బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ (BGT)కి ముందు ఆస్ట్రేలియాకు గట్టిదెబ్బ తగిలింది. పాకిస్థాన్ జట్టు ఆస్ట్రేలియాను తన సొంతగడ్డపై ఓడించింది. మూడో వన్డేలో పాకిస్థాన్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి మూడు వన్డేల సిరీస్‌ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.
భారత్-శ్రీలంక జట్ల మధ్య జరగనున్న టీ20, వన్డే సిరీస్ షెడ్యూల్ విడుదలైంది. టీ20, వన్డే సిరీస్‌ల షెడ్యూల్‌ను బీసీసీఐ గురువారం ప్రకటించింది. ఈ సిరీస్ జూలై 26 నుంచి ప్రారంభం కానుంది. తొలి టీ20 జూలై 26న పల్లెకెలెలో జరగనుంది. టీ20 సిరీస్‌లోని అన్ని మ్యాచ్‌లు ఈ మైదానంలో జరుగనున్నాయి. శ్రీలంక పర్యటనలో భారత్ మూడు టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. ఈ పర్యటనతో భారత జట్టు ప్రధాన కోచ్‌గా నియమితులైన గౌతమ్ గంభీర్ తన ప్రస్థానాన్ని…
IND vs SA : భారత్, దక్షిణాఫ్రికా మహిళల జట్ల మధ్య జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జరిగిన నేటి తొలి మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించింది. ఆల్‌రౌండ్ ప్రదర్శన చూపుతూ సిరీస్ లోని మొదటి గేమ్ ను గెలుచుకుంది. చిన్నస్వామి స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా దక్షిణాఫ్రికా బౌలర్లను ఓ ఆట ఆదుకున్నారు. ముఖ్యంగా ఓపెనర్ స్మృతి మంధాన (117) విధ్వంసకర ఇన్నింగ్స్ తో…
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ లో తొలి రెండు వన్డేలకు కెప్టెన్ రోహిత్ శర్మ, రన్ మిషన్ విరాట్ కోహ్లీకు విశ్రాంతినిచ్చారు. ఈ సిరీస్ లో వారిని పక్కనపెట్టడంపై కోచ్ రాహుల్ ద్రావిడ్ వివరణ ఇచ్చారు. పరస్పర సంప్రదింపులు, చర్చల తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపాడు. వరల్డ్ కప్ ముందు జరుగుతున్న ఈ సిరీస్ లో కొన్ని మ్యాచ్ లకు విశ్రాంతినిస్తున్నట్టు రోహిత్, కోహ్లీలకు సమాచారం అందించామని, వారు అంగీకరించారని వెల్లడించారు.
ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కు భారత జట్టును ప్రకటించారు. సెప్టెంబర్ 22 నుండి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ఆడనుంది. దీని కోసం చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ జట్టును ప్రకటించారు.
సెప్టెంబర్ 22 నుంచి ప్రారంభమయ్యే ఈ వన్డే సిరీస్‌కు జట్టును ఈరోజు రాత్రి 8:30 గంటలకు కెప్టెన్ రోహిత్ శర్మ, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ ప్రకటించే అవకాశం ఉంది.
ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. సౌతాఫ్రికాతో జరిగే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌కు ముందు ఆసీస్ టీమ్ సారథిని క్రికెట్ ఆస్ట్రేలియా తప్పించినట్లు తెలుస్తోంది. గాయం నుంచి పూర్తిగా కోలుకోని ఆ టీమ్ కెప్టెన్ పాట్ కమిన్స్ సిరీస్ మొత్తానికి దూరం కానున్నాడని సమాచారం.
భారత్ లో పర్యటనకు ముందు ఆసీస్ జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో కమిన్స్ మణికట్టుకు గాయమైంది. అయినప్పటికీ కమిన్స్ గాయంతోనే సిరీస్ ఆడాడు. దానివల్ల అతనికి నొప్పి ఎక్కువ కావడంతో.. కీలకమైన వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని, భారత్ లో జరిగే వన్డే సిరీస్ కు కమిన్స్ కు విశ్రాంతినివ్వాలని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆలోచిస్తోంది.
బార్బడోస్ వేదికగా టీమిండియాతో జరుతున్న సెకండ్ వన్డేలో వెస్టిండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బౌలర్లకు అనుకూలిస్తుందని విండీస్ సారథి షాయీ హోప్ అంచనా వేశారు. దీంతో భారత జట్టు తొలుత బ్యాటింగ్కు ఆహ్వానించింది.