పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఆంధప్రదేశ్ కి వరం లాంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) విచారణ నుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తప్పుకున్నారు. పోలవరం నిర్మాణానికి 2014 అంచనాల ప్రకారం నిధులు విడుదల చేస్తామని కేంద్రం ప్రకటించిందని, ఏపీ పునర్విభజన చట్టంలోని సెక్షన్ 90 ప్రకారం ఆ ప్రాజెక్టు నిర్మాణానికి అయ్యే పూర్తి ఖర్చును కేంద్రమే భరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు 2017లో ఈ పిల్ దాఖలు చేశారు.
Read Also: Uttarakhand Minister: ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ హత్యలు ప్రమాదాలే.. మంత్రి సంచలన వ్యాఖ్యలు
ఈ వ్యాజ్యంలో ఇంప్లీడ్ అయ్యేందుకు అనుమతించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ అనుబంధ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ డీవీఎస్ సోమయాజులతో కూడిన ధర్మాసనం ఎదుట మంగళవారం ఈ పిల్ విచారణకు వచ్చింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీజే స్పందిస్తూ.. అడ్వకేట్ జనరల్‌గా వ్యవహరించిన సమయంలో ఛత్తీ్‌సగఢ్ ప్రభుత్వానికి పోలవరం ప్రాజెక్ట్‌పై న్యాయసలహా ఇచ్చానన్నారు. ఆ సమయంలో సుప్రీంకోర్టులో వ్యాజ్యం వేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో కేసు విచారణ నుంచి తాను తప్పుకొంటున్నట్టు ప్రకటించారు. వ్యాజ్యాన్ని మరో బెంచ్ ముందు విచారణకు ఉంచాలని రిజిస్ట్రీని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
Read Also: Miracle Escape : భూమ్మీద నూకలుండడం అంటే ఇదేనేమో.. జస్ట్ మిస్