హుజురాబాద్ ప్రచారంలో కనిపించని కమలనాథులు?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ బీజేపీ ఎన్నికల ప్రచారంలో పార్టీలో గుర్తింపు పొందిన నాయకులు ఎందుకు కనిపించడం లేదు? వారు అలిగారా.. లేక ప్రచారంలో వారి అవసరం లేదని పార్టీ భావించిందా? బీజేపీలో కీలకంగా ఉన్న నాయకులపై జరుగుతున్న చర్చ ఏంటి?
హుజురాబాద్ ప్రచారంలో కాషాయ దండు..!
Also Read
హుజురాబాద్ ఎన్నికల ప్రచారం రంజుగా సాగుతుంది. నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. కాషాయదండు అక్కడికి షిఫ్ట్ అయింది. ముఖ్యనేతలు ఎన్నికల ప్రచారంలో కనిపిస్తున్నారు. చిన్న సభలు.. సమావేశాల్లో పాల్గొని కేడర్‌కు దిశానిర్దేశం చేస్తున్నారు కూడా. ఏదో ఒకరోజు ఇలా వచ్చి అలా ప్రచారం చేసి వెళ్లినట్టు కాకుండా ప్రచారానికి ఎక్కువ సమయమే కేటాయిస్తున్నారు నాయకులు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జాతీయ కార్యవర్గ ప్రత్యేక ఆహ్వానితురాలు విజయశాంతి.. బీజేపీ స్టార్ క్యాంపెయినర్ జాబితాలో ఉన్న నేతలు అక్కడ ప్రచారం ఉన్నారు.
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను కావాలనే దూరం పెట్టారా?
బీజేపీ తరఫున ఎంత మంది ప్రచారం చేస్తున్నా.. పార్టీలో కీలకంగా ఉన్న ఒకరిద్దరు నాయకులు మాత్రం కనిపించడం లేదు. బీజేపీ శాసనసభా పక్ష నేత రాజాసింగ్ జాడ లేదు. దుబ్బాక, నాగార్జునసాగర్ ఉపఎన్నికలు, GHMC ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు రాజాసింగ్. హుజురాబాద్‌కు దూరంగా ఉండిపోయారు. స్టార్ క్యాంపెయినర్ జాబితాలో రాజాసింగ్ పేరు ఎందుకు చేర్చలేదన్నది ఇప్పటికీ కేడర్‌లో ఒక ప్రశ్నగా ఉంది. హుజురాబాద్‌లో రాజాసింగ్ ప్రచారానికి వస్తే ముస్లిం ఓటర్లు దూరం అవుతారనే భయంతో.. సొంత ఎమ్మెల్యేను దూరం పెట్టారని ఒక చర్చ జరుగుతోంది. ప్రచారానికి వెళ్లేందుకు ఆయన ఉత్సాహంగా ఉన్నా.. ఆయన ప్రసంగాలు చేటు తెస్తే మొదటికే మోసం వస్తుందని ఆందోళన చెందారట. అందుకే రాజాసింగ్‌ను పక్కన పెట్టారని సమాచారం.
ఇంద్రసేనారెడ్డి అలకలో ఉన్నారా?
బీజేపీ OBC మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ సైతం ఇప్పటి వరకు హుజురాబాద్ వెళ్లలేదు. 27తో ఇక్కడ ప్రచారం ముగుస్తుంది. స్టార్ క్యాంపెయినర్ లిస్ట్‌లో లక్ష్మణ్ పేరు ఉంది. ఇక బీజేపీ సీనియర్ నాయకుడు ఇంద్రసేనారెడ్డి సైతం సైలెంట్. బీజేపీ జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించేంత వరకు యాక్టీవ్‌గా ఉన్న ఆయన.. జాబితాలో తన పేరు లేకపోవడంతో హర్ట్ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా.. ఎన్నికల కమిషన్ వ్యవహారాలు ఇంద్రసేనారెడ్డే చూసేవారు. అలాంటిది ఇప్పుడు పార్టీ ఆఫీస్‌కు కూడా రావడం లేదట. వీరేకాకుండా .. బీజేపీ రాష్ట్ర పదాధికారుల్లో మరికొందరు సైతం హుజురాబాద్ ప్రచారానికి దూరంగా ఉండటం పార్టీలో చర్చగా మారింది. మరి..ఎందుకు దూరం పెట్టారో.. ఏంటో బీజేపీ నేతలే చెప్పాలి.
తాజావార్తలు
-
Khairatabad Ganapathi Shobha Yatra: అంగరంగ వైభవంగా ఖైరతాబాద్ మహాగణపతి శోభాయాత్ర..!
-
Balapur Ganesh: బాలాపూర్ గణేష్ లడ్డు వేలంపాట అప్డేట్..
-
Joshna Chinappa History: ఏడు ఏషియన్ గేమ్స్.. ఆరు పతకాలు.. 40 ఏళ్ల వయసులోనూ జోష్నా జోరు!
-
PM SVANidhi: వీధి వ్యాపారులకు బంపర్ ఆఫర్.. 50 రోజుల వరకు రూపాయి వడ్డీ లేకుండా లోన్.. అప్లై చేసుకోండిలా..
-
Balapur Ganesh Laddu Auction: సరికొత్త రికార్డు.. రూ.39 లక్షలతో బాలాపూర్ గణేశుడి లడ్డూ దక్కించుకున్న సామ ప్రణీత్ రెడ్డి..!
-
Explainer: తడిసి మోపెడు.. ఆస్పత్రులకు వెళ్తే జేబుకు పెద్ద సైజు చిల్లు..!
-
China-US Panda Diplomacy: అమెరికా-చైనా సంబంధాల్లో ‘పాండా డిప్లొమసీ’.. అట్లాంటా జూకు కొత్త అతిథులు
ట్రెండింగ్
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!