Frog Curry : కప్పకూర తిన్న కుటుంబం.. కక్కుకుని చనిపోయిన బాలిక
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Frog Curry : చైనాలో జనాలు ఏది పడితే అది తింటారు.. కాబట్టే వాళ్లకు ఇన్ని రోగాలని ఆడిపోసుకునే వారు ఉన్నారు. కప్పలు, పిల్లులు, ఎలుకలు ముంగిసలు.. దేన్ని వదలరంటూ మనోళ్లు సరదాగా మాట్లాడుకుంటారు. నిజానికి మనదేశంలో కూడా అలాంటివి తిని అరాయించుకునేవాళ్లు చాలా మందే ఉన్నారు. కొన్ని తెగలు, నిరుపేదలు వీటిని తింటుంటారు. అందులో కొన్ని సార్లు విషాదాలు చోటుచేసుకున్న ఘటనలు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒడిశాలో జరిగింది. ఇంట్లోకి వచ్చిన కప్పను కోసుకుని తిన్న కుటుంబంలో ఒక బాలిక చనిపోగా, మరో బాలిక ఆస్పత్రిపాలైంది.
Read Also: Parking Bikes Theft: పార్కింగ్ లో బైక్ పెడితే అంతే సంగతులు.. ఘరానా దొంగ అరెస్ట్
Also Read
- SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
- Chairman's Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
- Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
- Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు... సీట్లు దక్కేదెవరికి...?
ఒడిశాలోని కియోంజర్ జిల్లాలోని బోడా బ్లాక్‌కు చెందిన మున్నాముండా అనే గిరిజనుడి ఇంట్లోకి ఓ కప్ప వచ్చింది. మున్నా దాన్ని వండి కూర చేశాడు. ఇంట్లో అందరూ తిన్నారు. మున్నా కూతురు ఆరేళ్ల సుమిత్ర ఆ కూరతో అనారోగ్యం బారినపడి చనిపోయింది. మరో కూతురు నాలుగేళ్ల మున్నీ తీవ్ర అస్వస్థతకు గురికాగా వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. కప్ప కూర తిన్న పెద్దలకు ఏమీ కాలేదు. పిల్లలకు రోగనిరోధక శక్తి తక్కువ కావడం దుష్ప్రభావం చూపిందని అధికారులు చెప్పారు. కొన్ని రకాల కప్పల్లో శత్రువుల నుంచి రక్షించుకోడానికి విషం ఉంటుందని మున్నా కుటుంబం అలాంటి కప్పనే వండుకుని ఉంటుందని చెబుతున్నారు. కప్పల చర్మపై విషగ్రంధులు ఉంటాయని గిరిజనులు జాగ్రత్తగా ఉండాలని వీఎస్‌ఎస్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ప్రొఫెసర్ సంజీబ్ మిశ్రా తెలిపారు.
Read Also: TSRTC: మహా శివరాత్రికి 2,427 స్పెషల్ బస్సులు
తాజావార్తలు
-
SIRపై సుప్రీంకోర్టు ఏం తేల్చనుంది? పిటిషన్‌లోని ముఖ్యమైన అభ్యంతరాలు ఇవే
-
ACB Raids : రూ.20 లక్షల లంచం.. ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, సర్వేయర్.!
-
Chairman’s Desk: ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ఎందుకు కీలకం..? అసలు యువత ఏం ఆశిస్తోంది..?
-
Off The Record: పోగొట్టుకున్న చోటే వెతుకులాట.. సింగరేణిపై గులాబీ గురి
-
Off The Record: గవర్నర్ కోటా MLCలపై కాంగ్రెస్ కసరత్తు… ఆ సీట్లు దక్కేదెవరికి..?
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?