ఒంగోలులో జరుగుతున్న టీడీపీ మహానాడులో నందమూరి నటసింహం బాలయ్య బాబు ఉద్వేగభరితంగా ప్రసంగించారు. నేల ఈనిందా.. ఆకాశానికి చిల్లుపడిందా అన్నట్టుగా తరలివచ్చిన టీడీపీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు బాలయ్య. మనం మనం కలిస్తే జనం.. జనం జనం కలిస్తే సునామీ, ప్రభంజనం. ఈ మహానాడుకి తరలివచ్చిన పసుపు సైన్యానికి నమస్కారాలు తెలిపారు. ఈ మహానాడుకి ప్రత్యేకత వుంది. ఈరోజు ప్రపంచపటం మీద తెలుగు సంతకం. తెలుగు ఆత్మగౌరవానికి ఆరడుగుల ప్రతిరూపం. యుగ పురుషుడు నందమూరి తారకరామారావుగారి శతజయంతిని…
అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కొన్ని ఇన్సిడెంట్స్.. కో ఇన్సిడెంట్స్‌గా జరుగుతుంటాయి. అలాంటి విషయాలు ఒక్కోసారి హైలెట్‌గా నిలుస్తుంటాయి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోను అదే జరిగుతోంది. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలతో సెట్ అవడంతో.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎన్టీఆర్-మహేష్ బాబు.. ఏ విషయంలోరాజమౌళితో కో ఇన్సిడెంట్స్ అయ్యారు..! ట్రిపుల్ ఆర్‌లో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఆ తర్వాత…
శ్రీరాముడు, శ్రీకృష్ణుడు విగ్రహా రూపాల కంటే.. వాళ్ల రూపం అచ్చం ఇలాగే ఉంటుందేమోనని అనిపించేలా.. ఇప్పటికీ, ఎప్పటికీ.. తెలుగువారికి గుర్తుకొచ్చే రూపం ఆయనదే. నటుడిగా తెలుగు ప్రేక్షకుడి గుండెల్లో.. నాయకుడిగా తెలుగు వారి హృదయాల్లో ఆయన వేసిన ముద్ర శాశ్వతం. తెలుగు ప్రజల కీర్తిని ఖండాంతరాలకు చాటి చెప్పిన శక పురుషుని శత జయంతి సంవత్సరం ఇది. సినీనేత.. జననేత.. తిరుగులేని కథానాయకుడు.. ఎదురులేని మహానాయకుడు… విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 100వ జయంతి…
విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు ఆశీస్సులతో ఆయన పెద్ద కుమారుడు నందమూరి జయకృష్ణ ‘బసవతారకరామ క్రియేషన్స్’ పేరుతో కొత్త బ్యానర్ ని స్థాపించారు. నటసింహ నందమూరి బాలకృష్ణ ఈ బ్యానర్ ను మే 28న గ్రాండ్ గా లాంచ్ చేశారు. బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ లో ప్రొడక్షన్ నెం1గా నందమూరి జయకృష్ణ కుమారుడు, నందమూరి చైతన్య కృష్ణని హీరోగా పరిచయం చేస్తూ వంశీకృష్ణ ఆకెళ్ళ దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన చిత్రం నిర్మిస్తున్నారు. ఈ…
విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ శతజయంతి వేళ ఒకవైపు ఒంగోలులో టీడీపీ మహానాడు నిర్వహిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా ఎన్టీఆర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. వైసీపీ నేతలు చంద్రబాబునాయుడు, నటుడు, ఎమ్మెల్యే బాలకృష్ణను టార్గెట్ చేశారు మంత్రి రోజా. ఎన్టీఆర్ తనయుడు బాలయ్యను చూస్తే జాలేస్తోందన్నారు రోజా. ఎన్టీఆర్ కి వెన్నుదన్నుగా బాలయ్య ఆరోజుల్లో వుండి వుంటే.. జగన్ సీఎం అయినట్టే బాలయ్య కూడా కీలక పదవిలో వుండేవారన్నారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వుండేదన్నారు. ఎన్టీఆర్ కొడుకుల అమాయకత్వాన్ని…
తరగని కళాతృష్ణ, చెరిగిపోని నటనాపిపాస వెరసి నటరత్న యన్.టి.రామారావు అని అంటే అతిశయోక్తి కాదు. తెరపై పట్టువదలని విక్రమార్కునిగా నటించిన యన్.టి.రామారావు నిజజీవితంలోనూ అదే తీరున సాగారు. ఓ సారి తలచుకుంటే, దానిని సాధించేదాకా నిదురపోని నైజం యన్టీఆర్ ది! ప్రపంచవ్యాప్తంగా బౌద్ధం పరిఢవిల్లడానికి కారణమైన సమ్రాట్ అశోకుని పాత్ర పోషించాలన్న తలంపు యన్టీఆర్ మదిలో బ్రహ్మంగారి చరిత్ర చిత్రం రూపకల్పన సమయంలోనే నాటుకుంది. తరువాత రాజకీయ ప్రవేశం, ఆ తరువాత రాజకీయాల్లోనూ ఆయన జైత్రయాత్ర, ముఖ్యమంత్రిగా…
మహానాడు రెండో రోజున భారీ బహిరంగ సభ జరగనుంది. వివిధ జిల్లాల నుంచి బహిరంగ సభకు తరలి వస్తున్నారు టీడీపీ కార్యకర్తలు. బహిరంగ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వస్తారని టీడీపీ అంచనా వేసింది. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి కార్లు, ట్రాక్టర్లు, వివిధ వాహనాల్లో టీడీపీ నేతలు, కార్యకర్తలు వస్తుండడంతో ఒంగోలుకి వచ్చే దారులన్నీ పసుపుమయంగా మారాయి.
విశ్వవిఖ్యాత నటుడిగా, పరిపాలకుడిగా తెలుగు ప్రజల గుండెల్లో ఎన్టీఆర్ చిరస్థాయిగా నిలిచిపోయారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి సందర్భంగా హనుమకొండలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా పుష్పాంజలి ఘటించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టిన మహానుభావుడని, రెండు రూపాయలకే కిలో బియ్యం, పేదలకు ఇండ్లు ఇచ్చారన్నారు. యువతకు ఆదర్శంగా నిలిచారని, ఆయన సేవలు…
తెలుగు జాతి గర్వించదగ్గ మహా నటుడు పద్మశ్రీ నందమూరి తారకరామారావు అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల రాజకీయాలనే మలుపు తిప్పిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా బీజేపీ తెలంగాణ శాఖ తరపున ఆయనకు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పౌరాణికం మొదలు జానపదం, జేమ్స్ బాండ్ సినిమాల వరకు అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు…
ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా తెలుగు చలన చిత్ర పరిశ్రమ, ఫిల్మ్ నగర్ సొసైటీ ఆధ్వర్యంలో ఫిల్మ్ నగర్ నందు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు సినీ సెలబ్రిటీలతో పాటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు అంతా తరలి రానున్నారు. ఈ కార్యక్రమానికి నందమూరి తారకరామారావు కుటుంబ సభ్యులు.. నందమూరి జయకృష్ణ, గారపాటి లోకేశ్వరి గణేశ్వరారవు, నందమూరి మాధవి మణి సాయికృష్ణ, లక్ష్మి హరికృష్ణ ,నందమూరి మోహన కృష్ణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురంధేశ్వరి,…