మాటల్లేవ్…. మాట్లాడుకోవడాల్లేవ్….. ముందస్తు చర్చలు అసలే లేవ్….. జస్ట్…అలా వెళ్ళారు… ఇలా ఎమ్మెల్సీ టికెట్ తెచ్చుకున్నారు. టోటల్‌గా… ఒక్క రోజు, ఒకే ఒక్క రోజులో విజయశాంతి అభ్యర్థిత్వం ఖరారైపోయింది. ఆఖరి నిమిషం వరకు సీఎం, పీసీసీ చీఫ్ సహా… తెలంగాణ కాంగ్రెస్‌లో ఎవ్వరికీ ఈ విషయం తెలియదు. ఇంతకీ ఏం మ్యాజిక్ చేశారామె? ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్‌గా ఎట్నుంచి నరుక్కొచ్చారు? తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఏం జరిగిందో రకరకాల…
నిలకడలేని రాజకీయం ఆ ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీని పక్కన పడేసిందా? ఆయన అనుభవం, గతాన్ని పరిగణనలోకి తీసుకుంటే… పరిగెత్తుకుంటూ రావాల్సిన అవకాశాలు ఎందుకు రావడం లేదు? ఒక్క ఛాన్స్ ప్లీజ్ అని ఆయన వేడుకుంటున్నా… ఆ…. చూద్దాం లే…. అన్నట్టుగా ఎందుకు మారుతోంది? ఎవరా లీడర్? సుదీర్ఘ రాజకీయ అనుభవం పెట్టుకుని… అధికార భాగస్వామ్య పార్టీలో ఉండి కూడా అర్రులు చాచాల్సి రావడానికి కారణాలేంటి? కొత్తపల్లి సుబ్బారాయుడు….. ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేత. ఉమ్మడి…
బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్, కార్య నిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మధ్య ఓ వ్యవహారం నువ్వా నేనా అన్నట్టుగా నడిచిందా? ఎమ్మెల్సీ సీటు విషయంలో తండ్రీ కొడుకులిద్దరూ పరస్పరం పట్టుదలకు పోయారా? చివరికి కొడుకే తన పంతం నెగ్గించుకున్నారా? చివరికి కవిత ముందే చెప్పిన పేరు కూడా పక్కకు పోయిందా? ఎమ్మెల్సీ సీటు విషయమై కేసీఆర్, కేటీఆర్ మధ్య ఏం జరిగింది? గులాబీ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల సందడి…
అక్కడ జనసేన వ్యవహారం ఎడ్డెమంటే తెడ్డెమన్నట్టుగా మారిపోయింది. నేతల మధ్య ఆధిపత్య పోరు పతాక స్థాయికి చేరిపోయింది. ఉమ్మడి జిల్లా మొత్తం మీద ఉన్న ఒక్క ఎమ్మెల్యే ఒకవైపు అయితే… మిగతా పార్టీ నాయకులంతా మరో వైపు ఉన్నారట. ఒక అడుగు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఎక్కడ నడుస్తోంది జనసేన రాజకీయం? పార్టీ అధిష్టానం పట్టించుకుంటుందా? లేక మీ ఖర్మ అని వదిలేస్తుందా? లెట్స్ వాచ్. విజయనగరం జనసేనలో వర్గపోరు పీక్స్‌కు చేరుతోంది. ఎమ్మెల్యే…
కాంగ్రెస్ సీనియర్ లీడర్ జగ్గారెడ్డి కొత్త అవతారం ఎత్తబోతున్నారా? ఆయనకు పాలిటిక్స్ అంటే… విరక్తి కలిగిందా? అందుకే జగ్గన్న 2.0 అని అంటున్నారా? అసలేంటా 2.0? సీనియర్ పొలిటీషియన్ తీసుకున్న సడన్ డెసిషన్ ఏంటి? దాని రియాక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి? తెలుగు రాష్ట్రాల్లో డిఫరెంట్ పాలిటిక్స్ చేసే అతికొద్ది మంది నాయకుల్లో జగ్గారెడ్డి ఒకరు. అలాంటి లీడర్‌కి ఇప్పుడు రాజకీయాల మీద విరక్తి కలిగిందా? అన్న ప్రశ్న చక్కర్లు కొడుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. ఆయన పాలిటిక్స్ నుంచి…
మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు: మద్య నిషేధంపై మాట్లాడే హక్కు వైసీపీ నేతలకు లేదు అని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. గతంలో నాసిరకం మద్యంతో చాలా మంది అనారోగ్యానికి గురయ్యారని, జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం తాగి 42 మంది మరణించారన్నారు. బెల్టు దుకాణాలపై తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోందని, నాసిరకమైన 29 మద్యం బ్రాండ్ల అమ్మకాలను నిలిపివేశాం అని తెలిపారు. తాగేవాళ్లను ఒక్కసారిగా మార్చలేమని, ఇది క్రమేపీ జరగాల్సిన ప్రక్రియ అని…
ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు నామినేషన్: ఎమ్మెల్యే కోటాలో నిర్వహించే ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈరోజు జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు నామినేషన్ వేయనున్నారు. కూటమి పార్టీల్లో భాగంగా జనసేన అభ్యర్థిగా నాగబాబు శుక్రవారం ఉదయం నామినేషన్ దాఖలు చేయనున్నారు. జనసేన పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలకు అనుగుణంగా నామినేషన్ దాఖలుకు అవసరమైన పత్రాలను పార్టీ కార్యాలయం ఇప్పటికే సిద్ధం చేసింది. కొణిదెల నాగబాబు అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదిస్తూ జనసేన పార్టీకి చెందిన 10…
ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం కానుంది. మహిళా దినోత్సవం సందర్భంగా డ్వాక్రా మహిళలకు కొత్త పథకం ప్రకటించే అవకాశం ఉంది. నేడు కూడా ఏపీ అసెంబ్లీ సమావేశాలు క్వశ్చన్ అవర్‌తో ప్రారంభం కానున్నాయి. రాష్ట్రంలో అప్పులు, ఉపాధ్యాయ పోస్టులు, వైజాగ్ టీడీఆర్ బాండ్లు, సీజనల్ హాస్టళ్ల ఏర్పాటు అంశాలపై సభ్యుల ప్రశ్నలు ఆగడనున్నారు. నేడు తాడేపల్లి నుంచి బెంగళూరుకు వైసీపీ అధినేత వైఎస్ జగన్…
దగ్గుబాటి పుస్తకం రాస్తారని అస్సలు ఊహించలేదు: మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో గురువారం ఉదయం జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తోడల్లుళ్లు చంద్రబాబు, వెంకటేశ్వర రావు దాదాపు 3 దశాబ్దాల తర్వాత ఒకే వేదిక పైకి వచ్చారు. చంద్రబాబు, దగ్గుబాటి కొన్నేళ్లుగా కుటుంబ కార్యక్రమాల్లో కలుస్తున్నా.. ఇద్దరూ ఒకే వేదికపైకి రావడం మాత్రం 30 ఏళ్లలో ఇదే…
మూడు దశాబ్దాల తర్వాత ఒకే వేదికపైకి తోడల్లుళ్లు: మూడు దశాబ్దాల తర్వాత తోడల్లుళ్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వర రావు ఒకే వేదికపైకి రాబోతున్నారు. వెంకటేశ్వర రావు రచించిన ‘ప్రపంచ చరిత్ర’ అనే పుస్తక ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా చంద్రబాబు రానున్నారు. గురువారం విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరగనుంది. పుస్తక ఆవిష్కరణ కోసం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం.. అర్ధరాత్రి విశాఖపట్నం చేరుకున్నారు. ఈ కార్యక్రమంకు కేంద్రమంత్రి నిర్మల…