అప్పుడప్పుడు ఇండస్ట్రీలో కొన్ని ఇన్సిడెంట్స్.. కో ఇన్సిడెంట్స్‌గా జరుగుతుంటాయి. అలాంటి విషయాలు ఒక్కోసారి హైలెట్‌గా నిలుస్తుంటాయి. ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోను అదే జరిగుతోంది. అది కూడా దర్శక ధీరుడు రాజమౌళి సినిమాలతో సెట్ అవడంతో.. ఈ న్యూస్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇంతకీ ఎన్టీఆర్-మహేష్ బాబు.. ఏ విషయంలోరాజమౌళితో కో ఇన్సిడెంట్స్ అయ్యారు..!
ట్రిపుల్ ఆర్‌లో నటించిన రామ్ చరణ్, ఎన్టీఆర్.. ఆ తర్వాత సినిమాలు ఒకే దర్శకుడితో సినిమాలు చేయడం.. అనుకోకుండానే సెట్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో చరణ్ ‘ఆచార్య’ సినిమాలో నటించగా.. ఎన్టీఆర్ తన 30 ప్రాజెక్ట్ కొరటాలతో చేస్తున్నాడు. ఇక ఇప్పుడు ఎన్టీఆర్, మహేష్ బాబు.. రాజమౌళితో చేసే ప్రాజెక్ట్స్ కూడా అలాగే కో ఇన్సిడెంట్ అయ్యాయి. హీరోగా ఇప్పటి వరకూ 29 సినిమాలు చేశాడు తారక్. రీసెంట్‌గా రాజమౌళి డైరెక్షన్లో వచ్చిన ట్రిపుల్ ఆర్ ఎన్టీఆర్ 29వ సినిమాగా తెరకెక్కింది. ఇక ఇప్పుడు మహేష్‌తో రాజమౌళి చేయబోయే సినిమా కూడా 29వ ప్రాజెక్టే కావడం విశేషం. సర్కారు వారి పాట తర్వాత.. త్రివిక్రమ్ దర్శకత్వంలో SSMB28 ప్రాజెక్ట్ చేస్తున్నాడు మహేష్. ఇక ఈ సినిమా తర్వాత జక్కన్నతో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా మహేష్ కెరీర్లో 29వ ప్రాజెక్ట్ కానుంది. దాంతో ఎన్టీఆర్, మహేష్ 29వ ప్రాజెక్ట్స్ రాజమౌళి సినిమాలే కావడం విశేషంగా మారింది. అయితే ఇదంతా అనుకోకుండా జరిగినప్పటికీ.. రాజమౌళి బ్యాక్ టు బ్యాక్ ప్రాజెక్ట్స్ కావడంతో.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. దాంతో ట్రిపుల్ ఆర్‌కు మించి మహేష్ సినిమా ఉంటుందని.. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలవడం పక్కా అని.. సంబరపడుతున్నారు మహేష్ అభిమానులు. ఇకపోతే ప్రస్తుతం మహేష్ బాబు సినిమాకు సంబంధించిన కథపైనే కసరత్తులు చేస్తున్నారు రాజమౌళి. త్వరలోనే స్క్రిప్ట్ లాక్ చేసి ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో.. ఈ సినిమా ఎలా ఉండబోతుంది.. రాజమౌళి, మహేష్‌ని ఎలా చూపించబోతున్నాడు.. అనేది ఆసక్తికరంగా మారింది.