కరోనా పోవాలి.. మళ్లీ సాధారణ పరిస్థితులు రావాలి.. అన్ని పండులను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాక్షించారు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిజామాబాద్‌లోని పాలిటెక్నిక్ మైదానంలో నిర్వహించిన దసరా వేడుకకల్లో పాల్గొన్న ఆమె.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో దసరా వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని గుర్తు చేశారు.. అయితే, కరోనా ప్రభావం వల్ల రావణ దహనం నిర్వహించడం లేదని తెలిపిన ఆమె.. కరోనా మహమ్మారిని తరిమి కొట్టాలని దుర్గాదేవిని వేడుకుందామని.. మళ్లీ సాధారణ పరిస్థితుల్లో ప్రజలు అన్ని పండుగలను సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు… ఇక, స్థానిక రామాలయంలో నిర్వహించిన జమ్మిపూజలో కూడా పాల్గొన్నారు ఎమ్మెల్సీ కవిత దంపతులు.
also read: గెలిచే టీం ను అంచనా వేయండి 50 లక్షలు గెలవండి