ఒకప్పుడు సినిమాల్లోను, రాజకీయాల్లోను ఒక ఊపు ఊపేసిన ఆ మాజీ ఎంపీ ఇప్పుడెందుకు పూర్తిగా తెరమరుగయ్యారు? కేవలం ఎక్స్ మెసేజ్‌లకే ఎందుకు పరిమితం అవుతున్నారు? అధికారంలో ఉన్నాసరే… కాంగ్రెస్ పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారు? ఆమె దూరమయ్యారా? లేక పార్టీనే దూరం చేసుకుంటోందా? ఎవరా లీడర్? ఏంటా కథ? అటు సిల్వర్ స్క్రీన్ మీద, ఇటు తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ మీద వెలుగు వెలిగిన నాయకురాలు విజయశాంతి. ఒక దశలో లేడీ అమితాబ్‌గా తెలుగు ఇండస్ట్రీని శాసించారామె.…
తెలంగాణలో రాజకీయ ముఖ చిత్రం మారుతోందా? పొలిటికల్ పావులు చిత్ర విచిత్రంగా కదులుతున్నాయా? రెండు జాతీయ పార్టీల నేతల మధ్య ఉన్నట్టుండి మాటల యుద్ధం ఎందుకు మొదలైంది? ఎవరి అంచనాలు ఎలా ఉన్నాయి? ఆవులు ఆవులు పొడుచుకుంటే… దూడలు బలైనట్టు అన్న మాటలు ఎందుకు వినిపిస్తున్నాయి? అసలు తెలంగాణలో మొదలైన కొత్త పొలిటికల్ గేమ్ ఏంటి? తెలంగాణ పొలిటికల్ స్ర్కీన్ మీద సరికొత్త సీన్స్ కనిపిస్తున్నాయి. తమలపాకుతో నువ్వు ఒకటంటే… తలుపు చెక్కతో నే రెండంటానన్నది రాజకీయాల్లో…
ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసాని: సినీ నటుడు పోసాని కృష్ణమురళిని పోలీసులు ఓబులవారిపల్లెకు తరలించారు. ఓబులవారిపల్లె పీఎస్‌లో పోసానికి వైద్య పరీక్షలు చేశారు. ఓబులవారిపల్లి ప్రాథమిక వైద్య కేంద్రం వైద్యులు గురు మహేష్ పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. గురు మహేష్ స్టేట్మెంట్ను రైల్వేకోడూరు సీఐ వెంకటేశ్వర్లు నమోదు చేశారు. కాసేపట్లో రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరిచే అవకాశం ఉంది. బుధవారం రాత్రి హైదరాబాద్‌లోని రాయదుర్గంలో పోసానిని పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పోసాని అరెస్టును…
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభం: తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 4 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో మూడు, తెలంగాణలో మూడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ఆరంభం అయింది. ఏపీలో 2 గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి.. తెలంగాణలో 2 టీచర్, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి పోలింగ్ ప్రారంభమైంది. ఏపీలో మూడు ఎమ్మెల్సీ స్థానాల బరిలో 70 మంది అభ్యర్థులు, తెలంగాణలో మూడు…
నేడు ఏపీ, తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. నేటితో వల్లభనేని వంశీ పోలీస్ కస్టడీ ముగియనుంది. ఇవాళ ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ జరిపి జైల్లో వంశీని పోలీసులు అప్పగించనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఓటు హక్కును వినియోగించుకొనున్నారు. ఇవాళ ఉదయం 9 గంటలకు ఉండవల్లిలోని గాదె…
వైసీపీ వ్యూహం మారిందా? ఇక మీదట మేటర్ ఏదైనాసరే… పెద్దల సభలోనే తేల్చుకోవాలని డిసైడయ్యిందా? ఆ దిశగా ఆల్రెడీ ట్రయల్ రన్ సక్సెస్ అయిందన్న ఫీలింగ్ పార్టీ పెద్దల్లో ఉందా? అసెంబ్లీని వదిలేసినా… తమకు బలం ఉన్న చోట అధికార పక్షాన్ని చెడుగుడు ఆడేసుకోవాలని ఫ్యాన్ పార్టీ ముఖ్యులు నిర్ణయించారా? ఇంతకీ వైసీపీ మారిన వ్యూహం ఏంటి? అమలు ఎలా ఉండబోతోంది? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం ప్రతిపక్ష హోదా యుద్ధం నడుస్తోంది. గత ఎన్నికల్లో 11 సీట్లకే…
తెలుగుదేశం పార్టీలో ఆ “ఇద్దరూ- ఇద్దరే’. ఒకరు మంత్రి, మరొకరు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు. ఇన్నాళ్ళు గట్టు పంచాయితీ కూడా లేని వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఏకంగా ఇసుక తుఫానే మొదలైందట. ఇంకా కామెడీ ఏంటంటే… వాళ్ళిద్దరూ గొడవ పడుతున్న దగ్గర అసలు ఇసుక రీచ్‌లే లేవు. మరి ఎందుకా వివాదం? ఎవరా ఇద్దరు నాయకులు? తివిరి ఇసుము నుండి తైలం తీయవచ్చంటాడు భర్తృహరి. కానీ… కాలం మారింది కదా…. ఫర్ ఎ ఛేంజ్…ఫ్రీ శాండ్‌ని పిండేసి…
తెలంగాణ ముఖ్యమంత్రిని హుటాహుటిన ఢిల్లీ పిలిపించుకున్న ప్రధాని మోడీ ఏం చేశారు? రాష్ట్రానికి నిధుల కోసం వెళ్ళిన సీఎంకి ప్రధాని ఏమిచ్చారు? ఆ మీటింగ్ జరిగిన తీరు చూసి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్‌లకు సైతం ఎందుకు మైండ్ బ్లాంక్ అయింది? రేవంత్ ఆశించిందేంటి? మోడీ ఇచ్చిందేంటి? తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లారు. ప్రధానమంత్రి మోడీతో అరగంటకు పైగా సమావేశం అయ్యారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం గతంలో కూడా ఇలా సమావేశమైనా…ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్‌గా…
తెలంగాణ పొలాల్లో పొలిటికల్ పేలాలు వేగుతున్నాయా? రైతుల అవసరాల చుట్టూ రాజకీయం రక్తి కడుతోంది తప్ప…. పని మాత్రం జరగడం లేదా? ఏ విషయంలో ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ మూడు ముక్కలాట ఆడుతున్నాయి? తప్పు మీదంటే మీదేనని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు పరస్పరం నెపం నెట్టుకుంటున్నాయి? రైతుల చుట్టూ జరుగుతున్న రాజకీయం ఏంటి? తెలంగాణలో పొలాలకు వేసే ఎరువులు పొలిటికల్ కలర్ పులుముకుంటున్నాయి. రైతులకు సరిపడా సరఫరా సంగతి ఎలా ఉన్నా… రాజకీయ…