విరాట్ కోహ్లీ ఇప్పటికే టీ20 మ్యాచ్‌ల నుంచి కెప్టెన్‌గా తప్పుకున్నాడు. తాజాగా వన్డే మ్యాచ్‌ల కెప్టెన్సీ నుంచి కూడా దూరమయ్యాడు. బుధవారం నాడు బీసీసీఐ టీమిండియా వన్డే కెప్టెన్సీని కోహ్లీ నుంచి రోహిత్‌కు బదలాయిస్తూ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే బీసీసీఐ నిర్ణయం వెనుక ఓ 48 గంటల స్టోరీ దాగి ఉన్నట్లు పరిణామాలను చూస్తే అర్ధమవుతోంది. నిజానికి 2023 వరకు విరాట్ కోహ్లీ వన్డేలకు కెప్టెన్‌గా ఉండాలని భావించాడు.
Read Also: టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ… విహారికి దక్కిన చోటు
కానీ కోహ్లీ ఒకటి తలస్తే.. విధి మరొకటి నిర్ణయించినట్లు పరిస్థితులు మారిపోయాయి. దీంతో కెప్టెన్సీ నుంచి వైదొలగేందుకు బీసీసీఐ కోహ్లీకి 48 గంటల డెడ్‌లైన్ విధించినట్లు సమాచారం. దీనిపై కోహ్లీ నాన్చుడు ధోరణి అవలంభించడంతో విసుగు చెందిన బీసీసీఐ పెద్దలు కోహ్లీని కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ప్రకటన చేయాల్సి వచ్చింది. 2016లో కోహ్లీ వన్డేలకు కెప్టెన్ అయ్యాడు. అప్పటి నుంచి 95 మ్యాచ్‌లకు నాయకత్వం అందించగా.. అందులో 65 విజయాలు, 27 ఓటములు, ఒక టై, రెండు ఫలితం తేలని మ్యాచ్‌లు ఉన్నాయి. కెప్టెన్‌గా కోహ్లీ విజయాల శాతం 70.43గా ఉంది. గత ఐదేళ్లలో కోహ్లీ కెప్టెన్సీలో ఎన్నో ఐసీసీ ఈవెంట్లు జరిగినా ఒక్క ట్రోఫీ కూడా భారత్ గెలవకలేకపోయింది.