రైతుల పాలిట శాపాలుగా మారుతున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రైతు ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న ప్రభుత్వం రైతుల ప్రాణాలు పోతున్న పట్టించుకోవడం లేదు.ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో నిండు ప్రాణం బలి అయింది. తాజాగా ధాన్యం కొనుగోళ్లలో జాప్యం ఓ రైతు మృతికి కారణమైంది. కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐలాపూర్ గ్రామానికి చెందిన రైతు బీరయ్య(57) గుండె పోటుతో మృతి చెందాడు. తన ధాన్యం కుప్ప వద్ద కాపలా కోసం వచ్చిన రైతు బీరయ్య అక్కడే నిద్రించాడు. అర్ధరాత్రి గుండెపోటు రావడంతో ధాన్యం కుప్పపైనే ప్రాణాలు విడిచాడు. రైతు బీరయ్యకు ఎకరం సొంత పొలం ఉండగా.. మరో 3 ఎకరాలు కౌలుకు తీసుకుని వరి సాగు చేశాడు.
ఇటీవల కోతలు పూర్తి చేసి గత నెల 27న లింగంపేట కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చాడు. అదే రోజు అక్కడున్న సిబ్బంది సీరియల్ నంబర్ రాసుకోగా.. బీరయ్య వంతు 70 నంబర్ వచ్చింది. అయితే నిన్న, ఈరోజు దీపావళి, అంతకుముందు రోజు వర్షం కారణం గా కాంటా వేయలేదు. ధాన్యం కేంద్రానికి తెచ్చినప్పటి నుంచి రాత్రి, పగలు కాపలా ఉండాల్సి వస్తోంది. ధాన్యం తూకం వేసేందుకు ఒక్కో రైతు 20 రోజులకు పైగా ఎదురుచూడాల్సి వస్తోంది.
Also Read
- Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
- CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
- El Nino : తెలంగాణలో కరువు ముప్పు.. రెండో పంట వేయొద్దంటూ మంత్రి కీలక విజ్ఞప్తి
- Indigo : పవర్ బ్యాంక్లో మంటలు.. శంషాబాద్లో ఇండిగో విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
లింగంపేట కేంద్రానికి మొత్తం 207 మంది రైతులు ధాన్యం తీసుకురాగా.. వారం రోజుల నుంచి కేవలం 23 మందివి మాత్రమే తూకం వేశారు. రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండటం, 3 రోజులు కాంటా బంద్ ఉండటంతో మానసికంగా ఆందోళన చెంది బీరయ్య మరణించ వచ్చని రైతులు అభిప్రాయ పడుతున్నారు. కామారెడ్డి జిల్లాలో మొత్తం 34 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా… అన్ని చోట్లా కొనుగోళ్లలో జాప్యం జరుగుతోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
-
AP Mayor Seats: నేడు సీఎం చంద్రబాబు నివాసంలో కీలక భేటీ.. మేయర్ పీఠాలపై కూటమి కసరత్తు!
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Best Post Office Scheme: పథకం చిన్నదే అయినా.. రూ.25 లక్షలను తెచ్చిపెడుతుంది..
-
Indiramma Towers: గుడ్న్యూస్.. జిల్లాల్లో కూడా ఇందిరమ్మ టవర్స్.. రూ.4 లక్షలకే ఫ్లాట్..
ట్రెండింగ్
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్స్టీన్ను మించిన భారతీయ బాలమేధావి..