ఆస్తుల కోసం తోబుట్టువులను దూరం చేసుకుంటున్న ఈ రోజుల్లో ఓ అన్న తన చెల్లెలి కోసం చేస్తున్న పోరాటం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన దుర్గారావు తన చెల్లి కోసం హస్తిన బాట పట్టాడు. తన సోదరి నవ్యతను చందాపురం గ్రామానికి చెందిన కొంగర నరేంద్రనాథ్ కిచ్చి 2018లో పెళ్లి చేశాడు. కట్నంగా 23 లక్షల డబ్బు బంగారం, మూడు ఎకరాల పొలం ఇచ్చాడు.…
రాష్ట్రంలోని మహిళలందరూ దిశ యాప్ డౌన్ లోడ్ చేసుకోవాలన్నారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు. ఎన్టీఆర్ జిల్లాలో దిశా యాప్ మెగా ఈవెంట్ నిర్వహించారు. ఒకే రోజు రెండు లక్షల మంది డౌన్ లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశా ఎస్.ఓ.ఎస్ యాప్ పై మాస్ క్యాంపెయిన్ జరుగుతోంది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి దిశా యాప్ మెగా ఈవెంట్ ప్రారంభం అయింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, పోలీస్ కమీషనర్…
కామాతురాణాం నభయం నలజ్జ అంటారు. కామంతో కళ్ళు మూసుకుపోయినవాడికి భయం వుండదు.. సిగ్గుశరం వుండవు. విజయవాడలో సభ్యసమాజం తలదించుకునే ఘటన జరిగింది. నాలుగో తరగతి చదువుతున్న అమ్మాయిపై అఘాయిత్యానికి ప్రయత్నించారు కొందరు ఆకతాయిలు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన అందరినీ కలవరానికి గురిచేసింది. విజయవాడ అరండల్ పేట లోని మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ఉర్దూ స్కూల్ ప్రాంగణంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. స్కూల్ ఆవరణలో ఎటు చూసినా మద్యం బాటిళ్లు కనిపించాయి. ఈ ఘటనతో పాఠశాలలకు…
రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్ కొత్త అధ్యాయానికి నాంది పలికారన్నారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పెద్ద పెద్ద సొరకాయలు కోస్తారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమయ్యింది?? కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారు. ఈ అంశాలు పవన్ కళ్యాణ్ కు ఎందుకు కనిపించటం లేదు. జనాభా పెరిగిపోతుంటే పాలనా సౌలభ్యం కోసం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారు?? పవన్ కళ్యాణ్ చంద్రబాబు సలహాతో…
తెలుగుజాతి వెలుగు కిరణం ఎన్టీఆర్. అటు సినిమా, ఇటు రాజకీయరంగంలో ఎన్టీఆర్ అచంద్రతారార్కం అయిన చరిత్ర. ఏపీలో ఇవాళ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎన్టీఆర్ జిల్లా సగర్వంగా ఆవిష్కృతం అయింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీ రావు.ఆయన్ని అభినందించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలుగు అకాడెమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా. ఎన్టీఆర్ జిల్లా జిల్లా జేసీగా బాధ్యతలు…
ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. నూతన జిల్లాల ఆవిష్కరణ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. గతంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. తాజాగా 26 జిల్లాలకు పెరగనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గం అని దుయ్యబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ. జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా సీఎం ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో హేతుబద్ధమైన సూచనలను కూడా బేఖాతరు చేయడం…
ఆంధ్రప్రదేశ్ ముఖచిత్రం మారిపోయింది. 26 జిల్లాల రాష్ట్రంగా కొత్త రూపు సంతరించుకుంది. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి రంగం పూర్తయింది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. 9.05 – 9.45 నిమిషాల మధ్య కొత్త జిల్లాల ప్రారంభోత్సవం జరగనుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేశారు. 42 ఏళ్ళ తర్వాత రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటు అయింది. చివరిసారిగా 1979 లో ఏర్పడింది విజయనగరం జిల్లా. పరిపాలన వికేంద్రీకరణ…
అమరావతి: తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను నందమూరి కుటుంబసభ్యులు కలిశారు. అధికారంలోకి వస్తే కృష్ణా జిల్లాకు నందమూరి తారకరామారావు పేరు పెడతానని పాదయాత్రలో ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నందుకు నందమూరి కుటుంబీకులు ధన్యవాదాలు తెలిపారు. సీఎం జగన్‌ను కలిసిన వారిలో మంత్రి కొడాలి నానితో పాటు పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్‌కుమార్, నందమూరి పెద వెంకటేశ్వరరావు, నందమూరి జయసూర్య, చిగురుపాటి మురళి, పలువురు స్ధానికులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు వారు జ్ఞాపికను…