ప్రస్తుతం భారత క్రికెట్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్. అంతేకాకుండా కెప్టెన్‌గానూ మంచి రికార్డే ఉంది. ఇటీవల టీ20ల తరహాలోనే వన్డేలకు కూడా విరాట్ కోహ్లీ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ భావించారు. అయితే విరాట్‌కు కనీసం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించిందనే వార్త బయటకు రావడంతో కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పు గురించి బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ క్లారిటీ ఇచ్చాడు.
Read Also: విరాట్ కోహ్లీ కోసం నెటిజన్‌ల వార్.. ట్రెండింగ్‌లో #ShameonBCCI
గతంలో టీ20 మ్యాచ్‌లకు సంబంధించి కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకోవద్దని తనతో పాటు బీసీసీఐ అధికారులందరూ చాలా సార్లు చెప్పినా విరాట్ కోహ్లీ వినలేదని గంగూలీ తెలిపాడు. వైట్ బాల్ క్రికెట్‌లో టీమ్‌కు ఇద్దరు నాయకత్వం వహించడం సరికాదని… అందుకే వన్డేలకు, టీ20లకు ఒకరే కెప్టెన్‌గా ఉండాలని తాము భావించామన్నాడు. ఈ కారణంతోనే రోహిత్ శర్మను వన్డేలకు కూడా కెప్టెన్‌గా బీసీసీఐ నియమించిందని గంగూలీ స్పష్టం చేశాడు.