Frog Curry : చైనాలో జనాలు ఏది పడితే అది తింటారు.. కాబట్టే వాళ్లకు ఇన్ని రోగాలని ఆడిపోసుకునే వారు ఉన్నారు. కప్పలు, పిల్లులు, ఎలుకలు ముంగిసలు.. దేన్ని వదలరంటూ మనోళ్లు సరదాగా మాట్లాడుకుంటారు.
Odisha Minister : ఒడిశా ఆరోగ్య మంత్రి నబా దాస్‌పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రిజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ కాల్పులు జరిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా అతడిపై కాల్పులు జరపడంతో ఛాతిలో బుల్లెట్ గాయాలయ్యాయి.
ఒడిశాలోని కటక్ జిల్లాలో శనివారం జరిగిన తొక్కిసలాటలో ఒకరు మృతి చెందగా, మరో 20 మంది గాయపడ్డారని, వారిలో నలుగురి పరిస్థితి తీవ్రంగా ఉందని పోలీసులు తెలిపారు.
ఒడిశాలో మంగళవారం మరో రష్యన్ శవమై కనిపించాడని, పక్షం రోజుల్లో ఇది మూడోదని పోలీసులు తెలిపారు. జగత్‌సింగ్‌పూర్ జిల్లాలోని పారాదీప్ ఓడరేవులో లంగరు వేసిన ఓడలో మిల్యకోవ్ సెర్గీ అనే రష్యన్ వ్యక్తి శవమై కనిపించాడు.
Jharana Das: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ ఒడియా నటి ఝరానా దాస్ మృతి చెందారు. 77 ఏళ్ళ ఝరానా గత కొన్నిరోజుల నుంచి వృద్ధాప్య సమస్యలతో బాధపడుతుంది.
ఒడిశాలోని జాజ్‌పూర్‌లోని కొరీ రైల్వే స్టేషన్ వద్ద గూడ్స్ రైలు వ్యాగన్లు పట్టాలు తప్పి ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లడంతో ముగ్గురు వ్యక్తులు మరణించారు. సోమవారం ఉదయం 6.44 గంటలకు ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.