Semiconductor: ఇండియాకు క్యూ కడుతున్న చిప్ కంపెనీలు.. ఒడిశాలో యూనిట్ పెట్టేందుకు యూకే సంస్థ ప్లాన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Semiconductor: భారతదేశం పెట్టుబడుకు స్వర్గధామంగా మారుతోంది. ఇప్పటికే పలు సెమికండక్టర్ దిగ్గజ కంపెనీలు భారత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఈ రంగంలో చైనా, తైవాన్ నియంతృత్వం నడుస్తోంది. ఈ నేపథ్యంలో చిప్ తయారీకి భారత్ గమ్యస్థానంగా మార్చాలని కేంద్ర భావిస్తోంది. ఇప్పటికే ఫాక్స్ కాన్-వేదాంత, మైక్రాన్ వంటి దిగ్గజ సెమికండక్టర్, చిప్ కంపెనీలు గుజరాత్ లో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. ఇటీవల ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన సందర్భంగా తాము ఇండియాలో పెట్టుబడి పెడుతున్నట్లు మైక్రాన్ స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే ఇప్పుడు యూకే కు చెందిన మరో కంపెనీ ఒడిశాలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. మొత్తం రూ.2 లక్షల కోట్ల ప్రాజెక్టులో మొదటి దశలో రూ. 30,000 కోట్ల పెట్టుబడితో ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. SRAM & MRAM టెక్నాలజీస్ అండ్ ప్రాజెక్ట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూకే అధారిత కంపెనీ. ఇది ఒడిశాలోని గంజాం జిల్లాలో సెమికండక్టర్ యూనిట్ ఏర్పాటు చేసేందుకు ఒడిశా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకం చేశాయి.
Also Read
- Upcoming IPOs : వచ్చే వారం మార్కెట్లో ఐపీఓల జాతర.. ఏకంగా 19 కంపెనీల ఎంట్రీ! పూర్తి వివరాలు ఇవే..
- RVNL New Order: నవరత్న కంపెనీకి రూ. 404 కోట్ల రైల్వే ప్రాజెక్ట్.. సోమవారం ఈ షేర్లలో కదలికలు..
- Amazon Sale: ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ 2026’ సేల్.. తేదీ ప్రకటించిన అమెజాన్..
- EPS: సుప్రీంకోర్టు తీర్పు ఉన్నా వీడని ఈపీఎస్ కష్టాలు.. తెరపైకి కొత్త చిక్కులు..
Read Also: Nadipelli Diwakar Rao : మంచిర్యాల బీఆర్ఎస్ అభ్యర్ధిగా మళ్లీ దివాకర్ రావు.!
గంజాం జిల్లాలో అన్ని సదుపాయాలు కల్పిస్తామని ఆ జిల్లా కలెక్టర్ దిబ్యా జ్యోతి పరిదా పెట్టుబడిదారులకు ప్రభుత్వం తరుపున హామీ ఇచ్చారు. ఈ యూనిట్ ను దాదాపుగా 800 ఎకరాల్లో ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. ఈ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఇప్పటికే ఒడిశాలోని పలు జిల్లాలను సందర్శించినప్పటికీ.. గోపాల్‌పూర్ ఓడరేవు, ప్రత్యేక పారిశ్రామిక కారిడార్, ఎయిర్‌స్ట్రిప్ మరియు జాతీయ రహదారికి సమీపంలో ఉన్నందున గంజాం జిల్లాలోని ఛత్రపూర్ కి ప్రాధాన్యత ఇచ్చారు. రెండేళ్ళలో యూనిట్‌ని స్థాపించి 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 నాటికి దాదాపు ₹ 2 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టి తదుపరి దశల్లో యూనిట్‌ను విస్తరించాలని కూడా యోచిస్తోందని కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
ప్రస్తుత యుగంలో సెమికండక్టర్స్ చాలా కీ రోల్ పోషిస్తున్నాయి. మనం ఉపయోగిస్తున్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ సెమికండక్టర్లతో పనిచేస్తున్నాయి. మొబైల్ ఫోన్‌లు, టెలివిజన్ సెట్‌లు, ల్యాప్‌టాప్‌లు, ఎయిర్ కండిషనర్లు, కార్లకు చిప్ సెట్స్ అవసరం. ఏటా మన దేశం దాదాపు ₹ 3 లక్షల కోట్ల సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంటోంది. కంపెనీలు భారత్ లో వెలిస్తే విదేశీ మారక ద్రవ్యం కాపాడుకోవచ్చు.
తాజావార్తలు
-
The Paradise: నాని ‘ది ప్యారడైజ్’కు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. టికెట్ రేట్లు పెంపు, స్పెషల్ షోలకు ఓకే!
-
Komatireddy Venkat Reddy : కేటీఆర్ నోరు అదుపులో పెట్టుకోవాలి.. మంత్రి కోమటిరెడ్డి హాట్ కామెంట్స్..
-
Asaduddin Owaisi: ‘బీజేపీని ఆపాలంటే మాతో మాట్లాడండి’.. యూపీలో ఓవైసీ ఆఫర్..
-
Team India: టీమిండియాకు బిగ్ షాక్.. శుభమన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా దూరం.. కారణం ఇదే..
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
ట్రెండింగ్
-
Asian Games 2026: బంగ్లాదేశ్‌పై భారత్ ఘన విజయం.. బంగారు పతకం కొసం ఫైనల్లో శ్రీలంకతో అమితుమీ.!
-
200MP + 200MP కెమెరాలు, 8,500mAh బ్యాటరీతో వచ్చేస్తున్న Xiaomi 18 Pro సిరీస్..!
-
Shafali Verma: ఆకాశమే హద్దుగా సిక్సర్ల సునామీ.. షఫాలీ వర్మ అద్భుత సెంచరీ..! బంగ్లాకు భారీ టార్గెట్!
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!