ఆ జిల్లాలో కాంగ్రెస్ నేతలు ప్రతిపక్షాలకంటే ఘోరంగా తయారయ్యారట. కార్యక్రమం ఏదైనా సరే… కుమ్ముడు కామనైపోయింది. చివరికి ఆ గొడవలు చూసి… ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సైతం టూర్‌కి రావడానికి జంకుతున్నారట. కమాన్… నీ పెతాపమో నా పెతాపమో తేల్చుకుందాం అంటూ కాలు దువ్వుతున్న ఆ కాంగ్రెస్ నేతలు ఏ జిల్లాలో ఉన్నారు? ఎందుకు అక్కడ అలాంటి పరిస్థితులున్నాయి? సిద్దిపేట జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అస్తవ్యస్తంగా తయారయింది. గ్రూపుల గోల, కలహాల కాపురం, ఆధిపత్య…
మంచి తరుణం మించిన దొరకదు….సందు దొరికింది బిస్తరేసేద్దామనుకున్నారు. కాకితో కబురు పంపితే చాలు ఆ అసెంబ్లీ నియోజకవర్గంలో వాలిపోయేవారు. మాజీ ఎమ్మెల్యే యాక్టివ్‌గా లేని టైం చూసి…ఇక జెండా పాతేద్దామనుకున్నటైంలో సీన్స్ రివర్స్ అయిపోయిడీప్గా హర్టయ్యారట ఆ మాజీ ఎంపీ. ఎవరా మాజీ? పిలవని పేరంటాలన్న మాటలు ఆయన నోటి నుంచి ఎందుకు వస్తున్నాయి? రాజకీయాల్లో ఏదీ శాశ్వతం కాదు. మితృత్వాలు, శతృత్వాలతో పాటు సీట్లకు కూడా గ్యారంటీ ఉండదు. ప్రస్తుతం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల…
Chairman’s Desk : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి పదకొండేళ్లైంది. ఓవైపు తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కానీ ఏపీలో మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది.అలాగని ఏపీలో అభివృద్ధికి అవకాశాల్లేవని కాదు. కానీ ఉన్న బలాలపై దృష్టి పెట్టకుండా.. ఎక్కడో చూసిన అభివృద్ధినే.. అక్కడ రిపీట్ చేయాలనుకోవడమే మైనస్ గా మారుతోంది. ప్రతి రాష్ట్రానికీ వ్యూహాత్మక అనుకూలతలు ఉంటాయి. వాటికి తగ్గట్టుగా అభివృద్ధి ప్రణాళికలు ఉండాలి. అంతే కానీ ఓ రాష్ట్రంలో జరిగిన అభివృద్ధి మోడల్..…
ఓరుగల్లు కాంగ్రెస్ పోరు కొత్త టర్న్ తీసుకోబోతోందా? ఇద్దరినీ పిలిచారు…రెండు పక్షాల వాదన విన్నారు…. కానీ, నిర్ణయం తీసుకునేటప్పుడు మాత్రం ఒక్కరితోనే చర్చించారంటూ కొండా వ్యతిరేకులు మండి పడుతున్నారా? ఏకంగా క్రమశిక్షణ కమిటీ పని తీరునే ప్రశ్నిస్తున్నారా? ఇంతకీ కొత్తగా జరిగిన మార్పు ఏంటి? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎందుకంత నారాజ్ అయ్యారు? తెలంగాణ కాంగ్రెస్‌లో ఓరుగల్లు పోరు ముగిసినట్టే ముగిసి… మళ్ళీ రాజుకుందా అంటే… వాతావరణం అలాగే ఉందని అంటున్నాయి జిల్లా రాజకీయవర్గాలు. ఆ విషయంలో అధిష్టానం…
యాంబా….. మీరు మారరా? ఇందుకేనా మీకు పదవులు ఇచ్చుండేది? అవతలోళ్ళని కనీసం కౌంటర్ చేయాలని కూడా బుర్రలకు తట్టడం లేదా? అంతా ఫోటోలు దిగే బ్యాచ్ తప్ప పనిచేయడం రాదా….? ఇదీ… ఆ నియోజకవర్గంలో టీడీపీ లీడర్స్‌కు కేడర్ వేస్తున్న సూటి ప్రశ్న. రాష్ట్ర స్థాయి మంత్రులన్నా మాట్లాడుతున్నారుగానీ… లోకల్‌గా మీ నోళ్ళు మాత్రం ఎందుకు పెగలడంలేదని ఏ నియోజకవర్గ కేడర్ అడుగుతోంది? అక్కడున్న ప్రత్యేక పరిస్థితులు ఏంటి? తిరుపతి……రాజకీయ పార్టీలకు విపరీతమైన సెంటిమెంట్ ఉండే అసెంబ్లీ…
