ఆ నియోజకవర్గంలో గులాబీ కేడర్ బలంగానే ఉన్నా…. నడిపే నాయకుడు మాత్రం లేకుండా పోయారా? నాయకత్వం ఇస్తే తీసుకోవడానికి ఇద్దరు సిద్ధంగా ఉన్నా… పార్టీ అధిష్టానం మీన మేషాలు లెక్కిస్తోందా? సందట్లో సడేమియా అంటూ… కింది స్థాయి బీఆర్ఎస్ లీడర్స్ మీదికి కాంగ్రెస్ వల విసురుతోందా? ఎక్కడుందా పరిస్థితి? ఎందుకలా? ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ కారు నడిపే డ్రైవర్ కరవయ్యారట. స్థానిక ఎన్నికలు ముంచుకొస్తున్న టైంలో…లోకల్‌గా పార్టీ పరిస్థితి చుక్కాని లేని నావలా…
తెలంగాణలో ఇప్పుడు టచ్ పాలిటిక్స్ జోరు పెరిగిపోయిందా? కొందరు నాయకులకు గులాబీ రంగు మీద మొహం మొత్తి కాషాయంపై మనసు పారేసుకుంటున్నారా? అట్నుంచి కూడా కొంచెం టచ్‌లో ఉంటే… చెబుతామన్న సమాధానం వస్తోందా? తెలంగాణలో బీజేపీ కొత్త గేమ్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? కాషాయ కండువా కప్పుకోవాలని తహతహలాడుతున్న నాయకులెవరు? ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లతో ఎప్పటికప్పుడు ఉత్కంఠ రేపుతున్న తెలంగాణ రాజకీయాల్లో మరికొన్ని కీలక మార్పులు జరగబోతున్నాయన్న ప్రచారం జోరందుకుంది. శరవేగంగా మారుతున్న పరిణామాలు కూడా అదే…
తెలంగాణలోని ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అగ్ని పరీక్ష ఎదుర్కోబోతున్నారా? తన కళ్ళెదుటే తన్నుకోబోయిన పార్టీ నేతల్ని ఆమె ఎలా సెట్ చేస్తారు? ఏం చెప్పి వాళ్ళని మారుస్తారు? స్థానిక సంస్థల ఎన్నికల ముంగిట్లో ఈ తన్నులాటలు పార్టీ పుట్టి ముంచుతాయా? అలా జరక్కుండా తేల్చడానికి మంత్రి దగ్గరున్న మంత్ర దండం ఏంటి? అంత దారుణమైన పరిస్థితులున్న ఆ జిల్లా ఏది? సవాల్ ఎదుర్కొంటున్న ఆ మంత్రి ఎవరు? ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఇటీవలే…
ఆ ఎమ్మెల్యేది గిలిచిందాకా ఒక తీరు, కుర్చీలో కూర్చున్నాక మరో రీతి అన్నట్టుగా ఉందా? నాడు అష్టకష్టాలు పడి గెలిపించినవాళ్ళే నేడు దూరం అవుతున్నారా? ఎమ్మెల్యే ఆయనా? ఆయన కూతురా అన్నది తెలియకుండా పోయిందా? ఏ నియోజకవర్గంలో జరుగుతోందా వ్యవహారం? ఎవరా శాసనసభ్యుడు? ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో నరసన్నపేట నియోజకవర్గం రూటే సపరేట్. ధర్మాన బ్రదర్స్‌కు కంచుకోట ఇది. అలాంటి కోటను గత ఎన్నికల్లో బద్దలు కొట్టారు బగ్గు రమణమూర్తి. టీడీపీ కార్యకర్త నుంచి ఎమ్మెల్యే…
తెలంగాణ సర్కార్‌లోని ఓ కీలకమైన విభాగంలో ఏం జరుగుతోందో సదరు మంత్రికి కూడా తెలియడం లేదా? ఆ డిపార్ట్మెంట్లోని ఉన్నతాధికారులు మంత్రిని డోంట్ కేర్ అంటున్నారా? మేటర్ ముదిరి బంతి ముఖ్యమంత్రి కోర్ట్‌కు చేరిందా? స్వయంగా చీఫ్ సెక్రెటరీ పర్యవేక్షించాల్సిన ఆ విభాగం ఇతర అధికారుల ఇష్టారాజ్యంగా మారిపోయిందా? ఏ శాఖలో జరుగుతోందా తతంగం? ఎవరా మంత్రి? కాలుష్య నియంత్రణ మండలి. అత్యంత బాధ్యతాయుతమైన ప్రభుత్వ విభాగం. ఈ విభాగం సక్రమంగా ఉండి, బాధ్యతాయుతంగా పని చేస్తేనే……
