యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వెకేషన్ మోడ్ లో ఉన్న విషయం విదితమే.. ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ తో కొద్దిగా రిలాక్స్ అయిన తారక్ కుటుంబంతో కలిసి సింగపూర్ కు వెళ్ళాడు. ఇక వెకేషన్ నుంచి తిరిగి రాగానే సెట్స్ లో అడుగుపెట్టనున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్.. కొరటాల శివతో ఎన్టీఆర్ 30 చేస్తుండగా.. ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ 31 చేస్తున్నాడు. పాన్ ఇండియా మూవీస్ గా తెరకెక్కుతున్న ఈ రెండు సినిమాలు త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరి చూపు ఎన్టీఆర్ 31 మీదనే ఉన్నాయి అంటే అతిశయోక్తి కాదు. ‘కెజిఎఫ్’ సినిమాలతో పాన్ ఇండియా మార్కెట్ లో అగ్ర దర్శకులలో ఒకరిగా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న ప్రశాంత్ ప్రస్తుతం ప్రభాస్ తో మరొక యాక్షన్ సినిమాను పూర్తి చేసే పనిలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత ఎన్టీఆర్ సినిమా పట్టాలెక్కనుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల అంచనాలను అమాంతం పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించిన వార్త నెట్టింట వైరల్ గా మారింది. అదేంటంటే.. ఈ సినిమాకు మంచి పవర్ ఫుల్ టైటిల్ ను పెట్టె ఆలోచనలో మేకర్స్ ఉన్నారట.. ఆ టైటిల్ కూడా ‘అసుర’ లేక ‘అసురుడు’ అని వినిపిస్తుంది. ప్రశాంత్ నీల్ హీరోలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటారో సినిమా టైటిల్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.. ‘ఉగ్రం’, ‘కెజిఎఫ్’, ‘సలార్’.. ఇప్పుడు ‘అసుర’.. ఈ టైటిల్ ఫస్ట్ లుక్ పోస్టర్ కి యాప్ట్ గా సరిపోయినట్లు కనిపిస్తుంది కదా.. దీంతో అభిమానులు ఇదే టైటిల్ ని ఫిక్స్ చేస్తే బావుంటుందని అంటున్నారు. అయితే టైటిల్ విషయంలో ఇంకా ఎలాంటి ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. టైటిల్ పై మరొకసారి చిత్ర యూనిట్ సభ్యులు అందరూ కలిసి చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్తలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.