గులాబీ పార్టీలో ఇంటిపోరు క్లైమాక్స్‌కు చేరిందా? ఈనెల 14తో ఎండ్ కార్డ్ పడే ఛాన్స్ ఉందా? అది సముద్రపు తుఫానా? లేక టీ కప్పులో తుఫానా అన్నది ఆ రోజే తేలిపోతుందా? ఏంటి ఆ రోజు ప్రత్యేకత? బీఆర్ఎస్ వర్గాలన్నీ ఎందుకు ఉత్కంఠగా చూస్తున్నాయి? తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్ పెంపు, ఆర్డినెన్స్ విషయంలో ఇన్నాళ్ళు ముందు నుయ్యి, వెనక గొయ్యిలా ఫీలవుతున్న బీఆర్ఎస్ ఎట్టకేలకు ఒక నిర్ణయం తీసుకుంది. ఈనెల 14న కరీంనగర్లో బీసీ గర్జన పేరుతో…
ఆంధ్రప్రదేశ్‌లో రెడ్‌బుక్‌కు రెడ్ సిగ్నల్ పడిందా? తాత్కాలికంగానైనా… ఆ పుస్తకాన్ని ఫోల్డ్ చేసి పక్కపడేస్తే బెటరని టీడీపీ అధిష్టానం భావిస్తోందా? బయటి నుంచి ఫీడ్‌బ్యాక్ కూడా అలాగే వచ్చిందా? అధికార పార్టీ ఎందుకు ఆ దిశగా ఆలోచిస్తోంది? అంటే… రెడ్‌బుక్ టార్గెట్ పూర్తయిందా? లేక అంతకు మించిన కారణాలు ఇంకేమైనా ఉన్నాయా? టీడీపీ పెద్దలు ఎందుకు పునరాలోచనలో పడ్డారు? రెడ్‌బుక్….. ఏపీలో 2024 అసెంబ్లీ ఎన్నికల్ని ఓ ఊపు ఊపేసిన సబ్జెక్ట్. అప్పట్లో ఆ పేరే ఒక…
మాజీ సీఎం కేసీఆర్ విషయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యల మర్మం ఏంటి? కేసీఆర్‌కు ఎర్రవల్లే చర్లపల్లి అని ఎందుకు అన్నారు? ఇప్పటికిప్పుడు అరెస్ట్‌ల దాకా వెళ్ళే ఉద్దేశ్యం లేదని చెప్పకనే చెప్పేశారా? కాళేశ్వరం కమిషన్ నివేదిక విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? ముఖ్యమంత్రి మాటలకు అర్ధాలు వేరుగా ఉన్నాయా? లెట్స్ వాచ్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ మీడియా చిట్‌చాట్‌లో అన్న మాటల్లోని అర్ధాలు, పరమార్ధాలను వెదికే పనిలో బిజీగా ఉన్నాయి రాజకీయ వర్గాలు.…
రెడ్ బుక్, గుడ్ బుక్ లాగా బీఆర్ఎస్ కూడా ఓ పింక్ బుక్‌ని రెడీ చేసుకోవాలనుకుంటోందా? అందులో తమను ఇబ్బంది పెట్టే వాళ్ళ పేర్లు రాయాలనుకుంటోందా? పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాటలు ఏం చెబుతున్నాయి? ఉన్నతాధికారులను ఉద్దేశించి ఆయన చేసిన వ్యాఖ్యలపై సివిల్ సర్వీసెస్ వర్గాలు ఎలా రియాక్ట్ అవుతున్నాయి? అధికారులు నిజంగా రాజకీం చేస్తున్నారా? లేక పార్టీలే వాళ్ళకు అంటగడుతున్నాయా? తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ప్రస్తుతం ఒక స్పెషల్ ట్రెండ్ నడుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు…
తెలంగాణ కమలం కళకళలాడబోతోందా? అందు కోసం చాపకింద నీరులా గ్రౌండ్ వర్క్ పూర్తయిపోతోందా? ఎలాంటి హంగామా లేకుండా కాషాయ పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ మొదలుపెట్టిందా? గువ్వల బాలరాజు బాటలో ఇంకొందరు కూడా కండువా మార్చేయబోతున్నారా? మాజీలతో పాటు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారా? లెట్స్ వాచ్. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఇప్పుడు మళ్లీ తెలంగాణలో చేరికల చర్చలు నడుస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ కొత్తల్లో ఈ వ్యవహారం నడిచింది. అప్పట్లో…