తెలుగు రాష్ట్రాల్లో గెలుపు గుర్రాల కోసం బీజేపీ ఢిల్లీ నాయకత్వం ఇప్పటి నుంచే వేట మొదలుపెట్టిందా? ప్రధాని మోడీ నేరుగా రంగంలోకి దిగారా? క్షేత్రస్థాయిలో సర్వే చేపడుతున్నారా? బీజేపీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? నేతల ఆలోచనలు ఎలా ఉన్నాయి? సర్వే పేరుతో నేరుగా రంగంలోకి మోడీ! ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల గురించి చివరిక్షణాల్లో పార్టీల వడపోతలు కామన్. మొన్నటి అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఏపీ, తెలంగాణాల్లో బీజేపీ చేసింది కూడా ఇదే. ఇప్పుడు మాత్రం బీజేపీ…
అక్కడి అధికారపార్టీలో ముసలం పుట్టింది. ఇద్దరు కీలక ప్రజాప్రతినిధుల ఆధిపత్యపోరు తారాస్థాయికి చేరింది. నియోజకవర్గంలో పట్టుకోసం ఒకరు.. పట్టుసడలకుండా మరొకరు రాజకీయాన్ని రక్తి కట్టిస్తున్నారు. వారెవరో.. ఏం చేస్తున్నారో ఈ స్టోరీలో చూద్దాం టికెట్ కోసం ఇప్పటి నుంచే ఎత్తుగడలు! గద్వాల. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో నడిగడ్డగా పిలవబడే ప్రాంతం. అక్కడి రాజకీయం ఓ పట్టాన అంతుబట్టదు. రాష్ట్ర రాజకీయం అంతా ఒకలా ఉంటే గద్వాల పాలిటిక్స్ మరోలా ఉంటాయి. ఏదో ఒక రాజకీయ రగడ కామన్.…
ఆయన ఆ పార్టీకి అధ్యక్షుడై ఏడాదే అయ్యింది. అప్పుడే ఆయన వెనక గోతులు తవ్వుతున్నారా? ఆ గోతుల వెనక ఒకనాటి మిత్రపక్షం ఉందని అనుమానిస్తున్నారా? పార్టీ వర్గాలు ఏమనుకుంటున్నాయి? ఏంటా పార్టీ? ఎవరా నాయకుడు? సోమును తొలగించి కన్నాకు పగ్గాలు ఇస్తారని ప్రచారం! సోము వీర్రాజు. ఏపీ బీజేపీకి అధ్యక్షుడై ఏడాది అయ్యింది. ఈ సంవత్సర కాలంలో ఆలయాలపై దాడులు.. అంతర్వేది, దుర్గగుడి రథాలపై ఉద్యమాలు చేశారు. మధ్యలో తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికనూ ఎదుర్కొన్నారు. కోవిడ్ వల్ల…
ఆయన ఎమ్మెల్సీ అయ్యారా.. లేదా? టీఆర్ఎస్తోపాటు రాజకీయావర్గాల్లో ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్న. ఆయన్ని ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నా.. ఇంత వరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల కాలేదు. దీంతో ఆ ఫైల్ ఆగిందా లేక ఆపారా అన్న చర్చ జోరందుకుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్! ఆగస్టు ఒకటో తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరిగింది. ఆ సమావేశానికి కొద్దిరోజుల ముందే టీఆర్ఎస్లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డిని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్…
పైన పటారం.. లోన లోటారం. తెలంగాణ బీజేపీలో ఇదే పరిస్థితి ఉందట. ఉన్న కొద్దిమంది నేతలూ ఒక్కమాట మీద లేరట. ఢిల్లీ నుంచి వచ్చిన నాయకుడొకరు ఆ సమస్యకే మందు పూసి వెళ్లారట. కూర్చోబెట్టి క్లాస్ తీసుకున్నట్టు టాక్. మరి.. ఆయన మాటలు కమలనాథుల చెవికి ఎక్కాయా? పార్టీ నేతల మధ్య ఉన్న ఇబ్బందేంటి? బీజేపీలో ముఖ్యనేతల మధ్య గ్యాప్ ఉందా? శరీరానికి దెబ్బ తగిలితే మందు రాస్తారు. చికిత్స చేస్తారు. అదే మనసుకు గాయమైతే..? కోలుకోవడానికి…
