Husband Dones Wife Marriage With Her Boyfriend In Odisha: సినిమాల ప్రభావం జనాలపై బాగానే ఉంది. అచ్చం ‘కన్యాదానం’ సినిమాలో మాదిరి ఓ ఘటన రిపీట్ అయింది. ఇవివి సత్యనారాయణ దర్శకత్వంలో 1998లో విడుదలైన కన్యాదానం సినిమాలో హీరో శ్రీకాంత్.. తన భార్య రచనను ఆమె ప్రియుడు ఉపేంద్రకు ఇచ్చి పెళ్లి చేస్తాడు. అచ్చు ఇలాంటి ఘటనే రియల్‌గా జరిగింది. ఓ భర్త తన భార్య ప్రేమించిన వాడితో అన్నీ తానై మరీ పెళ్లి జరిపించాడు. ఈ ఘటన ఒడిశాలోని కటక్ జిల్లాలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి..
ఒడిశాలోని సోన్పూర్ జిల్లా శుభలాయి పోలీస్ స్టేషన్ పరిధిలోని కిరాసి గ్రామానికి చెందిన మాధవ ప్రధాన్.. అనుగుల్ ప్రాంతానికి చెందిన జిల్లిని మూడేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. మొదటలో వీరి కాపురం బాగానే సాగింది. అయితే ఇటీవల కాలంలో జిల్లి దూరపు బంధువైన పరమేశ్వర ప్రధాన్‌తో సన్నిహితంగా ఉంటోంది. పీకల్లోతు ప్రేమలో మునిగిపోయిన పరమేశ్వర, జిల్లి లేచిపోదామని ప్లాన్ వేసుకున్నారు. ఈ క్రంమలోనే గురువారం ఇద్దరు కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయారు.
Also Read: Ovarian Cancer Risk: బ్యూటీషియన్స్ బీ అలెర్ట్.. క్యాన్సర్ ముప్పు తప్పదు!
తన భార్య జిల్లి కనిపించడం లేదని మాధవ ప్రధాన్ దగ్గర్లోని శుభలాయి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పరమేశ్వర ప్రధాన్‌తో ఉన్న సంబంధం గురించి విషయం చెప్పాడు. పోలీసులు గాలించి పరమేశ్వర, జిల్లిని స్టేషన్‌కు తీసుకొచ్చారు. జిల్లిని పొలిసు అధికారి ప్రశ్నించగా.. పరమేశ్వర్ ప్రధాన్‌తోనే ఉంటానని, అతడినే పెళ్లి చేసుకుంటానని చెప్పింది. ఈ విషయం మాధవ ప్రధాన్‌కు పోలీసులు చెప్పారు. ఆలోచించిన మాధవ తన భార్య జిల్లికి మరో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. మాధవ అంగీకారంతో శనివారం రాత్రి పరమేశ్వర, జిల్లికి పోలీసు స్టేషన్‌లోనే వివాహం జరిగింది.
Also Read: Ashes 2023: ఇంగ్లండ్‌ను దెబ్బకొట్టిన వరణుడు.. ఆస్ట్రేలియాదే ‘యాషెస్’ సిరీస్!