పొలిటికల్ పగలందు చిత్తూరు పగలు వేరయా అన్నట్టుగా ఉందట వ్యవహారం. బయటి ప్రపంచానికి ఇచ్చే కలర్ వేరు, లోలోపల ఉండే వ్యవహారం వేరన్నట్టుదా ఉందట. పేరుకు అందరిదీ ఒకే పార్టీ. ఒకటే నాయకత్వం. కానీ… ఎవరికి వారు కసితో రగిలిపోతున్నారట. ఇంతకీ ఎవరా నాయకులు? ఎందుకు వాళ్ళలో వాళ్ళని అంత కసి? రాజకీయాల్లో శాశ్వత మిత్రులుగాని, శాశ్వత శత్రువులుగాని ఉండరని అంటారు. అది ఎక్కడైనా ఏమోగానీ…. మా దగ్గర మాత్రం కాదని అంటున్నారట ఉమ్మడి చిత్తూరు జిల్లా…
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్ట్ తీర్పు బీఆర్ఎస్కు బూస్ట్ ఇచ్చిందా? అదే ఊపులో మరో న్యాయ పోరాటం చేయాలని నిర్ణయించిందా? ఈసారి పెద్దల సభవైపు గులాబీ పెద్దల దృష్టి మళ్ళిందా? ఆ దిశగా ఇప్పుడేం చేయాలనుకుంటోంది కారు పార్టీ? ఏంటా సంగతులు? బీఆర్ఎస్ బీ ఫామ్ మీద గెలిచి కాంగ్రెస్ కండువాలు కప్పుకున్న పది మంది శాసనసభ్యుల విషయంలో స్పీకర్ మూడు నెలల్లోపు నిర్ణయం తీసుకోవాలని చెప్పింది సుప్రీం కోర్ట్. అయితే…ఈ మూడు నెలల్లోపు…
ఏపీ ప్రభుత్వ విధానాలపై… టీడీపీ వర్గాలు కాస్త అసహనంగా ఉన్నాయా? వాస్తవాలకు దూరంగా ఆలోచిస్తున్నట్టు ఫీలవుతున్నాయా? అంశం ఏదైనాసరే… ఆచరణకు ముందే ఊదరగొట్టేస్తే… మొదటికే మోసం వస్తుందని భయపడుతున్నారా? అర్ధంకాని అండపిండ బ్రహ్మాండాల గురించి కాకుండా… సామాన్యులకు దగ్గరగా మాట్లాడాలన్న సూచనలు వస్తున్నాయా? అసలు ఏయే అంశాల్లో కాస్త ఎక్కువ చేస్తున్నామన్న అభిప్రాయం కేడర్‌లో ఉంది? ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదేపదే వినిపిస్తున్నది, ఇంకా చెప్పాలంటే… హోరెత్తిస్తున్న ఒకే ఒక్క పదం క్వాంటం…
కారు పార్టీ విషయంలో కర్మ రిటర్న్స్ అన్న నానుడి నిజమవబోతోందా? నీవు నేర్పిన విద్యయే కదా… నీరజాక్షా అంటూ… గులాబీ అస్త్రాన్ని రివర్స్‌లో ప్రయోగించేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందా? అందుకు సంబంధించిన బ్లూ ప్రింట్ సిద్ధమవుతోందా? కొత్త ఎత్తుగడకు బీజం పడుతోందా? ఇంతకీ ఏంటా అస్త్రం? ఎలా వాడబోతోంది అధికార పార్టీ? ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగాక….2014 నుంచి 2023 వరకు… తెలంగాణలో తిరుగులేని అధికారం చెలాయించింది బీఆర్ఎస్. మొదటి విడత పవర్లోకి వచ్చినప్పుడు టీడీపీ, రెండో సారి…
పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులై జిల్లాల పర్యటనకు రావడమే వారికి కాసులు కురిపించిందా…గతంలో ఎన్నడూ లేని సంప్రదాయానికి ఆ జిల్లాలో తెర తీసారా….అధ్యక్షుని పర్యటన పేరుతో భారీగా వసూళ్లు చేసారా….ఈ వ్యవహారం ఆ పార్టీలో హాట్ టాపిక్ అయిందా…. బీజేపీ కొత్త అధ్యక్షుడు మాధవ్…జిల్లాల్లో పర్యటిస్తున్నారు. ఆర్ఎస్ఎస్ శాఖ సమావేశం, చాయ్ పే చర్చ, బీజేపీ శ్రేణులతో ర్యాలీ, సమావేశం, వ్యాపార వర్గాలు, మేధావులతో సమావేశం…ఇలా కొత్తరకంగా మాధవ్ పర్యటన షెడ్యూల్ సాగింది. అయితే మాధవ్ పర్యటన…