Hemamalini : ఎందరికో ‘స్వప్నసుందరి’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hemamalini birthday special story
‘డ్రీమ్ గర్ల్’ అన్న మాట వింటే చాలు భారతీయులకు ముందుగా గుర్తుకు వచ్చే మనోహర రూపం హేమామాలినిదే! ఈ నాటికీ ఆ నాటి హేమ అందాలను మననం చేసుకుంటూ పరవశించిపోయే రసిక శిఖామణులు ఎందరో ఉన్నారు. 74 ఏళ్ళు నిండినా, ఇప్పటికీ ఎంతో చెలాకీగా నాట్యం చేసే హేమామాలినిని చూస్తే అమృతం సేవించి, దివి నుండి భువికి దిగివచ్చిన అప్సరస అనే అనిపిస్తుంది.
Also Read
- Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
తమిళనాడులోని శ్రీరంగంలో జయలక్ష్మి, చక్రవర్తి అయ్యంగార్ దంపతులకు 1948 అక్టోబర్ 16న హేమామాలిని జన్మించారు. చెన్నైలోని ఆంధ్రమహిళా సభలో తొలుత హేమామాలిని పాఠాలు నేర్చారు. తరువాత డి.టి.ఈ.ఏ. మందిర్ లో 11వ తరగతి వరకు చదువుకున్నారు. అప్పటి నుంచే సినిమాల్లో నటించాలనే అభిలాషతో ఉన్నారు. శాస్త్రీయ నృత్యంలో ప్రావీణ్యం సంపాదించిన హేమామాలిని తొలుత 1963లో ‘ఇదు సత్తియమ్’ చిత్రంలో “షింగారీ…” అనే పాటలో నర్తించారు. ఆ తరువాత 1965లో విడుదలైన తెలుగు పౌరాణిక చిత్రం ‘పాండవవనవాసము’లో “మొగలీరేకుల సిగదానా…” అనే పాటలో కనిపించారు. ఆమె అదృష్టం వల్ల తొలి హిందీ చిత్రం ‘సప్నోంకీ సౌదాగర్’లో రాజ్ కపూర్ లాంటి మేటి నటునితో నటించారు. ఆ సినిమాతోనే ‘డ్రీమ్ గర్ల్’ అన్న పేరు సంపాదించారు హేమామాలిని.
అప్పటి స్టైలిష్ హీరో దేవానంద్ తో ‘జానీ మేరా నామ్’లో నటించారు హేమ. ఆ సినిమా ఘనవిజయం సాధించడంతో తరువాత దేవానంద్ తో కలసి “తేరే మేరే సప్నే, జోషీలా, చుప్పా రుస్తుమ్, షరీఫ్ బద్మాష్, అమిరీ గరీబ్, జానేమన్, సచ్చే కా బోల్ బాలా, అమన్ కే ఫరిస్తే” వంటి చిత్రాలలో హేమామాలిని అభినయించారు. ధర్మేంద్రతో హేమామాలిని కలసి “తుమ్ హసీన్ మై జవాన్, షరాఫత్, నయా జమానా, రాజా జానీ, సీతా ఔర్ గీతా, పత్తర్ ఔర్ పాయల్, దోస్త్, జుగ్ను, ప్రతిజ్ఞ, షోలే, చరస్, ఆజాద్, దిల్లగీ, ఆలీబాబా చాలిస్ చోర్, బఘావత్, సమ్రాట్, రజియా సుల్తాన్, రాజ్ తిలక్” వంటి చిత్రాలలో నటించారు. వీరిద్దరి జోడీని జనం మెచ్చారు. వారు కూడా ఒకరికి ఒకరు నచ్చారు. దాంతో 1980లో ధర్మేంద్రను పెళ్ళాడారు హేమామాలిని.
ఇతర హీరోలతోనూ హేమామాలిని సూపర్ హిట్ మూవీస్ లో నటించారు. “సన్యాసీ, దస్ నంబరీ, ధర్మాత్మ, అందాజ్, ప్రేమ్ నగర్, మెహబూబా, క్రాంతి, నసీబ్, సత్తే పే సత్తా, బాఘ్ బన్” వంటి విజయవంతమైన చిత్రాలలో హేమామాలిని వయసుకు తగ్గ పాత్రల్లో మురిపించారు. కొన్ని చిత్రాలలో హేమామాలిని అందం మందంగానే బంధం వేసింది. హేమామాలిని, ధర్మేంద్ర దంపతులకు ఇషా డియోల్, అహనా డియోల్ ఇద్దరు కూతుళ్ళు. ఆమె కూతుళ్ళతో కలసి అనేక నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. ఇప్పటికీ తన నృత్యాభినయంతో అలరిస్తూనే ఉన్నారు. దేశవిదేశాల్లోని అభిమానులను తన నర్తనంతో ఆకట్టుకున్నారామె. తెలుగులో యన్టీఆర్ ‘శ్రీకృష్ణవిజయం’లోనూ “జోహారు శిఖిపింఛమౌళీ…” పాటలో నృత్యం చేశారు. ఇక బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కిన ‘గౌతమీపుత్ర శాతకర్ణి’లో గౌతమిగా నటించారు.
హేమామాలిని 2003లో రాజ్యసభకు నామినేట్ అయ్యారు. 2009 దాకా రాజ్యసభ సభ్యురాలిగా ఉన్నారామె. 2011లో బీజేపీ జనరల్ సెక్రటరీ అయ్యారు. 2014లో మధుర లోక్ సభ స్థానం నుండి ఎమ్.పి.గా ఎన్నికయ్యారు. అదే నియోజకవర్గం నుండి 2019లో మరోమారు గెలుపొందారు. భరతనాట్యంలో ఎంతో ప్రావీణ్యం సంపాదించిన హేమామాలినికి శ్రీకృష్ణ పరమాత్మ అంటే ఎంతో భక్తి. ఆమె ఇస్కాన్ జీవిత సభ్యురాలు. తన నృత్యంలో ఎక్కువగా కృష్ణ భక్తి గీతాలకే ప్రాధాన్యమిస్తూ ఉంటారు. ఏదేమైనా, అసలు సిసలు ‘డ్రీమ్ గర్ల్’ అనిపించుకున్న హేమామాలిని మరిన్ని వసంతాలు చూస్తూ ఆనందంగా సాగిపోవాలని ఆశిద్దాం.
తాజావార్తలు
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
-
Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!