మారరా... వీళ్ళలో ఇక మార్పు రాదా...? ఎప్పుడూ ఇలాగే తన్నులాటలు, తలకలతో టైంపాస్ చేస్తూ... పార్టీకి బొంద పెడతారా అంటూ ఘాటుగా మాట్లాడుకుంటోందట అక్కడి కాంగ్రెస్ కేడర్. ఎవడైతే నాకేంటి అన్నట్టుగా ఉన్న ఓరుగల్లు రెండు వర్గాల మధ్య సయోధ్య విషయంలో అధిష్టానం కూడా చేతులెత్తేసిందా అన్న చర్చలు సైతం నడుస్తున్నాయి.
మార్వాడీ గో బ్యాక్ నినాదం వెనుక కుట్ర ఉందా? అదృశ్య శక్తులేవో వెనకుండి... కావాలని రెచ్చగొడుతున్నాయా? ఎవరో ఏదో.. ఆశించి హైదరాబాద్ లాంటి మెట్రోపాలిటన్ సిటీలో మంట పెడుతున్నారా? ఏవో వ్యక్తిగత వివాదాలకు పొలిటికల్ కలర్ పులిమేసి సెంటిమెంట్‌ని రగిల్చే ప్రయత్నం చేస్తున్నారా? అసలీ విషయంలో ప్రధాన రాజకీయ పార్టీల వైఖరేంటి?
తెలంగాణ బీజేపీ కిటకిటలాడుతోందా? పోస్ట్‌ల కోసం నాయకులు పోటీలు పడుతున్నారా? నాక్కావాలంటే నాకంటూ..... మూడు పదవుల కోసం 30 మంది నాయకులు రేస్‌లోకి వచ్చారా? పార్టీలో ఒక్కసారిగా అంత గిరాకీ ఎందుకు పెరిగింది? అసలు ఏ పోస్ట్ కోసం ఆ స్థాయిలో రేస్ మొదలైంది?
ఆ ఉమ్మడి జిల్లాలో గులాబీ వాడుతోందా? బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్ధకమవుతోందా? అధికారంలో ఉన్నప్పుడే అంతంతమాత్రంగా ఉన్న వ్యవహారం ఇప్పుడు మరింత దిగజారిందా? పెద్దోళ్ళు నోళ్ళు విప్పడం లేదు, ఉన్నవాళ్ళ స్థాయి సరిపోక కేడర్ కూడా పక్క చూపులు చూస్తోందా? ఎక్కడ ఉందా పరిస్థితి? ఎందుకలా? ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ని ఎప్పుడూ నాయకత్వ లోపం వెంటాడుతూనే ఉంది. అధికారంలో ఉన్నప్పుడూ, లేనప్పుడు అదే పరిస్థితి. కాకుంటే… చేతిలో పవర్ ఉన్నప్పుడు కవరైన కొన్ని లోపాలు ఇప్పుడు బయటపడుతున్నాయి.…
దేశంలో ఎక్కడ న్యాయం జరగకపోయినా.. కోర్టుకెళ్తే కచ్చితంగా న్యాయం దక్కుతుందని మొన్నటివరకూ సామాన్యులకు ఆశలుండేవి. అలాగే జడ్జిలు నిజాయితీగా ఉంటారని, నిష్పాక్షికంగా తీర్పులిస్తారనే నమ్మకం ఉండేది. కానీ ఇటీవల ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వర్మ ఇంట్లో కట్టలు కొద్ది క్యాష్ దొరకడం దేశంలోనే సంచలనం సృష్టించింది.
స్వతంత్ర భారత్ పురోగమిస్తోందనడంలో సందేహం లేదు. ఇండియా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం ఖాయమన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రపంచం AI రంగంలోకి పరుగులు పెడుతున్న వేళ.. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌లో భారత్ అద్భుతాలు సృష్టించబోతోందని నిపుణులు అంటున్నారు. మొత్తంగా నవభారతం.. వృద్ధిరేటుకు వెలుగురేఖగా ఇప్పటికే పేరు తెచ్చుకుంది.
ఆశావహులు ఆవురావురుమంటున్నా… ఆ పోస్ట్ 20 నెలల నుంచి ఎందుకు ఖాళీగా ఉంది? ఒక ముఖ్య నాయకుడి ప్రధాన అనుచరుడికే ఇవ్వమని మరో ముఖ్య నేత ప్రతిపాదించారు. పెద్దగా వివాదాలేం లేవు. అయినా భర్తీలో ఎందుకు మీన మేషాలు లెక్కిస్తోంది తెలంగాణ ప్రభుత్వం? పైకి కనిపించకుండా ముందరి కాళ్ళకు బంధాలు పడుతున్నాయా? ఏదా పోస్ట్? నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరు? ఖమ్మం జిల్లాలో స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ…సుడా పరిధి చాలా ఉంది. కామేపల్లి, ఏన్కూర్, కారేపల్లి మండలాలు…
వాయిదా పద్ధతుంది దేనికైనా అంటూ… తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు ఫిక్స్ అయిపోయారా? అందుకే ఎప్పటికప్పుడు నామినేటెడ్ పదవుల భర్తీని వాయిదా వేస్తున్నారా? అదిగో, ఇదిగో అనుడే తప్ప పదవుల భర్తీ ఎన్నడు? ఆ విషయమై పార్టీలో జరుగుతున్న చర్చ ఏంటి? తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం కోసం గట్టిగా పనిచేసిన కీలక నాయకులకు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం దక్కని వారికి రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పోస్ట్‌లు ఇవ్వాలని ఎప్పుడో నిర్ణయించింది పార్టీ నాయకత్వం. అందులో…
తెలంగాణ బీజేపీలో సైంధవులు ఉన్నారా? పార్టీ ఎగుదలకు వారే అడ్డుపడుతున్నారా? వాళ్ళని చూసి కొత్తగా చేరదామనుకున్న వాళ్ళు కూడా మనసు మార్చుకుంటున్నారా? ఇంతకీ ఎవరా తేడా లీడర్స్? ఏ రూపంలో పార్టీలోకి చేరికల్ని అడ్డుకుంటున్నారు? తెలంగాణ కమలం పార్టీలోకి చాలా మంది నేతలు ఇలా వస్తున్నారు, అలా వెళ్ళిపోతున్నారు. కొందరు మాత్రం పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. అలా ఉంటున్న వాళ్ళలో కూడా కొంతమంది టచ్ మీ నాట్ అంటుంటే… కొద్ది మంది మాత్రం యాక్టివ్‌గా ఉంటున్నారు. ఆయారాం……