టీడీపీ నేత పట్టాభి సడెన్‌గా మాల్‌దీవ్స్‌కు ఎందుకెళ్లారు? ఆయనే వెళ్లారా.. ఇంకెవరైనా పంపించారా? పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? రిలాక్సేషన్ కోసం మాల్‌దీవ్స్ వెళ్లిన పట్టాభి కదలికపై నిఘావర్గాలు కన్నేశాయా?
చంద్రబాబే ఖర్చులకు ఇచ్చి మాల్‌దీవ్స్‌కు పంపారా?
పబ్లిక ప్రెస్‌మీట్‌లో బోసడీకే పదాన్ని వాడి.. నాలుగు రోజులు AP రాజకీయాన్ని అగ్గగ్గలాడించిన టీడీపీ నేత పట్టాభి.. సడెన్‌గా మాల్‌దీవ్స్‌కి జంప్ అయిపోవడంపై రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బెయిల్ వచ్చిన పట్టాభి తానే రిలాక్సేషన్ కోసం వెళ్లిపోయారా? లేక చంద్రబాబే ఖర్చులకు ఇచ్చి మాల్‌దీవ్స్‌కి పంపారా అన్నది పార్టీలోనూ బయట చర్చ జరుగుతోంది.
మరో కేసు పెడతారనే అనుమానంతో విదేశాలకు వెళ్లిపోయారా?
టీడీపీ అభిమానులు.. పట్టాభి ఫాన్స్ ఆయన మాల్‌దీవ్స్ పర్యటన్ను దాచిపెట్టడానికి చాలా ప్రయత్నించారు. అది ఒత్తి ప్రచారం మాత్రమేనని ఒక గ్యాంగ్ ప్రచారం చేసింది. చివరికి పట్టాభి బెయిల్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి హైదరాబాద్ రాగానే మాల్‌దీవ్స్‌కి వెళ్లిపోయారని రూఢీ అయింది. పట్టాభి జైల్లో ఉన్నప్పుడే ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకున్నారని సమాచారం. అంతేకాదు.. పోలీసులు మళ్లీ అరెస్ట్ చేస్తారనే భయంతోనో.. మరో కేసేమైనా పెడతారేమోననే అనుమానంతోనో పట్టాభి విదేశాలకు వెళ్లిపోయినట్టు పార్టీలో ఒక వర్గం చెబుతోంది. కానీ జరిగిన సంఘటన.. ఆ తర్వాత అరెస్ట్‌తో పట్టాభి బాగా ఒత్తిడికి లోనయ్యారని అది కాస్త తగ్గడానికే పార్టీ అధినేత పంపారని మారోవర్గం ప్రచారం చేస్తోంది.
పట్టాభి విదేశాలకు వెళ్లిన టైమింగ్‌పై టీడీపీ చర్చ..!
పార్టీ ఆఫీస్‌పై దాడి.. ఏపీలో డ్రగ్స్ వ్యవహరంపై ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి చంద్రబాబు అండ్ టీమ్.. అలా బయటకు వచ్చిందో లేదో.. పట్టాభి ఇలా మాల్‌దీవ్స్‌కు ఫ్లయిట్ ఎక్కేశారు. కాకపోతే విదేశాలకు వెళ్లిన టైమింగే సరిగా లేదనే విమర్శలు టీడీపీలోనే వినిపిస్తున్నాయి. వివాదానికి మూల కారణమైన పట్టాభి.. ఆ ఎపిసోడ్ కొలిక్కి రాకముందే మాల్‌దీవ్స్‌కు వెళ్లడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు కొందరు నేతలు. దీనివల్ల పార్టీ డ్యామేజయ్యే ప్రమాదం ఉందని వాళ్లు ఆందోళన చెందుతున్నారు. పట్టాభి పారిపోయారని అధికారపార్టీ ప్రచారం చేసేందుకు ఆస్కారం కల్పించారని మండిపడుతున్నారు.
చంద్రబాబు చెప్పడం వల్లే వెళ్లారని వాదన..!
రాజమండ్రి సెంట్రల్‌జైలు నుంచి విడుదలైన పట్టాభికి అడుగడుగునా పార్టీ నేతలు.. కార్యకర్తలు ఎదురేగి స్వాగతం పలికారు. భయపడాల్సిన పనిలేని లేకపోయినా.. ఆగమేఘాలపై ఎందుకు మాల్దీవులకు వెళ్లారన్నది కొందరి ప్రశ్న. పట్టాభి తరహాలోనే టీడీపీ యువనేత బ్రహ్మంను అరెస్ట్ చేసినా.. ఆయన ఎక్కడకు వెళ్లలేదని గుర్తు చేస్తున్నారు. బెజవాడ ఎంపీ కేశినేని నాని వ్యతిరేక వర్గంగా ఉన్న పట్టాభిని చంద్రబాబు ప్రోత్సహిస్తే.. ఇలా విదేశాలకు వెళ్లడం కరెక్ట్ కాదన్నది వారి అభిప్రాయం. అయితే.. చంద్రబాబు చెప్పడం వల్లే పట్టాభి మాల్దీవులకు వెళ్లారని మరో వర్గం ప్రచారం చేస్తోంది. ఆ ప్రచారం కరెక్ట్ కాదన్నది ఇంకో వర్గం వాదన. ఒకవేళ నిజంగా చంద్రబాబే సలహా ఇచ్చి ఉంటే.. చేసేదేం లేదని నిట్టూరుస్తున్నారట.
పట్టాభి మాటలు టీడీపీ ప్రతిష్టని కూడా కొంత దిగజార్చాయని.. అందువల్లే పార్టీ కార్యాలయంపై దాడినే బాగా ఎస్టాబ్లిష్ చేశారే తప్ప.. పట్టాభి మాటలపై చర్చ రాకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం. మరోవైపు పట్టాభి మాల్‌దీవ్స్‌లో ఏం చేస్తున్నారనే దానిపై AP పోలీసులు కూడా ఓ కన్నేసి ఉంచారట.