తెలుగుజాతి వెలుగు కిరణం ఎన్టీఆర్. అటు సినిమా, ఇటు రాజకీయరంగంలో ఎన్టీఆర్ అచంద్రతారార్కం అయిన చరిత్ర. ఏపీలో ఇవాళ కొత్త జిల్లాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎన్టీఆర్ జిల్లా సగర్వంగా ఆవిష్కృతం అయింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు స్వీకరించారు ఢిల్లీ రావు.ఆయన్ని అభినందించారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు, తెలుగు అకాడెమీ ఛైర్మన్ లక్ష్మీపార్వతి, ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్ రెడ్డి, విజయవాడ సీపీ కాంతి రాణా టాటా.
ఎన్టీఆర్ జిల్లా జిల్లా జేసీగా బాధ్యతలు స్వీకరించారు శ్రీవాస్ నూపూర్ అజేయ్ కుమార్. కొత్త జిల్లాలో జేసీగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. గతంలోనే పని చేసిన అనుభవం ఉండడంతో అభివృద్ధి చేయడానికి మరింత అవకాశం ఉందన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరుగా బాధ్యతలు అప్పగించినందుకు ధన్యవాదాలు తెలిపారు ఢిల్లీ రావు. గొప్ప వ్యక్తి పేరు మీద జిల్లా ఏర్పడింది.
https://ntvtelugu.com/traffic-police-imposed-fine-to-trivikram/
7 నియోజకవర్గాలు, 3 రెవెన్యూ డివిజన్లు, 20 మండలాలతో జిల్లా ఏర్పాటైంది.పెద్ద కార్పోరేషన్ విజయవాడ కూడా ఈ జిల్లాలోనే ఉంది.అందరి సహకారంతో జిల్లాలో అభివృద్ధి చేపడతాం.హౌసింగ్, ప్రభుత్వ పథకాలు సహా అన్ని చక్కగా అమలు చేస్తూ టాప్-3 జిల్లాల్లో నిలుపుతాం.ప్రజల విఙప్తులను పరిష్కరించేందుకు పూర్తి స్థాయి ప్రయత్నం.ఫైళ్లని వీలైనంత వేగంగా క్లియర్ చేస్తాం. సబార్డినేట్లతో ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంటిగ్రేటేడ్ కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల నిర్మాణాల డిజైన్, స్థలం గుర్తింపు అనేది ప్రస్తుతం మా ముందున్న టార్గెట్ అన్నారు కలెక్టర్ ఢిల్లీ రావు.
ఎన్టీఆర్ పేరు మీద జిల్లా రావడంతో ఎన్టీఆర్ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. తమ అభిమాననటుడి పేరు రోజూ ప్రజల నోళ్ళలో నానుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు.