ఒడిశాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కెంధూఝర్ పట్టణంలోని ఓ మార్కెట్ లో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో దాదాపు 200 వరకు దుకాణాల సముదాయం పూర్తిగా దగ్దమైయినట్లు తెలుస్తోంది.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఆంధ్రా, ఒడిశా వివాదాస్పద గ్రామాల్లో పర్యటిస్తూ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర ఆగ్రహం వ్యక్తం చేశారు.
పెళ్లి కోసం వరుడితో పాటు అతని కుటుంబసభ్యులు వధువు ఇంటికి చేరుకునేందుకు 28 కిలోమీటర్లు నడిచారు. డ్రెవర్ల సమ్మె కారణంగా పెళ్లి కోసం అని వధువు ఇంటికి వెళ్లే ప్రత్యామ్నాయ మార్గం కానరాక నానా తిప్పలు పడుతూ దాదాపు 28 కిలోమీటర్లు నడిచారు.
ఊరు దాటాలంటే వాగు దాటాలి.. వాగు దాటాలంటే చెట్టు ఎక్కాలి. ఇది ఓ గ్రామంలోని ప్రజలు పడుతున్న అవస్థ. ఒడిషాలోని గజపతి జిల్లా రాయగడ బ్లాక్‌లోని ఏడు గిరిజన గ్రామాలకు సరైన దారి లేదు. ఈ గ్రామాల ప్రజలు వేరే ఊరు వెళ్లాలంటే వాగును దాటాలి.
Spy Pigeon: ఒడిశాలోని పారాదీప్ తీరంలో ఓ అనుమానిత గూఢచార పావురం కలకలం సృష్టిస్తోంది. జగత్సింగ్పూర్ జిల్లాలో ఓ పావురానికి కెమెరా, మైక్రోచిప్ అమర్చి ఉండటాన్ని అక్కడి స్థానికులు గమనించారు. దీన్ని ఓ చేపలు పట్టే పడవలో పట్టుబడింది. ఈ పావురాన్ని గూఢచర్యానికి ఉపయోగించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.కొద్ది రోజుల క్రితం కొందరు మత్స్యకారులు తమ పడవపై పావురం ఉన్నట్లు గుర్తించారు. బుధవారం పారాదీప్లో పక్షిని పట్టుకుని మెరైన్ పోలీసులకు అప్పగించారు.
ఒడిశాలో ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని జాజ్పూర్ జిల్లాలో 20 ఏళ్ల యువకుడు తన తండ్రిని నరికి చంపి, ఆపై సవతి తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు మంగళవారం తెలిపారు.
Gold Mines : ఒడిశాలోని మూడు జిల్లాల్లోని వేర్వేరు ప్రాంతాల్లో బంగారు గనులు ఉన్నట్లు ఉక్కు, గనుల శాఖ మంత్రి ప్రఫుల్ల మల్లిక్ సోమవారం రాష్ట్ర అసెంబ్లీలో వెల్లడించారు.
Odisha: తనకు అప్పటికే 11 మంది పిల్లలు. చాలీచాలని బతుకులు. రెక్కడితే కానీ డొక్కాడని కుటుంబం. దీంతో ఆ మహిళ భర్తకు చెప్పకుండా కుటుంబ నియంత్రణ ఆపరేషన్ (ట్యూబెక్టబీ ఆపరేషన్) చేయించుకుంది. ఇది తెలిసిన భర్త ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. ఆధునిక యుగంలో ఉన్న కూడా కొన్ని ప్రాంతాల్లో మూఢనమ్మకాల మత్తు వీడటం లేదు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లాలో జరిగింది. మూడు రోజుల క్రితం తన భర్త ఇంటి నుంచి వెళ్లగొట్టడంతో జానకి…