President Droupadi Murmu Gets Emotional As She Visits Her School In Odisha: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఒడిశా రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. ఒడిశా పర్యటనలో ఉన్న రాష్ట్రపతి తను చదువుకున్న పాఠశాల, హాస్టల్ ని సందర్శించారు. ఈ క్రమంలో తన చిన్ననాటి గుర్తులను తలుచుకుని భావోద్వేగానికి గురయ్యారు. ఒడిశా పర్యటనలో రెండో రోజు రాజధాని భువనేశ్వర్ లోని యూనిట్-2 ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను సందర్శించారు. 1970వ దశకంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ…
Drunken Elephants: ఒడిశాలో విచిత్ర సంఘటన జరిగింది. ఏనుగుల గుంపు మద్యం తాగి గంటల తరబడి మత్తులో ఉన్నాయి. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతం చుట్టు పక్కల ఉండే గ్రామస్తులు అటవీ ప్రాంతంలో తరుచుగా మద్యం తయారు చేస్తుంటారు. అటవీ ప్రాంతంలో దొరికే ఇప్పపూలు, ఇతర సామాగ్రితో సారా కాస్తుంటారు. ఇదిలా ఉంటే గ్రామస్తులు దాచిన ఇప్పసారాను తాగాయి 24 ఏనుగులు దీంతో అవన్నీ కొన్ని గంటల పాటు మత్తులో…
ఒడిశాలోని ఝార్సుగూడ జిల్లా కిర్మిరా బ్లాక్ పరిధిలోని భౌంరా గ్రామ సమీపంలో విషాదం చోటుచేసుకుంది. ఇద్దరు సోదరులను వారి తల్లిదండ్రుల ముందే తొక్కి చంపింది ఏనుగు. పిల్లలను రక్షించే ప్రయత్నంలో దంపతులకు తీవ్రగాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఝర్సుగూడ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు స్థానికులు
కూర మాడిపోయిందనే కోపంతో ఓ వ్యక్తి భార్యను దారుణంగా కొట్టి హత్య చేశాడు. అనంతరం గుట్టుచప్పుడు కాకుండా భార్య మృతదేహాన్ని ఇంటి వెనకాల ఉన్న ఖాళీ స్థలంలో పూడ్చిపెట్టాడు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న పోలవరం ప్రాజెక్టుపై ఇవాళ కీలక సమావేశం జరగనుంది… ఉదయం 11 గంటలకు వర్చువల్‌గా జరగనున్న ఈ భేటీకి ఆంధ్రప్రదేశ్ సహా నాలుగు రాష్ట్రాలకు చెందిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు.. ఉన్నతాధికారులు హాజరుకాబోతున్నారు.. వారితో కేంద్రం ఈ కీలక సమావేశాన్ని నిర్వహిస్తోంది… ఈ సమావేశానికి కేంద్ర జలసంఘం, డ్యాం డిజైన్ రివ్యూ ప్యానెల్ (డీడీఆర్‌పీ) అధికారులతో పాటు సాంకేతిక నిపుణులు కూడా హాజరవుతారని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది… ఆయా రాష్ట్రాల నీటిపారుదల…
Heavy Rains Across India: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తర ఆంధ్రప్రదేశ్-దక్షిణ ఒడిశాల తీరాలను అనుకుని పశ్చిమ- వాయువ్య బంగాళాఖాతంపై అల్పపీడనం ఏర్పడింది. దీంతో దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురవనున్నట్లు భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది. దక్షిణ ఒడిశా- ఉత్తరాంధ్రల మధ్య అల్పపీడనం కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఒడిశా, ఏపీ, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
woman killed for refusing to marry: ప్రేమ పేరుతో హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ప్రేమకు ఒప్పుకోలేదనో.. పెళ్లికి నిరాకరించిందనో యువతులను దారుణంగా హత్య చేస్తున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒడిశా రాష్ట్రంలో చోటుచేసుకుంది. పెళ్లి ప్రతిపాదనకు తిరస్కరించిందని యువతిని హత్య చేసి.. తాను కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.
డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO), ఇండియన్ నేవీ ఇవాళ ఒడిశా తీరంలోని ఛాందిపూర్ ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ITR) నుంచి వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్ సర్ఫేస్-టు-ఎయిర్ మిస్సైల్ (VL-SRSAM) ను విజయవంతంగా పరీక్షించాయి.
ఓ వ్యక్తి స్నేహితులతో సరదాగా మందు తాగుదామని కూర్చున్నాడు. అందరూ కలిసి కలిసి మద్యం సేవించారు. అప్పటివరకు సరదాగా ఉండి మద్యం మత్తులో స్నేహితుడి మలద్వారం స్టీల్ గ్లాసును చొప్పించారు. ఈ దారుణ ఘటన ఒడిశాలోని గంజాం జిల్లాలోని బెరంపూర్లో చోటుచేసుకుంది.