కాంగ్రెస్ పార్టీలో ఎవరేం చేసినా ఓ లెక్క ఉంటుంది. ఎవరికి తోచిన వ్యూహం వాళ్లు అమలు చేస్తారు. తాజాగా పని విభజనపై రగడ మొదలైంది. ముల్లును ముల్లుతోనే తీయబోతున్నారనే చర్చ జరుగుతోంది. ఎందుకిలా? కొత్త ఎత్తుగడలు ఏం చెబుతున్నాయి? వర్కింగ్ ప్రెసిడెంట్స్‌కు పని విభజనపై రగడ! తెలంగాణ కాంగ్రెస్‌కు మొత్తం ఐదుగురు వర్కింగ్ ప్రెసిడెంట్స్. సామాజిక సమీకరణాలతోపాటు అన్ని గ్రూపులను బుజ్జగించేందుకు.. ఐదుగురిని వర్కింగ్ ప్రెసిడెంట్స్‌గా నియమించారు. సంఖ్య ఎక్కువగా ఉండటంతో అందరికీ పని అప్పగించాలని PCCకి…
కలెక్టర్ కనిపించడం లేదు. రంగారెడ్డిజిల్లా కలెక్టరేట్‌కు వచ్చిన వాళ్ల కామెంట్ ఇది. ఆయన 3 వారాలుగా కలెక్టరేట్‌కు రావడం లేదట. మంత్రులు వస్తే కనిపిస్తున్నారు కానీ.. వర్క్ మాత్రం ఇంకెక్కడి నుంచో చేస్తున్నారట. దీంతో ఆ అధికారికి ఏమైంది? ఎందుకు కలెక్టరేట్‌కు రావడం లేదన్న చర్చ జరుగుతోంది. కలెక్టరేట్‌కు కలెక్టర్ ఎందుకు రావడం లేదు? అమోయ్ కుమార్. రంగారెడ్డి జిల్లా కలెక్టర్. జిల్లాకు బాస్ కావడంతో పని ఒత్తిడి.. ఇతరత్రా రాజకీయ ప్రెజర్స్ కామన్. వీటిని తెలివిగా…
హైదరాబాద్‌లో అంతర్భాగంగా ఉన్న ఆ ప్రాంతంలో త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఎలాగైనా పాగా వేయాలని చూస్తున్నాయి పార్టీలు. ఇదే టైమ్ అనుకున్నాయో ఏమో కరోనా టీకాలతో రాజకీయ ఎత్తుగడలకు తెరతీశాయి. కానీ.. అనుకున్నదొక్కటి…అయ్యిందొక్కటి. పొలిటికల్ వ్యాక్సిన్ వికటించి టెన్షన్ పడుతున్నారట. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. ఓట్ల కోసం కరోనా టీకా సెంటర్లు ఏర్పాటు! ఎన్నికల సమయంలో వరదలు వస్తే.. బాధితులకు సాయం చేయడానికి పార్టీలు పోటీపడతాయి. ఓట్లు రాబట్టుకోవాలని చూస్తాయి. ఆ సమయంలో జనాలకు ఇంకేదైనా…
కల చెదిరింది. అనుకున్నది చెయ్యి దాటింది. వాటి గాయాలు మాత్రం మానలేదు. ఆ గ్యాప్ అలాగే ఉండిపోయింది. ఇప్పుడు ఎవరిదారి వారిదే అనుకుంటున్నారో ఏమో కీలక సమావేశానికి డుమ్మా కొట్టేశారు. తెలంగాణ కాంగ్రెస్‌లో కొత్త చర్చకు తెరతీశారు. ఇంతకీ ఎవరా నాయకులు? హుజురాబాద్ ఉపఎన్నిక సన్నాహక భేటీకి డుమ్మా! ఒకరు మొదట్లో పీసీసీ పదవి వస్తే తీసుకోవాలని అనుకున్నారు. ఇంకొకరు వద్దనుకున్నా.. నువ్వే పీసీసీ చీఫ్.. మేడం ఒకే అనేశారు అని సైలెంట్‌గా ఉన్న నాయకుడిని లేపి…
ఒకరికేమో ప్రభుత్వంలోని పెద్దల అండ. ఇంకొకరికి అదే శాఖలో బడా బాబుల ఆశీస్సులు. ఇలా పెద్దోళ్లే వెనకుండటంతో ఒకే కుర్చీకోసం కుస్తీ పడుతున్నారు ఆ ఇద్దరు అధికారులు. బదిలీ అయినా వెళ్లకుండా ఒకరు.. ఛార్జ్ తీసుకోవాలని ఇంకొకరు వేయని ఎత్తులు లేవు. అదే ఆ జిల్లా వైద్యవర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. సంగారెడ్డి డీఎంహెచ్‌వో పోస్టు కోసం 4 నెలలుగా కుర్చీలాట! జిల్లాస్థాయి పోస్టులంటే రాజకీయ ప్రమేయం లేకుండా జరగవు. మనవాళ్లు అనేవాళ్లను తీసుకొచ్చి కూర్చీలో కూర్చోబెట్టుకోవడం కామన్.…