నోయిడాలోని సెక్టార్-8 ప్రాంతంలో ఆదివారం ఒక ప్లాట్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించడంతో సుమారు 35 కార్లు దగ్ధమైనట్లు అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. స్కోడా స్క్రాప్ చేసిన కార్లను ఖాళీ స్థలంలో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఇక అగ్నిమాపక శాఖ తెలిపిన వివరాల ప్రకారం.., మధ్యాహ్నం 3 గంటల సమయంలో మంటల గురించి కాల్ వచ్చిందని., తాము వెంటనే ఫైర్ ఇంజెన్స్ తో అక్కడికి చేరుకుంట్లు తెలిపారు.
Iceland: ఐస్‌లాండ్ అధ్యక్షురాలిగా ఎన్నికైన ‘హల్లా టోమస్‌డోత్తిర్’..
తాము సంఘటన స్థలానికి చేరుకున్నప్పుడు స్కోడా స్క్రాప్డ్ కార్లు మంటల్లో చిక్కుకున్నాయని., మంటలను ఆర్పడానికి ఆరు ఫైర్ ఇంజెన్స్ ను ఉపయోగించినట్లు తెలిపారు. ఈ ఘటనలో దాదాపు 35 కార్లు మంటల్లో కాలిపోయాయని అగ్నిమాపక శాఖ సీనియర్ అధికారి తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం కానీ.., ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని వారు తెలిపారు. ఇక అగ్నిప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని వారు తెలిపారు.
Nirmal: రిటైర్డ్ ఉద్యోగి ఖాతాలో జీతం జమ..తిరిగి తీసుకోవాలని అధికారులకి లేఖ