కుటుంబ సంబంధాలు ప్రమాదంలో పడ్డాయా? భార్యాభర్తల మధ్య అనుబంధం కాస్త అసూయ, ద్వేషం, స్వార్థానికి కారణం అవుతోందా?ప్రియుడి కోసం భర్తను, ప్రియురాలి కోసం భార్యను హతమార్చడానికైనా ఎవరూ వెనుకాడడం లేదు. ఎన్ని కేసులు బయటపడుతున్నా వివాహేతర సంబంధాలు ఆగడం లేదు.. ఆ ముసుగులో హత్యలు, అఘాయిత్యాలు సైతం ఆగడం లేదు. కట్టుకున్న భర్తను ప్రేమ గా చూసుకోవలసిన భార్యలు, మూడుముళ్ళు వేసి, జీవితాంతం తోడుగా వుండాల్సిన భర్త దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా తెలంగాణలో జరిగిన హత్య లో మూడు వారాలుగా మృతదేహం సైతం దొరకని పరిస్థితి .. మృతదేహం మాత్రం ఒక్క చోట నుంచి మరో చోటుకు మారుతుంది. కాని మృతదేహం మాత్రం పోలీసులకు దొరకడం లేదు. మృతదేహం దొరకక పోవడంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ఈ మృతదేహం ఇప్పుడు రాష్ర్టం కూడ దాటింది. దీంతో ఈ కేసు పోలీసులకు ఒక్క సమస్యగా మారిపోయింది.
ఖమ్మం జిల్లా లో హత్య జరిగితే.. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని ఎన్ టిఆర్ జిల్లాలో అది సమస్యగా మారిపోయిన కేసు ఇది. ఆ జిల్లాలో కూడా ఇప్పుడు కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒకరు హత్య చేసి శవాన్ని మాయం చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ లోని చేపల చెరువులో పడవేస్తే.. అక్కడ ఆ చేపల చెరువు యజమాని తమ చేపల వ్యాపారానికి నష్టం జరుగుతుందని… శవాన్ని ఏకంగా మాయం చేశాడు. మరోవాగులో మృతదేహాన్ని వేశాడు.. దీంతో ఇప్పుడు ఆ శవం దొరకక, అది ఎక్కడుందో తెలియక తలలు పట్టుకున్నారు. కులాలు వేరైనా ప్రేమబంధంతో వారిద్దరు పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకుని మూడేళ్ళు అవుతుంది. అయినప్పటికి భర్తంటే ఆమెకు ఇష్టం లేకుండా పోయింది. దీంతో మరో మగాడి సుఖాన్ని ఎంచుకుంది. దీంతో ఆ మగాడితో కలసి భర్తను అతి దారుణంగా హత్య చేయించింది. భర్తతో పాటు కూలీపని చేసుకునే మరో యువకుడితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఇద్దరూ కలిసి ఉండటం చూసిన భర్త… గొడవకు దిగాడు. కుటుంబంలో కలహాలు ప్రారంభం అయ్యాయి. దీంతో..ఇక లాభం లేదనుకున్న భార్య ఆమె ప్రియుడు పక్కా ప్రణాళికతో యువకుడిని అంతమొందించారు. ఓ వాహనంలో మృతదేహాన్ని ఆంధ్రకు తీసుకుని వెళ్లి చేపలచెరువులో పడవేశారు. ఆ శవం ఇప్పుడు అక్కడినించి మాయం అయ్యింది.
ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం ఆరెంపుల గ్రామానికి చెందిన సాయి చరణ అనే 28 ఏళ్ల యువకుడికి తల్లితండ్రి లేరు. నా అన్నవారు లేని ఆ యువకుడిని మేనమామలు పెంచి పెద్దచేశారు. ఖమ్మం నగరంలో చికెన్ వ్యర్థాలు తరలించేవాహన డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. యజమానితో కలిసి తిరుగుతున్న సమయంలో కొణిజర్ల మండలానికి చెందిన ఓ 24 ఏళ్ల యువతి పరిచయమైంది. ఇద్దరి మనసులు కలిసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి కులాలు వేరుకావడంతో యువతి కుటుంబీకులు పెళ్లికి ముందుగా అంగీకరించలేదు. అయినా.. కాని వారిద్దరు పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోవడంతో ఇద్దరూ ఒక్కటయ్యారు. 3 ఏళ్ల క్రితం వీరిద్దరికి వివాహం జరిగింది.
