ఒడిషా రైలు ప్రమాదంలో నిర్లక్ష్యంగా వ్యవహారించిన అధికారులపై రైల్వే శాఖ వేటు వేసింది. తమ విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారించడం వల్ల వందలాది మంది ప్రాణాలు కోల్పోయారని.. వేలాది మంది గాయపడ్డారని పేర్కొంటూ.. ఏడు మందిపై రైల్వే శాఖ వేటు వేసింది.
నవమాసాలు మోసి కన్న బిడ్డను దారుణంగా అమ్మేసింది ఓ కసాయి తల్లి. ముక్కుపచ్చలారని 8 నెలల పసికందును రూ.800లకు బేరం పెట్టింది. ఒడిశాలోని మయూర్ భంజ్ జిల్లా ఖుంటా పోలీసు స్టేషన్ పరిధిలోని మహూలియా గ్రామంలో చోటుచేసుకున్న ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఒడిషాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం రాంగ్ సిగ్నలింగ్ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ నివేదికలో పేర్కొంది. ఒడిషా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ తన నివేదికను సమర్పించింది.
Semiconductor: భారతదేశం పెట్టుబడుకు స్వర్గధామంగా మారుతోంది. ఇప్పటికే పలు సెమికండక్టర్ దిగ్గజ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ రంగంలో చైనా, తైవాన్ నియంతృత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చిప్ తయారీకి భారత్ గమ్యస్థానంగా మార్చాలని కేంద్ర భావిస్తోంది. ఇప్పటికే ఫాక్స్ కాన్-వేదాంత, మైక్రాన్ వంటి దిగ్గజ సెమికండక్టర్, చిప్ కంపెనీలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా తాము ఇండియాలో పెట్టుబడి పెడుతున్నట్లు మైక్రాన్…
ఒడిషాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో నెల రోజుల తరువాత రైల్వే శాఖలో ఉన్నతాధికారిపై వేటు వేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. భారతీయ రైల్వే చరిత్రలోఅత్యంత ఘోరప్రమాదాల్లో ఒడిశాలోని బహనాగ మూడు రైళ్ల ప్రమాదం ఒకటి.
Puri Jagannath Rath Yatra: ఒడిశా పూరీలోని జగన్నాథుడి రథయాత్ర మంగళవారం ప్రారంభమైంది. వేలాదిగా భక్తులు పూరీకి చేరుకున్నారు. పూరీ క్షేత్రం మొత్తం ఆధ్యాత్మికంగా మారింది. ఒడిశా ప్రభుత్వం ఈ కార్యక్రమం కోసం భారీగా ఏర్పాట్లు చేసింది. ఈ రోజు ఉదయం జగన్నాథ
Mangoes stolen: ఒక్కోసారి ఆన్ లైన్ పోస్టులతో ఫేమస్ అవ్వడమే కాదు. దొంగతనాలు కూడా జరుగుతాయని ఈ ఘటన నిరూపించింది. ఏకంగా రైతు లక్షల్లో నష్టపోవాల్సి వచ్చింది. అంతర్జాతీయ మార్కెట్ లో కిలోకి రూ.2.5 లక్షల విలువైన మామిడి పండ్లు దొంగతనానికి గురయ్యాయి. తోటలోకి ప్రవేశించిన దొంగలు తెల్లారే సరికి మామిడిని చోరీ చేశారు. ఈ ఘటన ఒడిశాలోని నువాపాడా జిల్లాలో జరిగింది.
డిశాలోని రాయగడ జిల్లాలోని అంబోదలా యార్డ్‌లోని వేదాంత లిమిటెడ్ ప్లాంట్‌కు శనివారం వెళ్తుండగా గూడ్స్ రైలు నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పాయి. ఒడిశాలోని రాయగడ జిల్లా అంబడోలా సమీపంలో శనివారం గూడ్స్ రైలుకు చెందిన నాలుగు వ్యాగన్లు పట్టాలు తప్పి నట్లు రైల్వే అధికారి తెలిపారు.
Odisha: టాటా స్టీల్ ఫ్యాక్టరీలో ప్రమాదం జరిగింది. ఒడిశాలోని దెంకనల్ జిల్లాలోని టాటా స్టీల్ కు చెందిన మెరమండలి ప్లాంట్ లో మంగళవారం ఆవిరి లీక్ అయింది. ఈ ఘటనలో మొత్తం 19 మంది గాయపడినట్లు అక్కడి పోలీసులు వెల్లడించారు. తీవ్రంగా కాలిన గాయాలు అయిన వారిని వెంటనే కటక్ లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. బ్లాస్ ఫర్నెస్ ని పరిశీలిస్తున్న సందర్భంలో ఈ ఘటన జరిగింది. కార్మికులు, పలువురు ఇంజనీర్లు గాయపడ్డారు.