Odisha Train Tragedy: గుర్తించలేని స్థితిలో ఇంకా 29 మృతదేహాలు.. ఏం చేయనున్నారు..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒడిశాలోని బాలాసోర్ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన 29 మృతదేహాలను గుర్తించలేదు. ఘటన జరిగి రెండు నెలలు గడుస్తుంది. జూన్ లో జరిగిన రైలు ప్రమాదంలో 294 మంది ప్రాణాలు కోల్పోయారు. 266 మృతదేహాలను గుర్తించి మృతుల బంధువులకు అప్పగించారు. మిగతా 29 మృతదేహాలను భువనేశ్వర్ ఎయిమ్స్‌లోని ఐదు కంటైనర్లలో భద్రపర్చినట్లు ఎయిమ్స్ భువనేశ్వర్ సూపరింటెండెంట్ దిలీప్ పరిదా తెలిపారు.
BJP: తెలంగాణలో పర్యటించనున్న ఇతర రాష్ట్రాల బీజేపీ ఎమ్మెల్యేలు
Also Read
రైలు ప్రమాదం తర్వాత ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి మొత్తం 162 మృతదేహాలను వెలికితీశామని దిలీప్ కుమార్ పరిదా చెప్పారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన 81 మందిని మొదటి దశలో వారి కుటుంబ సభ్యులకు అందించామని ఆయన పేర్కొన్నారు. డీఎన్ఏ పరీక్ష ఫలితాల ఆధారంగా మరో 52 మృతదేహాలను వారి కుటుంబాలకు అప్పగించారు. అయితే గుర్తింపబడని మృతదేహాల విషయంలో ఏమి చేయాలో కేంద్ర ప్రభుత్వం మరియు ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాయని దిలీప్ కుమార్ తెలిపారు. అంతేకాకుండా రెండు అవకాశాలున్నాయి. మొదటిది, మృతదేహాలను ప్రభుత్వం దహన సంస్కారాలు చేయవచ్చు. రెండవది మృతదేహాలను పరిశోధన కోసం వైద్య కళాశాలకు పంపవచ్చు అని పేర్కొన్నారు.
Haryana CM: హర్యానా సీఎం వివాదస్పద వ్యాఖ్యలు..
జూన్ లో ఒడిశా నుంచి చెన్నై వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలు ఢీకొన్నాయి. ఈ రైలు ప్రమాదంలో 294 మంది మరణించగా, 800 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలో జరిగిన ఈ రైలు ప్రమాదం దేశంలోనే అత్యంత ఘోరమైన రైలు ప్రమాదాల్లో ఒకటిగా చెప్పవచ్చు.
తాజావార్తలు
-
BC Reservation: బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పు.. జీవోలు కొట్టివేత
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?
-
ATF Price Hike: విమాన ప్రయాణికులకు షాక్.. జెట్ ఫ్యూయల్ ధరలు పెంపు..
-
Chandu Mondeti : టాలీవుడ్, బాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లాక్..?
-
UPSC Centenary 2026: UPSC శతాబ్ది వేడుకలు.. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వందేళ్ల చరిత్ర ఇదే
ట్రెండింగ్
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!