Read Also:Crime: ఆ పనిచేస్తున్నాడని భర్త మర్మాంగంపై దాడి చేసిన భార్య.. దాన్ని పోసి
ఆ యువతికి గతంలోనే పెళ్లి అయ్యింది. అయితే అది వారిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత కూలి పనులు చేస్తున్న సందర్బంగా ఈ సాయి చరణ్ తో ప్రేమ చిగురించింది. ఇద్దరు పెళ్లి చేసుకుని కొంతకాలం ఖమ్మం అర్బన్ మండలంలోని వైఎస్ ఆర్ నగర్ లో నివాసం ఉన్నారు. ఆ తర్వాత 2 ఏళ్లుగా రోటరీనగర్ లో గది అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఇలా కొంతకాలం వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగింది. ఇంతలో భర్తతో పాటే పనిచేసే మరో యువకుడితో భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం భర్తకు తెలిసి ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగాయి.
అయితే వీరి సంబంధం భర్తకు తెలియడంతో నిరంతరం గొడవలు జరుగుతున్నాయి. కాగా ఎలాగైనా భర్తను హత్య చేయించాలని భార్య ప్రియుడితో ప్రణాళిక వేసింది. ఆగస్టు ఒకటో తేదీన ఖమ్మం నగరానికి త్రీ టౌన్ పరిధిలోని ప్రకాశనగర్ బ్రిడ్జి వద్ద స్నేహితులతో కలసి మద్యం త్రాగుతున్నారు. ఈసందర్బంగా భర్తకు ప్రియుడు తో గొడవ జరిగింది. అప్పటికే వ్యూహాత్మకంగా చంపాలని ఉన్న ప్రియుడు మరి కొందరు కలసి రాడ్ తో కొట్టి సాయి చరణ్ ను హత్య చేశారు. హత్య తరువాత ఆ మృతదేహాన్ని మూటగట్టి డ్రమ్ములో వేసి చికెన్ వ్యర్థాలు సరఫరా చేసే వాహనంలో తరలించి ఏపీలోని విజయవాడ-తిరువూరు మధ్యలో చీమలపాడు సమీపంలోని ఓ చేపల చెరువులో మృతదేహాన్ని పడేశారు.
భర్తను హత్యచేయించిన భార్య.. ఏమీ తెలియని నంగనాచిలా వ్యవహరించింది. తన భర్త కనిపించడం లేదు అంటూ టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సాయి చరణ్ కోసం కోళ్ల దుకాణం యజమాని కూడ ఆరా తీయడం ప్రారంభించారు. అయితే పోలీసులకు అనుమానం వచ్చింది. భార్యను విచారించారు. దీంతో అసలు వ్యవహారం బయట పడింది. భార్య ప్రవర్తన, ఆమె ఫోన్ కాల్ డేటా సేకరించిన పోలీసులు మరో యువకుడిని గుర్తించారు. అతడిని స్టేషన్ కు తీసుకొచ్చి విచారించడంతో నేరం అంగీకరించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లోని ఎన్ టిఆర్ జిల్లాలో చేపల చెరువులో సాయి చరణ్ మృతదేహానికి రాయి కట్టి వేశారు. నాలుగురోజుల తరువాత ఆ మృతదేహం బయటకు వచ్చింది. అయితే ఆ చేపల చెరువులో లక్షలాది రూపాయల విలువ చేసే చేపలు ఉన్నాయి. ఇది సమస్యగా అవుతుందని ఆ చేపల చెరువు యజమాని ఆ మృతదేహాన్ని బయటకు తీసి దానిని మరో కాలువలో పడవేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ మృతదేహం దొరకడం లేదు. ఎక్కడికో కొట్టుకుని పోయింది. దీంతో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. మొత్తం మీద ఈ కేసు వ్యవహారం అంతా పోలీసులకు పెద్ద తలనొప్పి గా తయారు అయ్యింది.