Odisha Minister : కాల్పుల్లో గాయపడిన ఒడిశా మంత్రి నవకిశోర్ దాస్ కన్నుమూత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Odisha Minister : ఒడిశా ఆరోగ్య మంత్రి నబా దాస్‌పై ఆదివారం ఝార్సుగూడ జిల్లాలోని బ్రిజరాజ్‌నగర్ సమీపంలోని గాంధీచౌక్ సమీపంలో ఏఎస్ఐ గోపాలచంద్ర దాస్ కాల్పులు జరిపారు. ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళుతుండగా అతడిపై కాల్పులు జరపడంతో ఛాతిలో బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే ఆయనను చికిత్స కోసం సమీపంలో ఆసుపత్రిలో చేర్చారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్నుమూశారు. డాక్టర్ దేబాశిస్ నాయక్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆయనకు శస్త్రచికిత్స నిర్వహించింది. గుండె, ఎడమ ఊపిరితిత్తుల వైపు దూసుకెళ్లిన బుల్లెట్ తీవ్ర గాయం చేయడంతో.. నవకిశోర్ దాస్ మృతిచెందినట్టు ప్రకటించారు.
Read Also: Novok Djokovic : ఆస్ట్రేలియా ఓపెన్ విజేత జకోవిచ్.. నాదల్ రికార్డ్ సమం
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
ఓ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగినట్లు సమాచారం. వాహనం దిగుతున్న సమయంలో దుండగుడు కాల్పులు జరిపాడు. దాడి వెనుక ఉద్దేశాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాల్పులు జరిపిన ఏఎస్ఐ మానసిక స్థితి సరిగా లేదని ఆయన కుటుంబసభ్యులు చెబుతున్నారు. దాడి విషయం తెలియగానే బీజేడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మంత్రిపై కాల్పుల గురించి తెలిసిన ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వెంటనే స్పందించారు.
Read Also: U19 women’s worldcup : అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ విజేతగా టీమిండియా
బీజేడీలో సీనియర్ నేత అయిన నబకిశోర్ దాస్ ఓ దేవాలయానికి రూ.కోటికిపైగా విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు విరాళం ఇచ్చి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే. అయితే, 2024 అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న వేళ మంత్రిపై దాడులు జరగడం పార్టీలో తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!