ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ క్యాబినెట్ భేటీ జరగనుంది.
ఇవాళ ఉదయం 9 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. క్వశ్చన్ అవర్తో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అవుతాయి.
ఉదయం 10 గంటలకు శాసనమండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2023-24 ఏపీ మెట్రో రైలు సంస్థ లిమిటెడ్ యొక్క 9వ వార్షిక నివేదికను పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రవేశపెట్టనున్నారు.
ఏపీలో నేటి నుంచి ఏప్రిల్ 1 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షలు జరుగుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా 3,450 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. 6 లక్షల 19 వేల 275 మంది విద్యార్థులు టెన్త్ పరీక్షలు రాయనున్నారు.
వైసీపీ నేత వల్లభనేని వంశీ బెయిల్, కస్టడీ పిటిషన్లు మీద నేడు ఎస్సీ-ఎస్టీ కోర్టులో విచారణ జరగనుంది.
ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ బెంగుళూరు నుంచి తాడేపల్లికి రానున్నారు. రాత్రి 7 గంటలకు తెనాలిలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ కుమారుడి వివాహ వేడుకకు జగన్ హాజరుకానున్నారు.
నేడు శాసనసభలో రెండు చరిత్రాత్మక బిల్లులను తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. బీసీలకు విద్య, ఉద్యోగాలు.. రాజకీయాల్లో రిజర్వేషన్లను 42 శాతానికి పెంచడంతో పాటు సుప్రీంకోర్టు తీర్పునకు లోబడి ఎస్సీల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించనుంది.
ఈరోజు ఉదయం 9 గంటలకు కాంగ్రెస్ పార్టీ బీసీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంత్రి పొన్నం ప్రభాకర్ సమావేశం కానున్నారు.
నేడు వేములవాడ శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామి వారి కళ్యాణం జరగనుంది. అధిక సంఖ్యలో భక్తులు ఇప్పటికే రాజన్న ఆలయానికి చేరుకున్నారు.
నేడు డీఎంకే టార్గెట్‌గా ఆందోళనలకు బీజేపీ పిలుపునిచ్చింది. మద్యం దుకాణాల ముట్టడికి బీజేపీ నిర్ణయం తీసుకుంది. లిక్కర్ స్కాంలో వాస్తవాలు వెలుగులోకి తెచ్చేందుకు పోరాటం చేయాలని నిర్ణయించింది.
ఈనెల ఉప్పల్ వేదికగా 23, 27 తేదీల్లో జరిగే ఐపీఎల్ మ్యాచ్ ఫిజికల్ టికెట్స్ అందుబాటులోకి నేడు రానున్నాయి. ఆన్లైన్లో ఐపీఎల్ టికెట్లు బుక్ చేసుకున్న వారికి ప్రత్యేక కౌంటర్ల ద్వారా ఫిజికల్ టికెట్స్ జారీ చేయనున్నారు.