రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలను ఏర్పాటుచేసి రాష్ట్ర చరిత్రలో ముఖ్యమంత్రి జగన్ కొత్త అధ్యాయానికి నాంది పలికారన్నారు మంత్రి పేర్ని నాని. చంద్రబాబు పెద్ద పెద్ద సొరకాయలు కోస్తారు. 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఏమయ్యింది?? కనీసం కుప్పంను రెవెన్యూ డివిజన్ కూడా చేసుకోలేక పోయారు. ఈ అంశాలు పవన్ కళ్యాణ్ కు ఎందుకు కనిపించటం లేదు. జనాభా పెరిగిపోతుంటే పాలనా సౌలభ్యం కోసం ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారు??
పవన్ కళ్యాణ్ చంద్రబాబు సలహాతో ఓ లేఖ రాశారు. కొక్కునూరు ఏలూరు జిల్లాలో ఉంటే కనీస అవగాహన లేకుండా లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ బారి తెగించి మాట్లాడుతున్నాడు. ఏదో బాధ్యత వహిస్తాడట. అప్పట్లో అమరావతి భూములను బలవంతంగా తీసుకుంటే నడిరోడ్డు పై ఆందోళన చేస్తానన్నారు. లుంగీ కట్టుకుని విమానంలో వచ్చి చంద్రబాబును కలిసి అంతా బాగుంది అని చెప్పి వెళ్ళిపోయారు.
అమరావతి ప్రజలను మోసం చేశారు. జిల్లాల నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉన్నాడు. నోటిఫికేషన్ ఏమైనా అధ్యయనం చేశాడా?? ప్రభుత్వానికి ఏమైనా సూచనలు చేశాడా? చంద్రబాబు వాట్సప్, మెయిల్ పెట్టగానే ప్రింట్ అవుట్ తీసి మీడియాకు లేఖ విడుదల చేయటం తప్ప పవన్ కళ్యాణ్ కు ఏం తెలుసు? అని పేర్ని నాని ప్రశ్నించారు.