టీమిండియా సీనియర్ ప్లేయర్స్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు కేవలం వన్డేల్లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. టీ20, టెస్టులకు వీడ్కోలు పలికిన ఈ ఇద్దరు దిగ్గజాలు వన్డే ఫార్మాట్‌లో మాత్రమే ఆడుతున్నారు. ఆస్ట్రేలియా పర్యటన నేపథ్యంలో రోహిత్, కోహ్లీల భవితవ్యంపై చర్చలు జరిగాయి. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో ఇద్దరు చోటు దక్కించుకున్నా.. ఇంకా రెండేళ్ల సమయం ఉన్న 2027 వన్డే ప్రపంచకప్‌లో ఆడడం అనుమానమే అని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ వార్తలకు…
శుభ్‌మన్ గిల్ ప్రస్తుతం భారత జట్టుకు టెస్ట్, వన్డే ఫార్మాట్లలో కెప్టెన్‌గా ఉన్నాడు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ అక్టోబర్ 4న గిల్‌ను వన్డే కెప్టెన్‌గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. అయితే రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించడంపై అనేక ప్రశ్నలు తలెత్తాయి. హిట్‌మ్యాన్ ఫాన్స్ అయితే బీసీసీఐపై మండిపడ్డారు. తాజాగా రోహిత్ తన వన్డే కెప్టెన్సీ వేటుపై స్పందించాడు. ఇక వెస్టిండీస్‌తో రెండో టెస్ట్ నేపథ్యంలో బుధవారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు…
దక్షిణాఫ్రికాలో పర్యటిస్తున్న టీమిండియాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఇప్పటికే టెస్టు సిరీస్‌కు దూరంగా కాగా ఇప్పుడు వన్డేలకు కూడా దూరం కానున్నాడని ప్రచారం జరుగుతోంది. తొడ కండరాల గాయంతో రోహిత్ శర్మ టెస్టులకు దూరంగా ఉన్నాడు. దీంతో అతడు ప్రస్తుతం బెంగళూరు నేషనల్ క్రికెట్ అకాడమీలో చికిత్స తీసుకుంటూ పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు కృషి చేస్తున్నాడు. దీంతో వన్డే సిరీస్ సమయానికి హిట్ మ్యాన్ సిద్ధమవుతాడని అందరూ భావించారు. Read…
టీమిండియాలో ప్రస్తుతం కెప్టెన్సీ రగడ నడుస్తోంది. టీ20 ప్రపంచకప్ తర్వాత టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుంచి కోహ్లీ తప్పుకోగా.. ఈ మధ్య అతడిని వన్డే సారథిగానూ తప్పిస్తూ బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే తనను కెప్టెన్సీ నుంచి తప్పిస్తున్నట్లు గంటన్నర ముందే చెప్పారని కోహ్లీ చెప్పడం అతడి అభిమానులను తెగ బాధించింది. కోహ్లీ-గంగూలీ చెప్పిన విషయాలు వేర్వేరుగా ఉండటం క్రికెట్ అభిమానుల్ని గందరగోళానికి గురిచేసింది. Read Also: విరాట్ కోహ్లీకి ద్రావిడ్ స్పెషల్ క్లాస్ 2014లో…
ప్రస్తుతం టీమిండియాలో విరాట్ కోహ్లీ-గంగూలీ ఎపిసోడ్ హాట్‌టాపిక్‌గా మారింది. వన్డే కెప్టెన్సీ నుంచి తనను తప్పించడంపై విరాట్ కోహ్లీ అసంతృప్తిగా ఉన్నాడనే విషయం అర్ధమవుతోంది. ఈ నేపథ్యంలో తనకు చెప్పకుండా వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించారని.. టీ20 కెప్టెన్సీకి తాను రాజీనామా చేసినప్పుడు తనకు పరిమిత ఓవర్ల క్రికెట్‌కు ఒకే కెప్టెన్ ఉండాలనే విషయం చెప్పలేదని కోహ్లీ చెప్పడంతో వివాదం చెలరేగింది. మరోవైపు విరాట్ కోహ్లీని టీ20 కెప్టెన్సీ వదులుకోవద్దని చెప్పినా వినలేదని గతంలో గంగూలీ చెప్పిన…
విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించిన తర్వాత భారత క్రికెట్ లో చాలా అంశాలు చర్చలో ఉన్నాయి. విరాట్ కు చెప్పకుండానే తన కెప్టెన్ పదవిని తీసుకున్నారని వార్తలు వచ్చాయి. కానీ తాజాగా విరాట్ కోహ్లీ మాట్లాడుతూ… కెప్టెన్సీ నుంచి తప్పించే విషయం తనకు తెలుసు అన్నారు. అయితే టీం ఇండియా త్వరలో వెళ్లనున్న సౌత్ ఆఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ కోసం జట్టును ఎంపిక చేసే సమయంలో చీఫ్ సెలక్టర్ నాకు ఈ విషయం…
ఈ నెలల్లో భారత జట్టు వెళ్లనున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టును ప్రకటిస్తున్న సమయంలో భారత క్రికెట్ బోర్డు రోహిత్ శర్మను వెళ్లే టీ 20 తో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ విరాట్ కోహ్లీ తన నాలుగేళ్ల కాలంలో ఒక్క ఐసీసీ ట్రోఫీని కూడా గెలవలేకపోయినందుకె అతను వన్డే అంతర్జాతీయ కెప్టెన్ గా తొలగించబడ్డాడని 2012లో భారత పురుషుల…
ప్రస్తుతం భారత క్రికెట్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్. అంతేకాకుండా కెప్టెన్‌గానూ మంచి రికార్డే ఉంది. ఇటీవల టీ20ల తరహాలోనే వన్డేలకు కూడా విరాట్ కోహ్లీ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ భావించారు. అయితే విరాట్‌కు కనీసం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించిందనే వార్త బయటకు రావడంతో కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పు…
విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 మ్యాచ్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు. తాజాగా వన్డే మ్యాచ్‌ల కెప్టెన్సీ నుంచి కూడా దూరమయ్యాడు. బుధవారం నాడు బీసీసీఐ టీమిండియా వన్డే కెప్టెన్సీని కోహ్లీ నుంచి రోహిత్‌కు బదలాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిర్ణయం వెనుక ఓ 48 గంటల స్టోరీ దాగి ఉన్నట్లు పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. నిజానికి 2023 వరకు విరాట్ కోహ్లీ వన్డేలకు కెప్టెన్‌గా ఉండాలని భావించాడు. Read Also: టెస్ట్…