Old Love Marriage in Odisha Goes Viral: ‘ప్రేమ’ గుడ్డిది అంటారు. ప్రేమకు కులం, మతం, ప్రాంతం, దేశం, ఆస్తి మరియు అంతస్తుతో సంబంధం లేదు. ప్రస్తుత రోజుల్లో ఎవరైనా, ఏ వయసులో వారైనా ప్రేమలో ఇట్టే పడిపోతున్నారు. ఈ క్రమంలోనే ఏజ్ జస్ట్ నంబర్ మాత్రమే అని, రెండు మనస్సులు కలిస్తే చాలని ఒడిశాలోని ఇద్దరు లేటు ప్రేమికులు నిరూపించారు. 76 ఏళ్ల వయస్సు ఓ వృద్ధుడు.. 47 వయస్సున్న మహిళ ఎనిమిదేళ్లుగా ప్రేమలో మునిగిపోయి చివరకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. లేటు వయసులో చిగురించిన ఈ ఘాటు ప్రేమ కథ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఒడిశాలోని గంజాం జిల్లా శంఖేముండి మండలం అడపాడ గ్రామానికి చెందిన రామచంద్ర సాహు అనే వృద్ధుడికి చాలా ఏళ్ల క్రితం పెళ్లి అయింది. అతడు తన ఇద్దరు కూతుళ్లకు పెళ్లి చేశాడు. భార్య చనిపోవడంతో 18 ఏళ్ల నుంచి ఒంటరిగానే ఉంటున్నాడు. ఏడేళ్ల క్రితం భంజ్‌నగర్ కులాగర్ గ్రామంలో జరిగిన ఓ విందులో సురేఖ సాహును రామచంద్ర చూశాడు. తొలి చూపులోనే సురేఖను పెళ్లి చేసుకోవాలని అతడు నిర్ణయించుకున్నాడు. ఏదో ఒకరోజు ఆమెకు ప్రపోజ్ చేయాలనుకున్నాడు.
Also Read: iPhone 15 Launch Date: యాపిల్ ప్రియులకు గుడ్‌న్యూస్.. ఐఫోన్ 15 విడుదల ఆ రోజే!
పెళ్లి చేసుకుంటానని రామచంద్ర సాహు చెప్పిన మాటలకు సురేఖ సాహు అంగీకరించింది. దాంతో ఇద్దరు ఫోన్‌లో మాట్లాడుకున్నారు. స్నేహం ప్రేమగా మారింది. మొదటి భార్యను కోల్పోయిన రామచంద్ర.. సురేఖ ఓదార్పుకు పడిపోయాడు. ఇక పెళ్లి ఇద్దరు చేసుకోవాలనుకున్నారు. వీరి ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు కూడా అడ్డు చెప్పలేదు. 2023 జులై 19న భంజ్‌నగర్ కోర్టులో రామచంద్ర, సురేఖ వివాహం చేసుకున్నారు. ఆపై గుడిలో తమ ఆచారాల ప్రకారం మళ్లీ పెళ్లి చేసుకున్నారు.
రామచంద్ర సాహు, సురేఖ సాహు వివాహంపై అడపాడ గ్రామంలోని స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. సామాజిక కార్యకర్త హరేక్రుష్ణ మల్లిక్ కూడా ఈ అద్భుతమైన ప్రేమకథను ప్రశంసించారు. ప్రేమకు సరిహద్దులు లేవని, జీవితంలోని ఏ దశలోనైనా ప్రేమ పుడుతుంది అనడానికి ఇది ఓ నిదర్శనం అని అన్నారు. రామచంద్ర, సురేఖలు తమ వివాహంపై సంతోషం వ్యక్తం చేశారు.
Also Read: Rohit Sharma: ఆ కారణంతోనే టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్నా: రోహిత్ శర్మ