ఏపీలో ఇవాళ్టి నుంచి కొత్త జిల్లాలు ప్రారంభం కానున్నాయి. గతంలో 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్.. తాజాగా 26 జిల్లాలకు పెరగనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్ వర్చువల్ గా కొత్త జిల్లాలను ప్రారంభించనున్నారు. కొత్త జిల్లాల ప్రారంభోత్సవానికి అఖిలపక్షాలను ఆహ్వానించకపోవడం దుర్మార్గం అని దుయ్యబట్టారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ.
జిల్లాల ఏర్పాటు అన్ని రాజకీయ పక్షాలకు ఆమోదయోగ్యమైనా సీఎం ఏకపక్షంగా వ్యవహరించడం సరైంది కాదన్నారు. నూతన జిల్లాల ఏర్పాటు ప్రక్రియలో హేతుబద్ధమైన సూచనలను కూడా బేఖాతరు చేయడం విచారకరం. నూతన జిల్లాల ఏర్పాటు కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందినది కాదు. అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ప్రభుత్వ అధికారులు, ప్రజలతో మమేకమై ఉంటే బావుండేది.
https://ntvtelugu.com/andhrapradesh-have-13-new-districts/
జగన్ ఏకపక్ష, నిరంకుశ విధానాలను ఇకనైనా మానుకోవాలని రామకృష్ణ హితవు పలికారు. జిల్లాల విభజనపై బీజేపీ కూడా విమర్శించింది. విభజన అందరికీ ఆమోదంగా వుండాలని, సౌకర్యాలు లేకుండా ప్రారంభోత్సవాలు చేయడం ఏంటని బీజేపీ నేతలు విమర్శించారు. జిల్లాల ప్రారంభానికి విపక్షాలను కూడా ఆహ్వానిస్తే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.