Odisha Train Accident: ఒడిషాలోని బాలాసోర్‌లో జరిగిన రైలు ప్రమాద ఘటనకు ప్రధాన కారణం రాంగ్ సిగ్నలింగ్ అని ఉన్నత స్థాయి విచారణ కమిటీ స్పష్టం చేసింది. భద్రతా ప్రమాణాలు పాటిస్తే దుర్ఘటన జరిగి ఉండేది కాదని కమిటీ నివేదికలో పేర్కొంది. ఒడిషా ఘోర రైలు ప్రమాదంపై రైల్వే బోర్డుకు సేఫ్టీ కమిషన్ తన నివేదికను సమర్పించింది. బహుళ స్థాయిలో జరిగిన లోపాలను కమిటీ తన నివేదికలో ఎత్తి చూపింది. గతేడాది సైతం ఇదే తరహా దుర్ఘటన జరిగిందని నివేదిక పేర్కొన్న సేఫ్టీ కమిషన్.. గతంలో జరిగిన లోపాన్ని సరి చేస్తే ప్రమాదం జరిగి ఉండేది కాదని రైల్వే సేఫ్టీ కమిషన్ (CRS) రైల్వే బోర్డుకు సమర్పించిన స్వతంత్ర విచారణ నివేదికలో స్పష్టం చేసింది.
Read also: Chicken Quality Test: మీరు తినే చికెన్ తాజాదేనా.. ఈ చిట్కాలతో టెస్ట్ చేయండి?
కమిషన్ తన నివేదికను సమర్పిస్తూ.. రాంగ్ వైరింగ్, సిగ్నలింగ్, సర్క్యూట్‌లో లోపాలు ప్రమాదానికి కారణమని నివేదికలో తెలిపింది. 2022 మే 16న సౌత్ ఈస్టర్న్ రైల్వేలోని ఖరగ్‌పూర్ డివిజన్‌లో రాంగ్ వైరింగ్, కేబుల్‌లో లోపాల కారణంగా ఇలాంటి ఘటనే జరిగిందని కమిషన్ గుర్తు చేసింది.. ఆ సంఘటన తర్వాత రాంగ్ వైరింగ్ సమస్య పరిష్కారానికి దిద్దుబాటు చర్యలు తీసుకొని ఉన్నట్లయితే బహనగ బజార్ వద్ద ప్రమాదం జరిగి ఉండేదని కాదని నివేదికలో అభిప్రాయపడింది. సైట్‌లో కంప్లీషన్ సిగ్నలింగ్ వైరింగ్ రేఖా చిత్రాలు, ఇతర డాక్యుమెంట్‌లు, సిగ్నలింగ్ సర్క్యూట్‌ల అక్షరాలను అప్‌డేట్ చేసేందుకు ఓ డ్రైవ్‌ను ప్రారంభించాలని.. అలాగే మార్పుల కోసం ప్రామాణిక పద్ధతులను అనుసరించాలని సూచించింది. సిగ్నలింగ్ సర్క్యూట్‌లు, పనితీరును తనిఖీ చేసేందుకు ప్రత్యేకంగా బృందాన్ని నియమించాలని కమిషన్ నివేదికలో సూచించింది.
Read also: President: నేడు హైదరాబాద్ కు రాష్ట్రపతి రాకా.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు
ఇంకా తన నివేదికలో ఇలాంటి విపత్కర ప్రమాదాలు జరిగిన సమయంలో ప్రతిస్పందన వేగంగా ఉండాలని, జోనల్ రైల్వేల్లో విపత్తు ప్రతి స్పందన వ్యవస్థను సమీక్షించాలని, ఎన్‌డీఆర్‌ఎఫ్ వంటి వివిధ విపత్తు ప్రతిస్పందన దళాల మధ్య సమన్వయాన్ని సమీక్షించాలని రైల్వేలకు సూచించాలని నివేదికలో సూచించింది. ఒడిషా రాష్ట్రం జూన్ 2న బాలాసోర్ బహనగ బజార్ వద్ద జరిగిన ప్రమాదంలో 292 మంది మరణించగా.. వెయ్యి మందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. ఇది దేశంలోనే అతిపెద్ద రైలు ప్రమాదంగా నిలువగా.. ఘటనలో మృతి చెందిన వారి గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. సుమారు 50 మంది మృతులను గుర్తించాల్సి ఉంది. మృతదేహాల నుంచి డీఎన్‌ఏ నమూనాలను సేకరించి.. మృతుల ఆచూకీ తెలుసుకునేందుకు రైల్వేశాఖ ప్రయత్నాలు చేస్తూనే ఉంది.