రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికాపై భారత్ ఘనవిజయం సాధించింది. 7 వికెట్ల తేడాతో ప్రొటీస్ జట్టుపై గెలుపొందింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. 279 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా.. 45.5 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.
రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా భారత్ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది.
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో టీమిండియా పరాజయం పాలైంది. తొలి వన్డేలోని సఫారీలు విజయాన్ని నమోదు చేసుకున్నారు. భారత జట్టుపై దక్షిణాఫ్రికా 9 పరుగుల తేడాతో విజయాన్ని సాధించింది.
లక్నో వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని మొదటి వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్‌ను ఎంచుకుంది. ఈ మ్యాచ్‌కు శిఖర్ ధావన్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.
IND Vs SA: ప్రస్తుతం టీమిండియా, దక్షిణాఫ్రికా జట్ల మధ్య టీ20 సిరీస్ జరుగుతోంది. ఈ సిరీస్ అనంతరం ఇరు జట్ల మధ్య మూడు వన్డేల సిరీస్ జరగనుంది. ఈ వన్డే సిరీస్‌లో పాల్గొనే భారత జట్టును ఆదివారం నాడు సెలక్టర్లు ప్రకటించారు. టీ20 ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ సిరీస్ నుంచి ప్రధాన ఆటగాళ్లను తప్పించారు. ఈ మేరకు సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్‌ను కెప్టెన్‌గా నియమించారు. శ్రేయాస్ అయ్యర్ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. న్యూజిలాండ్-ఎతో…
IND Vs SA: ఆసియా కప్‌లో ఘోర వైఫల్యంతో సూపర్4 దశలో ఇంటి ముఖం పట్టిన టీమిండియా టీ20 ప్రపంచకప్ సన్నాహాలను ప్రారంభించింది. ఈ మేరకు సొంతగడ్డపై ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో వరుసగా మూడు టీ20ల సిరీస్‌ను ఆడనుంది. సెప్టెంబర్ 20, 23, 25 తేదీల్లో ఆస్ట్రేలియాతో మూడు టీ20లు జరగనున్నాయి. ఆ తర్వాత సెప్టెంబర్ 28 నుంచి దక్షిణాఫ్రికాతో మూడు టీ20లను టీమిండియా ఆడనుంది. టీ20 సిరీస్ ముగిసిన వెంటనే మూడు వన్డేల సిరీస్‌లో కూడా తలపడనుంది.…
IND Vs WI: పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో వన్డేలో భారత్ రెండు వికెట్ల తేడాతో అద్భుత రీతిలో విజయం సాధించింది. ఒక దశలో ఓడిపోయేలా కనిపించిన టీమిండియాను స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆదుకున్నాడు. అతడి ధనాధన్ ఇన్నింగ్స్ కారణంగా మూడు వన్డేల సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 311 పరుగులు…
రిషబ్ పంత్ సారథ్యంలో యంగ్ టీమిండియా టీ-20 సిరీస్‌లో దక్షిణాఫ్రికాతో తలపడుతుండగానే మరోవైపు సీనియర్ ఆటగాళ్లు లండన్‌కు పయనమయ్యారు. గురువారం టీమిండియా సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, కెప్టెన్ రోహిత్ శర్మ, ఛతేశ్వర్ పుజారాతో పాటు పలువురు ఆటగాళ్లు లండన్ బయలుదేరి వెళ్లారు. ఇందుకు సంబంధించి ఫొటోలను బీసీసీఐ ట్విటర్‌లో షేర్ చేసింది. గతేడాది ఇంగ్లాండ్ పర్యటనలో కరోనా కారణంగా వాయిదా పడ్డ ఆఖరి టెస్టు మ్యాచ్ ఆడనుంది టీమిండియా. జులై 1న ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఈ…
స్వదేశంలో వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌లకు సెలక్టర్లు భారత జట్టును ప్రకటించారు. రెండు ఫార్మాట్లకు కెప్టెన్‌గా రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్‌గా కేఎల్ రాహుల్ వ్యవహరించనున్నట్లు వెల్లడించారు. కేఎల్ రాహుల్ రెండో వన్డే నుంచి అందుబాటులో ఉండనున్నట్లు తెలిపారు. ఆల్‌రౌండర్ జడేజా ప్రస్తుతం మోకాలి గాయం నుంచి కోలుకుంటున్నాడని.. అందుకే అతడిని సెలక్ట్ చేయడం లేదని పేర్కొన్నారు. మరోవైపు ఈ సిరీస్‌లకు బుమ్రా, షమీలకు విశ్రాంతి ఇస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి ఫిట్‌గా లేని కారణంగా హార్డిక్…