ఏపీలో కొత్త జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతోంది. క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించనున్నారు సీఎం వైఎస్ జగన్. క్యాంపు కార్యాలయంకు చేరుకున్నారు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ, పలు శాఖల ఉన్నతాధికారులు. ఆయా జిల్లాల్లో నూతన కలెక్టర్లు, ఎస్పీలు బాధ్యతలు స్వీకరించారు. నూతన జిల్లాల ఆవిష్కరణ సందర్భంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు.