నోయిడాలోని జేపీ ఆస్పత్రిలో ఇద్దరు యువకులు రెచ్చిపోయారు. మగ, మహిళా సెక్యూరిటీ గార్డులపై ఇష్టానురీతిగా దాడులకు పాల్పడ్డారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఆస్పత్రి సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఒకరిని అరెస్ట్ చేయగా.. ఇంకొకరు పరారీలో ఉన్నారు. ఈ ఘటన బుధవారం చోటుచేసుకుంది.
ఇది కూడా చదవండి: Mamata Banerjee: బెంగాల్ వరదల వెనుక ‘కుట్ర’.. కేంద్రమే కారణం!
నోయిడాలోని జేపీ ఆస్పత్రికి అక్షయ్ సెహగల్, వైభవ్ సెహగల్ అనే వ్యక్తులు వచ్చారు. లిఫ్ట్ దగ్గర మగ సెక్యూరిటీ గార్డు వారిని అడ్డుకున్నాడు. ఐడీ కార్డు చూపించమని అడిగాడు. అయితే వారి దగ్గర చెల్లుబాటు అయ్యే ఆస్పత్రి కార్డు లేదు. దీంతో రోగి దగ్గరకు వెళ్లకుండా అడ్డుకున్నాడు. దీంతో రెచ్చిపోయిన యువకులు.. సెక్యూరిటీ గార్డుపై ఇష్టానురీతిగా దాడి చేశారు. అక్కడే ఉన్న మహిళా సెక్యూరిటీ గార్డు విడిపించే ప్రయత్నం చేసినా ఆమెను కూడా తోసేశారు. ఇలా ఇష్టమొచ్చినట్లు దాడి చేస్తూనే ఉన్నారు. సమీపంలో ఉన్నవారు ఆపే ప్రయత్నం చేసినా దాడి చేస్తూనే ఉన్నారు. ఈ దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇద్దరు యువకుల్లో ఒకరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మరొకరు పరారీలో ఉన్నారు.
ఇది కూడా చదవండి: Kolkata: మాజీ ప్రిన్సిపాల్ సందీప్ ఘోష్‌కు బెంగాల్ సర్కార్ బిగ్ షాక్.. మెడికల్ రిజిస్ట్రేషన్ రద్దు
ఆస్పత్రుల్లో ఇలాంటి ఘటనలు తరుచుగా జరుగుతూనే ఉంటున్నాయి. ఇటీవల గుజరాత్‌లో ఎమర్జెన్సీ వార్డు నుంచి రోగి బంధువులను వెళ్లమన్నందుకు డాక్టర్‌పై విపరీతంగా దాడి చేశారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
नोएडा के JP हॉस्पिटल में गुंडागर्दी का ये Video देखिए –
लिफ्ट में जाने को लेकर कहासुनी हुई तो 2 दबंग युवकों ने सिक्योरिटी गार्ड को जमीन पर गिराकर पीटा। बचाव में आई महिला गार्ड को भी नहीं बख्शा।@Jyoti_karki_ pic.twitter.com/bavqImBiqu
— Sachin Gupta (@SachinGuptaUP) September 18, 2024
ભાવનગર જિલ્લાના સિહોરની હોસ્પિટલમાં તબીબને ધમકી આપ્યાની ફરિયાદ.
સિહોરની ખાનગી હોસ્પિટલમાં ચપ્પલ બહાર કાઢવા જેવી સામાન્ય બાબતે તબીબ પર હુમલો કર્યો.
મહિલા દર્દીને સારવાર માટે લાવેલા લોકોને ઇમરજન્સી વોર્ડમાં બુટ ચપ્પલ બહાર કાઢીને આવવાનું કહેતા હુમલો કર્યો#bhavnagar pic.twitter.com/9hfA5EWGT6
— Bhavik Sudra (@BhavikSudra3) September 14, 2024