Mani Sharma Birthday: పసందైన బాణీలతో చిందేయించిన మణిశర్మ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దరువేసి చిందేయించడమే కాదు, ముచ్చట గొలిపే బాణీలతో మురిపించడమూ మణిశర్మకు బాగా తెలుసు! అందుకే జనం ఆయనను ‘స్వరబ్రహ్మ’ అన్నారు, ‘మెలోడీ కింగ్’ అనీ కీర్తించారు. మణిశర్మ ఫుల్ ఫామ్ లో ఉన్న రోజుల్లో ఓ వైపు టాప్ స్టార్స్ ఇమేజ్ కు తగ్గ బాణీలు కడుతూనే, మరోవైపు యువకథానాయకులను విజయపథంలో పయనింపచేసే స్వరాలూ పలికించారు. అదే మ్యాజిక్ ఇప్పటికీ చేయగలనని అంటున్నారు మణిశర్మ.
మణి శర్మ పూర్తి పేరు యనమండ్ర వెంకట సుబ్రహ్మణ్య శర్మ. 1964 జూలై 11న మణిశర్మ బందరులో జన్మించారు. ఆయన తండ్రి నాగయజ్ఞ శర్మ వాయులీనం వాయించడంలో దిట్ట. దాంతో మదరాసు చేరి, ఘంటసాల మాస్టారు వద్ద వయోలినిస్ట్ గా కుదురుకున్నారు. మణి కూడా చిన్నప్పుడే ఇంట్లో ఉండే హార్మోనియం వాయిస్తూ ఉండేవాడు. తనయుడిలోని తపన చూసిన నాగయజ్ఞ శర్మ మురిసిపోయారు. తనకు తెలిసిన విద్యనంతా నేర్పి, శాస్త్రీయ సంగీతంలోనూ శిక్షణ ఇప్పించారు. మణిశర్మ పలువురు మేటి సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేశారు. తరువాత సోలోగా కొన్ని ట్యూన్స్ కట్టారు. అదే సమయంలో రామ్ గోపాల్ వర్మ తన ‘రాత్రి’ చిత్రం కోసం మణిశర్మను ఎంచుకున్నారు. తొలి ప్రయత్నంలోనే జడిపించే బాణీలు కట్టి ఆకట్టుకున్నారు మణి. అయినా వెంటనే మణికి ఎవరూ ఎర్రతివాచీ పరచి ఆహ్వానం పలకలేదు. వర్మ ‘అంతం’లో “చలెక్కి ఉందనుకో…” అనే పాటకు మణి బాణీ కట్టారు. వెంకటేశ్ ‘ప్రేమించుకుందాం…రా’ చిత్రంలో మూడు పాటలకు స్వరకల్పన చేశారు. ఆ సినిమాకు మహేశ్ సంగీత దర్శకుడు. మహేశ్ కు వీలు కాకపోవడంతో మణి చేయి చేసుకోవలసి వచ్చింది. రామానాయుడు తన ‘సూపర్ హీరోస్’ ద్వారా మణిశర్మను సోలో మ్యూజిక్ డైరెక్టర్ ను చేశారు. చిరంజీవి ‘బావగారూ…బాగున్నారా’లో మణి బాణీలు మజా చేశాయి. తరువాత మెగాస్టార్ ‘చూడాలని వుంది’లో మణిశర్మ సంగీతం అదరహో అనిపించింది. ఆ పై మణి మ్యూజిక్ కోసం టాప్ హీరోస్ ఆసక్తి చూపించసాగారు. బాలకృష్ణ ‘సమరసింహారెడ్డి’కి కూడా మణిశర్మ సంగీతం సందడి చేసింది. ఆ తరువాత నుంచీ మార్కెట్ లో మణిశర్మ మ్యూజిక్ కు భలే డిమాండ్ పెరిగింది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మణి ఎదిగిపోయారు.
Also Read
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
- NTR-Trivikram: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు పూనకాలే.. గాడ్ ఆఫ్ వార్‌పై బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన త్రివిక్రమ్!
కేవలం టాప్ స్టార్స్ చిత్రాలకే కాదు, ఆ నాటి వర్ధమాన కథానాయకుల సినిమాలకు సైతం మరపురాని మధురం పంచారు మణిశర్మ. యంగ్ హీరోగా మహేశ్ బాబు తొలి చిత్రం ‘రాజకుమారుడు’కు కూడా మణి బాణీలే సందడి చేశాయి. ఇక మహేశ్ కు నాలుగు రజతోత్సవ చిత్రాలుగా నిలచిన “మురారి, ఒక్కడు, అతడు, పోకిరి”కి కూడా మణిశర్మ సంగీతమే మురిపించింది. వీటిలో ‘పోకిరి’ డైమండ్ జూబ్లీ మూవీ కావడం విశేషం.
మణి స్వరకల్పనలో రూపొందిన “నరసింహనాయుడు, ఇంద్ర, ఠాగూర్, ఖుషి, అన్నయ్య, చెన్నకేశవ రెడ్డి, టక్కరిదొంగ, అంజి, సీమసింహం, యజ్జం, బాలు, జై చిరంజీవ, స్టాలిన్, ఖలేజా, శక్తి, రచ్చ, పరుగు” వంటి చిత్రాలన్నీ సంగీతపరంగా జనాన్ని ఆకట్టుకున్నవే.
జూనియర్ యన్టీఆర్ తొలి బిగ్ హిట్ ‘ఆది’కి, రామ్ చరణ్ తొలి చిత్రం ‘చిరుత’కు కూడా మణి బాణీలే మజా చేశాయి. ‘రచ్చ’ తరువాత మళ్ళీ మణిశర్మ స్వరకల్పన చేసిన చిత్రాలేవీ ఆ స్థాయి విజయాన్ని చవిచూడలేదు. అయినా, తన దరికి చేరిన సినిమాలకు మణి తన మార్కు సంగీతం పలికిస్తూనే వచ్చారు. సక్సెస్ చుట్టూ ప్రదక్షిణలు చేసే చిత్రసీమ మణికి దూరంగా జరిగింది. అయితే పూరి జగన్నాథ్ తన ‘ఇస్మార్ట్ శంకర్’కు మళ్ళీ మణి శర్మ బాణీలను కావాలనుకున్నారు. ‘ఇస్మార్ట్ శంకర్’లో చిందేయించే బాణీలతో పాటు తనదైన మెలోడీని అందించి ఆకట్టుకున్నారు మణిశర్మ. అప్పటి నుంచీ సినీజనం మళ్ళీ మణిశర్మ వైపు చూస్తోంది. తన వద్ద పనిచేసిన దేవిశ్రీ ప్రసాద్, థమన్ రాజ్యమేలుతున్న సమయంలో మణి పని అయిపోయిందని భావించిన వారికి షాక్ ఇచ్చారు మణిశర్మ. మళ్ళీ మణిశర్మకు మునుపటి రోజులు వచ్చాయని పరిశీలకులు భావిస్తున్నారు. ఆయన తనయుడు మహతీ స్వరసాగర్ సైతం సంగీత దర్శకునిగా సాగుతున్నాడు. చిరంజీవి, రామ్ చరణ్ నటించిన ‘ఆచార్య’కు మణి స్వరాలు అలరించాయి. వెంకటేశ్ ‘నారప్ప’కు మణి నేపథ్య సంగీతం ఆకట్టుకుంది. “యశోద, శాకుంతలం, బ్లాక్ రోజ్” వంటి చిత్రాలకూ మణిశర్మ బాణీలు కట్టారు. ఇవి కాక మరికొన్ని సినిమాలకు కూడా మణిశర్మ స్వరకల్పన చేస్తున్నారు. మరి ఈ సినిమాలతో మణి ఏ తీరున అలరిస్తారో చూడాలి.
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!