే కొత్త పదవి చేపట్టి.. పెత్తనం చేయడానికి వస్తున్నారని ఉద్యోగవర్గాలు చెబుతున్నాయి. ఇంతకీ రత్నగిరి కొండపై ఈ కొత్త రగడ ఏంటి? వ్రత పురోహితులకు కామేశ్వరరావు చెప్పిందే వేదం ప్రముఖ పుణ్యక్షేత్రాలలో ఉద్యోగులతోపాటు.. అర్చకులు.. పురోహితులు.. సిద్ధాంతులు.. ఇలా ఎంతో మంది.. ఎన్నో విభాగాలు ఉంటాయి. తూర్పుగోదావరి జిల్లా అన్నవరం…
పీసీసీ పదవుల పందేరంలో ఆ జిల్లా నేతలకు ఎందుకంత ప్రాధాన్యం లభించింది? గత ఎన్నికల తర్వాత సైలెంట్ అయినప్పటికీ వారికి కలిసొచ్చిన సమీకరణాలేంటి? ఇప్పటికైనా యాక్టివ్‌గా పనిచేస్తారా? పార్టీ వర్గాల్లో జరుగుతోన్న చర్చ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లాలో నలుగురికి పీసీసీలో కీలక పదవులు ఒకప్పుడు మెదక్ జిల్లాలో కాంగ్రెస్ బలంగా ఉండేది. పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు ఒకటి రెండుచోట్ల మినహా దాదాపు అన్ని సీట్లు తన ఖాతాలో వేసుకునేది. జిల్లా నుంచి రాష్ట్రస్థాయి నాయకుల…
వైసీపీ ఎమ్మెల్యేలు నోరు జారుతున్నారా? వెనకా ముందు ఆలోచించకుండా నోటికి పని చెబుతున్నారా? ఓ ఎమ్మెల్యే కీలకమైన ఒక సామాజికవర్గాన్ని తాగుబోతులని కించపరిచారు. మరో ఎమ్మెల్యే ఏకంగా తమ నాయకుడు ప్రవేశపెట్టిన పథకాన్నే అపహాస్యం చేసి.. ప్రత్యర్థులకు బోల్డంత కంటెంట్ ఇచ్చారు. నేతల ఈ వ్యవహారం వైసీపీకి ఇబ్బందికరంగా మారిందా? కాపు సామాజికవర్గంపై అంబటి అనుచిత వ్యాఖ్యలు ఎంత తోస్తే అంత.. పద్ధతీ పాడు లేకుండా మాట్లాడేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు. కావడానికి సీనియర్ నాయకులే అయినప్పటికీ పార్టీని..…
అది ఏటా వందకోట్ల ఆదాయం వచ్చే ఆలయం. ఎవరు గుర్తించరని అనుకున్నారో.. ఇంతకంటే మంచి తరుణం రాదని భావించారో.. చేతివాటం ప్రదర్శిస్తున్నారట. కమీషన్లు పెంచి ముడుపులు దండుకున్నారట. నిధులు దారి మళ్లించడంలోనూ వారి తర్వాతేనని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. దాతలు ఇచ్చే దాంట్లో ఎవరిది చేతివాటం? భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారం అన్నవరం సత్యనారాయణ స్వామి. నిత్యం భక్తులతో రద్దీగా ఉండే ఈ ఆలయ పాలకమండలి ఛైర్మన్ రోహిత్. ఈవో త్రినాథ్. దేవుడికి వచ్చే ప్రతి…
చిన్న కార్యకర్తకు కష్టమొచ్చినా.. నేనున్నంటూ వాలిపోతారు ఆ జిల్లాలోని టీడీపీ నేతలు. అరెస్ట్‌లు చేస్తే అక్రమమని అండగా నిలుస్తారు. అలాంటిది పార్టీలో ముఖ్యమైన నాయకుడి కుటుంబానికి ఇబ్బందొస్తే సొంతవారితోపాటు పార్టీవాళ్లెవరూ కిమ్మనలేదు. టీడీపీలో ఎవరా ముఖ్యనేత? పార్టీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? 2019 తర్వాత రాజకీయంగా ఎదురు దెబ్బలు శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది కింజరాపు ఎర్రన్నాయుడు కుటుంబం.జిల్లాతోపాటు టెక్కలిలోనూ వారి ఆధిపత్యం నేటికీ కొనసాగుతూనే ఉంది. ప్రస్తుతం ఏపీ టీడీపీ…
చాలారోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ ఇచ్చారు. అడిగిన వాటన్నిటికీ ఓకే చెప్పేశారు కూడా. ఆ భేటీ ముగిసిన వెంటనే.. కాంగ్రెస్ నాయకుల చుట్టూ విమర్శల జడివాన ముసురుకుంది. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు నేతల ఉన్నాయట. ఏడేళ్ల తర్వాత సీఎం ఎందుకు పిలిచారో ఆలోచించలేదా? తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ప్రగతి భవన్‌కి వెళ్లడం పార్టీలో వివాదంగా మారుతోంది. సీఎం కేసీఆర్‌తో భేటీని వ్యూహం కాదు.. వ్యూహాత్మక తప్పిదమన్నది కొందరు నేతల…
ఆ జిల్లాలో మాజీ ప్రజాప్రతినిధుల ఆరాటం ఒక్కటే. ఎమ్మెల్సీ మాకు కావాలంటే మాకు కావాలని ట్రై చేస్తున్నారు. గతంలో చేసిన త్యాగాలు.. ప్రస్తుతం తమ పొజిషన్.. ఫ్యూచర్లో ఎదురయ్యే సమస్యలు ఏకరవు పెడుతూ అధిష్ఠానం చుట్టూ తిరుగుతున్నారట. జిల్లా కేంద్రం నుంచి విజయవాడకు ఎక్కని వాహనం.. దిగని వాహనం లేదన్నట్టు క్యూ కడుతున్నారట. ఎవరా నాయకులు? పార్టీ పెద్దలు వారికిచ్చిన హామీలేంటి? స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కోసం కర్చీఫ్ అదిగో వస్తోంది.. ఇదిగో వస్తోందని ఎమ్మెల్సీ పదవి…
తొందరపడి ఓ కోయిల ముందే కూసిందా? అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటా? పీసీసీ సారథి నియామకం విషయంలో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య జరుగుతున్న చర్చ ఏంటి? పీసీసీ చీఫ్ ఎంపిక జాప్యానికి ఆ ఇద్దరు నాయకుల భేటీనే కారణమా? ఇంతకీ ఎవరా నాయకులు? ఇద్దరు నాయకుల భేటీనే కొంప ముంచిందా? తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ ఎంపిక రోజుకో మలుపు తిరుగుతోంది. ఇదిగో.. అదిగో అంటూ చెప్పుకోవడమే తప్ప.. అయ్యింది లేదు… పోయింది లేదు. ఇక నోట్ రెడీ అవ్వడమే…