Ind vs SA: రాంచీ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో దక్షిణాఫ్రికా భారత్ ముంగిట భారీ లక్ష్యాన్ని ఉంచింది. సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 278 పరుగులు చేసింది. రాంచీలోని జేఎస్‌సీఏ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు మొదట బ్యాటింగ్‌కు దిగింది. తొలుత తడబడిన దక్షిణాఫ్రికా జట్టు 15 ఓవర్ల అనంతరం పుంజుకుంది. ప్రొటీస్ ఒక దశలో 2 వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రీజా హెండ్రిక్స్, ఎయిడెన్ మార్‌క్రమ్ జట్టును ఆదుకున్నారు. ఇద్దరు అర్థశతకాలతో రెచ్చిపోవడంతో దక్షిణాఫ్రికా జట్టు భారీ స్కోరును సాధించగలిగింది. వారిద్దరే 129 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి స్కోరు సాధించడంలో సఫలమయ్యారు. వారిద్దరూ పెవిలియన్ చేరడంతో భారత్ మళ్లీ స్కోరును అదుపు చేసినట్లు తెలుస్తోంది.
Nayanthara: పెళ్లి తరువాత మొదటి హిట్.. ఎమోషనల్ అయిన లేడీ సూపర్ స్టార్
రీజా హెండ్రిక్స్ 74, ఎయిడెన్ మార్‌క్రమ్ 79 పరుగులతో జట్టును ఆదుకున్నారు. జట్టు స్కోర్ 169 పరుగుల వద్ద సిరాజ్ బౌలింగ్ రీజా హెండ్రిక్స్ భారీ షాట్‌కు ప్రయత్నించి, బౌండరీ వద్ద షాబాద్ అహ్మద్ చేతికి చిక్కాడు. ఎయిడెన్ మార్‌క్రమ్ 79 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. మహ్మద్ సిరాజ్ 10 ఓవర్లలో 38 పరుగులకు 3 వికెట్లతో ఆకట్టుకోగా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్ తలో వికెట్ తీశారు. తొలి వన్డేలో ఓటమి పాలైన భారత్ ఈ మ్యాచ్ గెలిచేందుకు చాలా శ్రమిస్తోంది.