కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా? ఆయనకు పాలిటిక్స్ అంటే… విరక్తి కలిగిందా? అందుకే జగ్గన్న 2.0 అని అంటున్నారా? అసలేంటా 2.0? సీనియర్ పొలిటీషియన్ తీసుకున్న సడన్ డెసిషన్ ఏంటి? దాని రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ చేసే అతికొద్ది మంది నాయకుల్లో జగ్గారెడ్డి ఒకరు. అలాంటి లీడర్‌కి ఇప్పుడు రాజకీయాల మీద విరక్తి కలిగిందా? అన్న ప్రశ్న చక్కర్లు కొడుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఆయన పాలిటిక్స్ నుంచి సిల్వర్ స్క్రీన్ వైపు మళ్లబోతున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. అది నిజంగానే పాలిటిక్స్ మీద విరక్తా? లేక సినిమాల్లోకి వెళ్ళడం కూడా ఒక రాజకీయ వ్యూహమా అన్న విషయాన్ని జాగ్రత్తగా గమనించాల్సి ఉందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. గత అసెంబ్లీ ఎన్నికల్లో సంగారెడ్డి నుండి పోటీ చేసి ఓడిపోయారు జగ్గారెడ్డి. ఆ తర్వాత కాంగ్రెస్ వ్యవహారాల్లో చురుగ్గా ఉంటున్నా… అధికార పార్టీ నాయకుడిగా తనకు సరైన గౌరవం దక్కలేదన్న అసంతృప్తిని ఎప్పటికప్పుడు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈసారి మరింత షాకింగ్‌గా స్పందిస్తూ… రాజకీయాలంటే….. విరక్తి కలుగుతోంది. నేను సినిమాల్లోకి వస్తున్నా… అంటూ సంచలన ప్రకటన చేశారాయన. అంటే…. ఇప్పుడు ఈ కాంగ్రెస్ సీనియర్ లీడర్ డైరెక్ట్‌గా సినిమా హీరో అయిపోతారా? టైం కాని టైంలో ఈయనకీ ఆలోచనేంటి అన్న చర్చ మొదలైంది పొలిటికల్ సర్కిల్స్‌లో. వార్ ఆఫ్ లవ్ అనే టైటిల్ తో ఒక సినిమా తీస్తున్నట్టు స్వయంగా ప్రకటించారు మాజీ ఎమ్మెల్యే. కేవలం టైటిల్ మాత్రమే కాదు, స్టోరీ లైన్ కూడా నాదేనని, ఇన్‌పుట్స్ కూడా నేన ఇస్తున్నానంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. దీంతో జగ్గారెడ్డి తీయబోయేది ప్రేమకథా చిత్రమా? లేక పొలిటికల్ కథా చిత్రమా అన్న ఆసక్తి పెరుగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ విడుదల చేసిన ఎమ్మెల్సీ అభ్యర్థుల లిస్ట్ చూసి షాకయ్యానంటూ తన అసంతృప్తి వ్యక్తం చేశారు.
అదే సమయంలో సినిమా ప్రకటన కూడా చేయడం చూస్తుంటే…. ఎక్కడో లింక్ సింక్ చేసే ప్రయత్నం జరుగుతున్నట్టు అనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. జగ్గారెడ్డి వార్ ఆఫ్ లవ్ టైటిల్‌తో రూపొందబోతున్న ఈ సినిమా, ప్రేమికులను కలిపే కథ అని చెబుతున్నారు. అందులో ఓ డాన్ కూతురు ప్రేమ వివాహం చేసుకుని ఆ ప్రేమను ఎలా నిలబెట్టుకుందన్నది ప్రధాన కథ అని చెబుతున్నారు. దీంతో ఇది నిజంగానే ఆయన వ్యక్తిగత అనుభవాల ఆధారంగా రాయిస్తున్న కథా? లేక రాజకీయాల్లో ఓ కొత్త గుర్తింపు తెచ్చుకునేందుకు వేస్తున్న సరికొత్త ఎత్తుగడా అన్న చర్చ మొదలైంది. రాజకీయాల్లో కాస్త వెనకబడ్డ నాయకులు కొత్త మార్గాల్లో తమ భవిష్యత్తును అన్వేషించడం, పాపులారిటీ కోసం ప్రయత్నించడం కొత్తేమీ కాదుగానీ…. పొలిటికల్ ఫైర్ బ్రాండ్ అయిన జగ్గారెడ్డి ఇలా హఠాత్తుగా సినిమాల్లోకి రావడం వెనుక ఏదైనా ప్రత్యేక వ్యూహముందా? అని తెగ ఆరాలు తీస్తున్నారు పొలిటికల్ పండిట్స్. ఇది సరికొత్త ప్రయోగమా లేక రాజకీయ వ్యూహమా అన్నది తేలాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.